సెలబ్రిటీలు.తిరుమల దర్శనాలూ!

కొంచెం కామన్ మాన్ లకు కూడా తిరుమల బ్రేక్ దర్శనం రేటు కాస్త అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుంది.

తిరుమల వెంకన్న దర్శనం అన్నది సామాన్యుల కల. లాటరీలో దర్శనం టికెట్ సంపాదించడం, క్యూ లైన్లలో వేచి వుండడం, క్షణ కాలం పాటు దర్శనం చేసుకురావడం ఇదంతా ఓ ప్రాసెస్. కానీ సెలబ్రిటీలకు అలా కాదు. మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రానికి బ్రేక్ దర్శనం ఏర్పాట్లు జరిగిపోతాయి. గెస్ట్ హవుస్ రెడీ అవుతుంది. దర్శనం చేసుకుని, ఆశీర్వచనం తీసుకుని, ఎర్ర శాలువా కప్పించుకుని, బయటకు వచ్చి ఫొటోలకు, వీడియోలకు ఫోజ్ ఇవ్వడమే తరువాయి.

సినిమా వాళ్లకు తిరుమల దర్శనం పెద్ద కష్టం కాదు. కానీ ఇటీవల కొంత మంది సినిమా జనాలకు తిరుమల దర్శనం అంటే లోకల్ గా వున్న ఆలయానికి వెళ్లి వచ్చినంత సులువు అయిపోయింది. అది వాళ్ల అదృష్టం అనుకోవాలో. సామాన్యుడి దురదృష్టం అనుకోవాలో?

గత వైకాపా హయాంలో తిరుపతి దర్శనాలను రాజకీయ నాయకులు విపరీతంగా దుర్వినియోగం చేసారని, అమ్ముకుని బాగా సంపాదించారని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో సినిమా సెలబ్రిటీలు తిరుమల వెళ్లడం రావడం వుండేది కానీ మరీ కొన్ని మొహాలే తరచు కనిపిస్తున్నాయి.

మీనాక్షి చౌదరి, థమన్ లాంటి వాళ్లు తరచు తిరుమల దర్శనం చేసుకుంటూనే వున్నారు. థమన్ తో పాటు మరో ఒకరిద్దరు ఎప్పుడూ వుంటారు. అసలు ఒక సెలబ్రిటీకి లేదా ఒక ఆధార్ కార్డ్ కు నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి మాత్రమే దర్శనం అనే నిబంధన వుంటే ఎలా వుండేదో?

థమన్ చూస్తే జలస్ అనిపిస్తుంది ఎవరికైనా. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కువ సార్లు తిరుమల దర్శనం చేసుకోగల అదృష్టం వున్న ఏకైక సినిమా సెలబ్రిటీ థమన్ నే నేమో? మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో ఇది మూడోసారేమో?

కొంచెం కామన్ మాన్ లకు కూడా తిరుమల బ్రేక్ దర్శనం రేటు కాస్త అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుంది. ఈ సెలబ్రిటీలు టికెట్ లు ఎలాగూ తీయరు. కామన్ మాన్ కు అయిదు వేలకే బ్రేక్ దర్శనం అంటే బాగుంటుందేమో? ఆలోచించాలి పెద్దలు.

9 Replies to “సెలబ్రిటీలు.తిరుమల దర్శనాలూ!”

  1. అయ్యో.. అవునా.. మన రోజక్క వారానికి మూడు సార్లు దర్శనం చేసుకొంటుంటే..

    ఈ నీతి సూక్తులు అప్పుడు ఆ బండ పందికి చెప్పాల్సింది..

  2. నగరి పిర్రల ప0ది వారానికి 7 రోజులు, ప్రతీ సారి వందల మందిని ఏసుకుని ఊపుకుంటూ పోయేది.. బైటకి వచ్చి రాజకీయ భూతులు వదిలేది.. మరి దర్శన యాపారం చేసిన ఆ బర్రెకి, ఎప్పుడైనా ఇది పద్ధతి కాదు అంటూ నీతులు చెప్పావా??

Comments are closed.