ఎయిర్‌పోర్ట్ ముసుగులో చెబుతున్నవి మాయమాటలు కాదా?

ఎయిర్ పోర్టు విషయంలో అమరావతి రాజధానికి స్మార్ట్ పరిశ్రమలు రావాలంటే.. కొత్త ఎయిర్ పోర్టు కావాలంటూ మంత్రి నారాయణ చెబుతున్న మాటలన్నీ మాయలేనని, ప్రజలను మభ్యపుచ్చడమే అని అంతా అనుకుంటున్నారు.

అమరావతి కోసం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కావాలి. అందులో అత్యద్భుత హంగులు ఉండాలి. అంటే కనీసం ఐదువేల ఎకరాల స్థలం కావాలి. ఐదువేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు కావాలీ.. అంటే ఆ మేర ల్యాండ్ పూలింగ్ అనేది 30 వేల ఎకరాలు సమీకరించాలి. .. అంటూ ఏపీ సర్కారు కొన్ని రోజులుగా కొత్తపాట పాడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం.. ప్రజలు ల్యాండ్ పూలింగ్ కు ఒప్పుకుంటే సమీకరిస్తాం.. లేదంటే భూసేకరణకు వెళతాం.. కానీ భూసేకరణకు వెళితే స్తలాలు ఇచ్చిన రైతులు నష్టపోతారు.. అంటూ మంత్రి నారాయణ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇండైరక్టు బెదిరింపులకు దిగుతున్నారు.

అంతే కాదు.. అమరావతి రాజధాని కోసం ఆల్రెడీ 33 వేల ఎకరాలకు పైగా లాండ్ పూలింగ్ లో ఇచ్చిన రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకకుండా వారికి మాయమాటలు చెబుతున్నారు. ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వస్తేనే.. ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి. మీ భూముల విలువ బాగా పెరుగుతుంది.. అంటూ వారిని దాదాపుగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ.. ఇదంతా పెద్ద మాయలాగా కనిపిస్తోంది.

అమరావతి నగరానికి సమీపంగా కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను సమర్థించుకోవడానికి మంత్రి నారాయణ.. హైదరాబాదు ఉదాహరణ చెబుతున్నారు. హైదరాబాదులో ఒక ఎయిర్ పోర్టు ఉన్నప్పటికీ.. చంద్రబాబు శంషాబాద్ ఎయిర్ పోర్టును కట్టారు.. అని చెబుతున్నారు. బాగానే ఉంది.. మరి అదే హైదరాబాదు ఉదాహరణను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మొత్తానికి కలిపి ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక్కటే ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీరుస్తూ ఆ ఎయిర్ పోర్ట్ బిజీగా ఉంటోంది. కానీ ఏపీ పరిస్థితి ఏమిటి?

ఆల్రెడీ అక్కడ మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం), తిరుపతిల్లో ఉన్నాయి. మరో నాలుగు డొమెస్టిక్ ఎయిర్ పోర్టులు రాజమండ్రి, కర్నూలు, పుట్టపర్తి, కడపల్లో ఉన్నాయి. అసలు రాయలసీమలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉంది. మరికొన్ని రాబోతున్నాయి. అక్కడ విమాన ప్రయాణాల ఆక్యుపెన్సీ మాత్రం ఘోరంగా ఉంది. విశాఖ నుంచి విజయవాడ కు రావాలంటే స్ట్రెయిట్ ఫ్లైట్లు రద్దయిపోయాయి.. ఆక్యుపెన్సీ చాలినంత లేక! విశాఖ టూ విజయవాడ వయా హైదరాబాదు రావాల్సి వస్తోందని గంటా పెట్టిన పోస్టు గుర్తు చేసుకోవాలి.

గన్నవరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయమే ప్రస్తుతం రాజధాని అమరావతికి ఎయిర్ పోర్టు కింద పరిగణనలో ఉంది. ఆ ఎయిర్ పోర్టునుంచి ప్రస్తుత వెలగపూడి సచివాలయానికి 35-36 కిమీల దూరం ఉంది. హైదరాబాదులో సచివాలయానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉన్న దూరం కూడా ఖచ్చితంగా అంతే. మరి.. దానినే రాజధానికి ఉన్న అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అనుకోకుండా.. కొత్త విమానాశ్రయం పేరుతో డ్రామాలు ఎందుకు అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన ఓకే. అందులో కొంత లాజిక్ ఉంది. అప్పటికీ.. అహ్మాదాబాద్ లోని అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ 250 ఎకరాలకు మించడం లేదు. కొత్త అమరావతిలో 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతానని చంద్రబాబు అతిశయంగా చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఎయిర్ పోర్టు విషయంలో అమరావతి రాజధానికి స్మార్ట్ పరిశ్రమలు రావాలంటే.. కొత్త ఎయిర్ పోర్టు కావాలంటూ మంత్రి నారాయణ చెబుతున్న మాటలన్నీ మాయలేనని, ప్రజలను మభ్యపుచ్చడమే అని అంతా అనుకుంటున్నారు.

11 Replies to “ఎయిర్‌పోర్ట్ ముసుగులో చెబుతున్నవి మాయమాటలు కాదా?”

  1. అవును మరి.. రుషికొండ పాలస్ ముసుగులో చెప్పినవి మాయమాటలు కాదు.. సుప్రభాతాలు..

    రుషికొండ కట్టాడు జగన్ రెడ్డి.. దాని చుట్టూ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా..?

    చిన్న ఇడ్లి కొట్టు అయినా వచ్చిందా ..?

    500 కోట్లు పెట్టి కట్టుకున్నాడు.. ఒక సమాధి ని..

    1. Katti gelichunte chupindhi vundevadu develpment. Oka building ki 30000 acres agriculture fields ki link petti compare chesthunnav chudu, you are the real TDP supporter. Neelanti valle CBN and his son still exist in politics 

    2. Endukandi antha hate? Government building ani andariki telisinde…daniki palace ani peru patti anavasara radhantam…repu amaravati katte projects anni palace lena? Samadhulena? Okallu chesthe paryavarana vidhvamsam inkollu chesthe swargam…

  2. మాయ మాటలకు బ్రాండ్ అంబాసడర్ మన అన్నియ్యే . చంద్రబాబు తన జీవితంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. కానీ మన వై యస్ జాతి వాళ్ళ చరిత్రలో ఏ ప్రాజెక్ట్ అయినా కనీసం గ్రౌండ్ అయ్యిందా?

  3. andhra people think that che ddi batch “చెబుతున్న మాటలన్నీ మాయలేనని, ప్రజలను మభ్యపుచ్చడమే అని అంతా అనుకుంటున్నారు.”

  4. మభ్య పెట్టటం అవన్నీ నాకు తెలీదు కాకపోతే, మల్లి చంద్రబాబు గారు ఇలా మొదలు పెట్టారేంట్రా బాబు అని మాత్రం నాకు అనిపిస్తుంది. గన్నవరం విమానాశ్రయం మనకి వుంది. దాన్ని పెద్దది చేస్తే సరిపోద్ది. ఇంకొకటి కట్టటం అంటే నాకు తెలిసి అనవసరం. మనదగ్గర వున్నా జనాభా కోసం విమానాలు వెయ్యరు. పోయిన సారి గన్నవరం నుంచి సింగపూర్ వేసినప్పుడు విమానం దాదాపు ఖాళి. ఇప్పుడు అన్ని డైరెక్ట్ విమానాలు వున్నాయి, విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే వాళ్ళు అది కూడా రోజు 200-300 మంది వుండరు. తమిళనాడు నుంచి మధురై, కోవై, చెన్నై నుంచి డైరెక్ట్ వున్నాయి. ఎందుకంటే అక్కడినుంచి పని వాళ్ళు బాగా వెళ్తారు. చెన్నై అనేది పెద్ద వూరు. ఇంకా ఒంగోలు నుంచి దక్షిణిమ అంటా చెన్నై దగ్గర అవుంతుంది. ఖమ్మం నుంచి పైన హైదరాబాద్ వెళ్తారు. రాజముండ్రి పైన మల్లి విశాఖపట్నం దగ్గర. ఇవన్నీ పెట్టుకొని మల్లి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చెయ్యటం మాత్రం వృధా.

  5. One thing is sure, chandra babu led Govt is going to make guntur as ash. Already 30000 acres again 40000 acres what will they do. They can not build city like Bangalore or Chennai or hyderbad within 5 years. Development should be slow and steady with proper plan.  More than jagan TDP is doing harm to guntur dist.

Comments are closed.