సూపర్ స్టార్ బిరుదుకు సిసలైన కొలమానం

5 దశాబ్దాల కెరీర్ లో మమ్ముట్టి టచ్ చేయని జానర్ లేదు. ఆయన చేయని ప్రయోగం లేదు. ఇప్పటివరకు 400కు పైగా సినిమాలు చేశారాయన.

సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎన్ని వందల కోట్లు వచ్చాయి.. ఓ హీరోను సూపర్ స్టార్ గా మార్చేవి ఇవి మాత్రమేనా? కెరీర్ లో వంద కోట్ల సినిమా లేకపోతే సూపర్ స్టార్ కాలేడా? అలాంటప్పుడు మమ్ముట్టిని సూపర్ స్టార్ అనకూడదా?

మమ్ముట్టి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన వంద కోట్ల మార్క్ చేరుకోలేదు. అదే ఇండస్ట్రీలో కొంతమంది ఆ మార్క్ అందుకున్నారు. కానీ వాళ్లు సూపర్ స్టార్స్ కాదు, మమ్ముట్టి మాత్రమే సూపర్ స్టార్.

5 దశాబ్దాల కెరీర్ లో మమ్ముట్టి టచ్ చేయని జానర్ లేదు. ఆయన చేయని ప్రయోగం లేదు. ఇప్పటివరకు 400కు పైగా సినిమాలు చేశారాయన.

మమ్ముట్టికి అతిపెద్ద పోటీ మోహన్ లాల్. ఇంకా చెప్పాలంటే మోహన్ లాల్ స్థాయిలో మమ్ముట్టి కమర్షియల్ హిట్స్ అందుకోలేకపోయారు. ఆయన కెరీర్ లో భీష్మ పర్వం (2022) మాత్రమే పెద్ద హిట్. అది కూడా వంద కోట్లు దాటలేదు. కానీ మమ్ముట్టి సూపర్ స్టార్.

ఎందుకంటే, ఆయన ఎంచుకున్న కథలు అలాంటివి. అందులో ఆయన పోషించిన పాత్రలు అలాంటివి. ఉత్తమ నటుడిగా 3 సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు మమ్ముట్టి. కేవలం నటించడం మాత్రమే మమ్ముట్టికి తెలుసు. మిగతా లెక్కలేవీ ఆయన వేసుకోరు.

1983లో ఏకంగా 36 సినిమాలు చేశారు మమ్ముట్టి. 1984లో 34, 1985లో 28, 1986లో 35 సినిమాల్లో నటించారు. 73 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ యాక్టింగ్ ను ఆస్వాదిస్తున్నారు మమ్ముట్టి.

ఏదైనా ఒక విలక్షణ పాత్ర పోషించాలంటే ఇప్పటికీ అందరూ చూసేది అతడి వైపే. అది ఆయన సాధించిన ఘనత. అందుకే ఆయన సూపర్ స్టార్.

9 Replies to “సూపర్ స్టార్ బిరుదుకు సిసలైన కొలమానం”

  1. 100 కోట్లు ఏంట్రా అయ్య, 200 కోట్ల సూపర్ హిట్టు యాత్ర సినిమా ఉందిగా .. అందుకే ఆయన సూపర్ స్టార్.

  2. ముమ్మట్టి గారికి మన సర్టిఫికెట్ లు అవసరం లేదు మీరు సర్టిఫికెట్ ఇస్తే దానివలన ఆయనకు నష్టం తప్ప ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం సర్టిఫికెట్ ఇచ్చేమని జనాలకు తెలిస్తే ఆయనను కూడా మనస్థాయిలో చూస్తారు

  3. GA గాడికి మమ్ముటి అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?, అతను రాజశేఖరరెడ్డి క్యారెక్టర్ చేశాడు కాబట్టి

Comments are closed.