అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే వాళ్లు వాడే వస్తువులు అక్కడే తయారు కావాలని, దిగుమతులు తగ్గి, ఎగుమతులు పెరగాలని ఎమ్బీయస్: టారిఫ్‌ల తేనెతుట్ట కదల్చనేల? అనే వ్యాసంలో వాదించాను. 2024లో అమెరికా వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్) 1130 బిలియన్ డాలర్లుంది. అంటే ఎగుమతుల కంటె దిగుమతులు ఆ మేరకు ఎక్కువున్నాయన్నమాట. ఇది 2023 కంటె 25% ఎక్కువ. వస్తువుల దిగుమతి పెరగడంతో యీ లోటు పెరిగింది. ఎగుమతులు యీ మాత్రమైనా వున్నాయంటే, అది ఆయుధాల పుణ్యమే! 2015-19 పీరియడ్‌తో పోలిస్తే 2020-24 పీరియడ్‌కు అమెరికా ఆయుధాల ఎగుమతి 21% పెరిగింది. 107 దేశాలకు అమ్మింది మరి! ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో 46% వాటా అమెరికాదే! తర్వాతి స్థానం 10% వాటాతో ఫ్రాన్స్!
ప్రపంచంలో శాంతి నెలకొంటే, ఎగుమతి ఆదాయం లేక అమెరికా విలవిల్లాడ వలసినదే! ఎక్కడో అక్కడ యుద్ధం జరగాలని అమెరికా ఎందుకు కృషి చేస్తుందో యీ అంకెలు చెప్తాయి. ఉక్రెయిన్‌కి మద్దతు ఉపసంహరించి, అక్కడ యుద్ధం సాంతం ఆపేస్తే ఆయుధాల ఎగుమతులు తగ్గుతాయి. కానీ దేశ ప్రజల వస్తువుల వినియోగం తగ్గదు కాబట్టి దిగుమతులు అలాగే వుండి, 2025లో లోటు యింకా పెరగవచ్చు. లోటును నియంత్రించాలంటే వస్తువులను దిగుమతి చేసుకోవడం తగ్గించి, స్థానికంగా ఉత్పత్తి చేయించాలి. ఇంకో విషయం కూడా గమనించాలి. ఎగుమతుల్లో 25% సేవలే. అంటే వస్తూత్పత్తిలో, వస్తువుల ఎగుమతిలో అమెరికా చాలా వెనకబడి వుందన్నమాట.
ఏ దేశంలోనైనా సరే, స్థానికంగా ఉత్పత్తి జరగాలి. వీలైతే ఎగుమతి చేసి, లాభాలు సంపాదించాలి. స్థానిక ఉత్పత్తులకు యింపోర్టెడ్ వాటి అంత క్వాలిటీ వుండకపోవచ్చు. అందువలన ధర ఎక్కువైనా ఫారిన్ సరుకు కొనడానికి జనాలు ఎగబడతారు. 1960, 70లలో మన దేశపు పరిస్థితి యిలాగే వుండేది. ఇక్కడ తయారు చేయగల వస్తువుల దిగుమతిని ప్రభుత్వం అనుమతించేది కాదు. మనం తయారు చేయలేని వస్తువులను మాత్రమే దిగుమతికి అనుమతిస్తూ, సుంకాలు ఎక్కువగా వేసి, వాటి ధర బాగా ఎక్కువగా వుండేట్లు చూసేది. దానితో ప్రజలు స్థానికంగా తయారయ్యే వాటినే కొనేవారు. ప్రజల మోజు చూసి, స్మగ్లర్లు విదేశీ వస్తువులను చాటుగా తెచ్చి అమ్మేవారు. ఇందిర హయాం వరకూ విదేశీ వస్తువులపై శీతకన్ను అలాగే వుండేది. కొన్నిటిని మాత్రమే ఆమె అనుమతించింది. రాజీవ్ హయాం వచ్చేసరికి గేట్లు ఎత్తేశాడు. దాంతో విదేశీ సరుకులు మార్కెట్లను ముంచెత్తాయి.
మనం తయారు చేయలేని హై టెక్నాలజీ గూడ్స్, భారీ యంత్రాలు వంటివి దిగుమతి చేసుకుంటే అర్థముంది కానీ చెప్పులు, షర్టులు, కూలింగ్ గ్లాసెస్ దగ్గర్నుంచి దిగుమతి చేసుకోవడంలో అర్థమేముంది? పివి హయాంలో గ్లోబలైజేషన్ పేర గేట్లు పీకేసేసరికి మన దేశంలో కాటేజీ యిండస్ట్రీస్ దగ్గర్నుంచి, భారీ పరిశ్రమల వరకు మూతపడే పరిస్థితి వచ్చింది. పరిశోధనలు కుంటుపడ్డాయి. స్క్రూడ్రైవర్ టెక్నాలజీ వచ్చేసింది. విడి భాగాలు దిగుమతి చేసుకుని వాటిని యిక్కడ బిగించి, మేడిన్ ఇండియా అని స్టాంపు కొట్టి యిదీ మన పారిశ్రామిక రంగం అని చెప్పుకుంటున్నాం. అమెరికా బాగుపడాలంటే 1970ల నాటి ఇండియా నాటి పరిస్థితులకు మళ్లాలి. గ్లోబలైజేషన్‌కు స్వస్తి చెప్పి ‘ప్రొటెక్షనిజం’ విధానానికి మరలి, దేశీయ పరిశ్రమలను కాపాడుకోవాలి. ప్రజలకు స్వదేశీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేయాలి. దాని కంటె ముందు పరిశ్రమలను నెలకొల్పాలి.
ఇది కనీసం రెండేళ్లు పట్టే వ్యవహారం. కానీ పరిశ్రమలు ప్రారంభించడమంటూ జరిగితే కొందరికైనా ఉపాధి కలుగుతుంది. ‘అమెరికాలో కార్మికుల జీతాలు ఎక్కువ, అంత జీతాలతో పరిశ్రమలు నడపడం కిట్టుబాటు కాదు. అందువలన దిగుమతులు చేసుకుని కాలక్షేపం చేయడమే బెటరు.’ అని కొందరు వాదిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినది కార్మికులు వినియోగదారులు కూడా. వారి చేతికి జీతాలు వస్తేనే మార్కెట్లో సరుకులు మూవ్ అవుతాయి. హెచ్చు జీతాలివ్వడం వలన వస్తువుల ధర పెరుగుతుందంటే పెరగనీయండి. వేరే దేశాలు ఖైదీల చేత పని చేయించో, రోజుకి 14 గంటలు పని చేయకపోతే వుద్యోగం పీకేస్తామని బెదిరించో చేయించిన వస్తువులతో బజార్లు నింపితే కొందరు మధ్యతరగతి వారు సంతోషించ వచ్చు కానీ నిరుద్యోగం మాటేమిటి? దాని కారణంగా సమాజంలో అశాంతి రగిలితే దానికి భారీ మూల్యం చెల్లించవలసి వుంటుంది.
కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి కాపిటలిస్టు దేశాలు సంక్షేమ రాజ్యం పేరుతో నిరుద్యోగులకు డోల్స్ (భృతి) యిచ్చి, కార్మికులకు విపరీతంగా జీతాలు పెంచి చెడగొట్టారు. యుకెలో చెప్పుల దుకాణంలో గమనించాను. మోడల్స్ ఏమున్నాయో చూపించే సేల్స్ బాయ్ లేడు. బాయ్‌ను పెట్టుకుంటే వాడికివ్వాల్సిన జీతం కిట్టుబాటు కాదట. అందువలన వాణ్ని నిరుద్యోగిగా వుంచి భృతి యిస్తారట. గంటకిచ్చే వేతనం తగ్గించి, వుద్యోగమిస్తే షాపుకి, అతనికే కాదు, కన్స్యూమర్‌కి సుఖం. విద్య, వైద్యం విషయంలో కూడా పూర్తి ఉచితంగా యివ్వాల్సిన పని వుందా? నేను ప్రభుత్వ స్కూల్లోనే, ప్రభుత్వ కాలేజీలోనే చదువుకున్నాను. 9వ తరగతి నుంచి ప్రతీ నెలా ఫీజులు కడుతూనే వెళ్లాను. ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఎంతో కొంత యూజర్ చార్జీలు తీసుకుంటే మంచిది.
‘చౌక’ దిగుమతులు కట్టిపెట్టి, స్థానికంగా ఉత్పత్తికై సంకల్పించి, జీతాల విషయంలో కార్మికులతో రేషనలైజ్ చేసుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. ఎందుకంటే అప్పుడు ఏన్సిలరీ యిండస్ట్రీస్ కూడా చాలా వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ పునర్నిర్మాణం చాలా క్లిష్టమైంది. సోవియట్ యూనియన్ అఫ్గనిస్తాన్ వంటి యితర దేశాల్లో భారీగా ఖర్చు చేస్తూ, దేశ ప్రజల కడుపు మాడ్చింది. బ్రెడ్ కోసం జనం క్యూలలో నిలబడేవారు. ఇలా అయితే తిరుగుబాటు వస్తుందని భయపడిన గోర్బచేవ్ పెరిస్త్రోయికా పేరుతో పాలసీలన్నీ రివర్స్ చేయడం మొదలుపెట్టాడు. డౌన్‌లో వెళ్లేటప్పుడే బ్రేకులు తరచుగా వేస్తూ, బండిని కంట్రోలు చేయగలగాలి, లేకపోతే బోల్తా పడుతుంది. సోవియట్ యూనియన్ విషయంలో అదే జరిగి విచ్ఛిన్నమైంది. కానీ ఛేంజ్ ప్రాసెస్‌ని చైనా బాగా హేండిల్ చేయగలిగింది. చూస్తుండగానే కమ్యూనిజం లోంచి కాపిటలిజం లోకి మారి, ప్రజలకు దాన్ని అలవాటు చేసింది.
ట్రంప్ తన దేశస్తుల డాబుసరిని, బద్ధకాన్ని వదిలించి, ‘ఇన్నాళ్లూ కాళ్లు బారచాపుకుని కూర్చుని, అప్పుచేసి పప్పుకూడు తిన్నాం. ఇకనైనా మన కాళ్ల మీద మనం నిలబడి యీ కష్టకాలాన్ని ఎదుర్కోవాలి. లేకపోతే చైనా మనను కబళించి వేస్తుంది.’ అని నచ్చచెప్పి, మార్పుకు సిద్ధపరచాలి. దానికి ముందు మనవి డొల్ల బతుకులు సుమా అని ప్రజలకు చాటి చెప్పాలి. మనం గ్రేట్, మనమంటే ప్రపంచమంతా వణుకుతుంది వంటి సొల్లు కబుర్లు మానాలి. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనడంలో ప్రస్తుతం గ్రేట్‌గా లేదని తెలుస్తోంది కదా. నేను కావాలంటే ఏమైనా చేయగలను అంటూ టారిఫ్‌ల విషయంలో సర్కసు ఫీట్లు చేసి చతికిలపడ్డాడు. బుల్ ఇన్ చైనా (పింగాళీ సామాన్లు) షాప్ అనే సామెత వుంది. అమెరికా అంటే చైనా సామాన్లు అమ్మే షాపే. దానిలో ట్రంప్ అచ్చోసిన ఆంబోతులా కలయదిరిగి తన మార్కెట్టే కాదు, ప్రపంచ మార్కెట్లన్నీ ధ్వంసం చేసి యిప్పుడు ఒగరుస్తున్నాడు.
అధినేతలు ఎన్ని కబుర్లు చెప్పినా అమెరికా, చైనా బంధం యిప్పట్లో తెగదు. చైనా సామాను లేనిదే అమెరికాకు ముద్ద దిగదు. అమెరికా మార్కెట్ లేకుండా చైనాకు పూట గడవదు. అంత మార్కెట్ ఒక్కసారిగా మాయమైతే చైనా పరిశ్రమలు తట్టుకోలేవు. అమెరికా స్థానంలో కొత్త మార్కెట్లు వెతకడానికి కూడా టైము పడుతుంది కదా. టాయిలెట్ పేపరు దగ్గర్నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో వున్న అమెరికాకు చైనా స్థానంలో ఆ స్థాయి ఎగుమతిదారు యిప్పటికిప్పుడు ఎలా దొరుకుతారు? సినిమా హీరో చూడండి, విలన్ గుంపులో ఒక్కోణ్నీ కొడతాడు. వాళ్లు కూడా మర్యాద పాటించి ఒకరి తర్వాత మరొకరు వరుసలో వస్తారు. ట్రంప్ కూడా చైనా దిగుమతులు తగ్గించి, ఆ మేరకు యితర దేశాల వాటాలు పెంచి, ఆ తర్వాత వాటివి తగ్గించి, మరో బ్యాచ్‌ను ప్రోత్సహించి, యీ లోపున దేశీయ ఉత్పాదనలు పెరిగితే బాగా తగ్గించే ప్లాను వేయాల్సింది.
చైనా చూడండి, అమెరికా మార్కెట్ పోతోందనగానే తమ ఫ్యాక్టరీలు మూతపడతాయని చుట్టూ వున్న దేశాలన్నిటితో మంతనాలు మొదలెట్టింది. ఇండియాతో కూడా సఖ్యంగా వుందాం, మా సరుకులు అమ్ముకోనీయండి అంటూ బేరాలాడుతోంది. ట్రంప్‌కు చైనాతో చెడితే మనకు అమెరికా బేరాలు కొన్నయినా వస్తాయేమోనని చూస్తున్న ఇండియా ఔననీ, కాదనీ అనటం లేదు. ధనం మూలం యిదం జగత్! ట్రంప్‌కి యీ తెలివితేటలు లేక ఒకేసారి 60 దేశాలపై ఒకేసారి కత్తి ఝుళిపించాడు. అదీ ఏ లాజిక్కూ లేకుండా! మామూలుగా అయితే మా వస్తువుపై మీరెంత రేటు సుంకం వేస్తున్నారో, మీ వస్తువుపై అదే శాతం రెసిప్రోకల్ సుంకం వేస్తామనడం సబబు. అయితే గ్లోబలైజేషన్ పుష్ చేసే సందడిలో పాశ్చాత్య దేశాలు ‘మీవి వెనుకబడిన దేశాలు, అందువలన మీకు వెసులుబాటు యిస్తున్నాం’ అని మనకు కన్సెషన్లు యిచ్చారు.
ఇప్పుడు ట్రంప్ ‘మీ మద్యం మీద మేం అతి తక్కువ సుంకం వేస్తే మీరు ఏకంగా 150 శాతం వేస్తున్నారు.’ అని ఫిర్యాదు చేస్తే, ఇండియా ‘మేం రూలు ప్రకారమే వేస్తున్నాం’ అని చెప్పుకోగలిగింది. ఆ రూల్సు రాసుకునేటప్పుడు యిన్నేళ్ల వరకే యిది వర్తిస్తుంది అని రాసుకోలేదనుకుంటా. తర్వాత వచ్చి చేరినవి ఎన్నో! ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ అయిపోయిందని ఒక పక్కన చెప్పుకుంటూ, మరో పక్క కన్సెషన్లు అడగడం భావ్యం కాదు. ఇప్పటికైనా అన్ని వస్తువులపైనా రెసిప్రోకల్‌గా వుండాలి అనే పాయింటుకి ట్రంప్ స్టిక్ అయి వుంటే బాగుండేది. కానీ అతనో తలాతోకా లేని కొత్త ఫార్ములా కనిపెట్టాడు.
ఒక దేశంతో గల ట్రేడ్ డెఫిసిట్‌కి, యింపోర్ట్‌కి ముడిపెట్టి ఒక శాతం కట్టి ఆ దేశపు వస్తువులన్నిటిపై యింత శాతం సుంకం అంటూ లెక్క వేశాడు. ఉదాహరణకి అమెరికాకు భారత్‌కు చేస్తున్న ఎగుమతులు 42 బిలియన్ డాలర్లు, దిగుమతులు 87 బిలియన్లు. డెఫిసిట్ 45. 45/87/2*100 = 26% సుంకం అని లెక్క కట్టాడు. ఇలా 60 దేశాల లిస్టు చదివాడు. దానిలో అతి చిన్న దేశాలు కూడా వుండడంతో అదో పెద్ద జోక్ అయిపోయింది. ఇలాటిది ఏ ఉత్తర కొరియా అధ్యక్షుడో, ఆఫ్రికా దేశపు నియంతో చేసి వుంటే నవ్వుకుని వదిలేసేవారు. కానీ అమెరికా అధ్యక్షుడే చేయడంతో ప్రపంచంలో గగ్గోలు పుట్టింది. వాణిజ్య లోటు వుండడం ఎవరి తప్పు? వాళ్లేమైనా వచ్చి నీకు బలవంతంగా సరుకులు అమ్ముతున్నారా? వాటి నాణ్యత బాగుందనుకుని నీ ప్రజలే కొంటున్నారు. చేతనైతే అంతకంటె బాగా దేశంలోనే తయారు చేయించు. అప్పుడు లోటు ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది.
ట్రంప్ స్థిరత్వం లేకుండా మాట్లాడాడు. సుంకాలలో అసమానత గురించి మాట్లాడాడు కాబట్టి యూరోప్ వాళ్లు జీరో సుంకం రూలు పెట్టేసుకుందాం, యీ ఫార్ములా ఎత్తేయండి అంటే డెఫిసిట్ వుందిగా అది కుదరదన్నాడు. ఇజ్రాయేలు వాళ్లు ట్రేడ్ డెఫిసిట్ లేకుండా చూస్తాం, యీ ఫార్ములా పెట్టకండి అంటే మీకు వేరేగా సైనిక సాయం చేస్తున్నాంగా అన్నాడు. ఇలా ఒక రూలూ, రైమూ లేకుండా మాట్లాడడంతో పాటు మరో పిచ్చి పని చేశాడు. నేను పెంచుతాను కానీ మీరు పెంచకూడదు, పెంచితే ప్యునిటివ్ (శిక్షాపూర్వక, ప్రతీకారాత్మక) సుంకం విధిస్తాననడం! నీ దేశం నీ రేట్లు అన్నట్లు, వాళ్ల దేశం వాళ్ల రేట్లు, వాళ్ల యిష్టం. ఇష్టమైతే ఎగుమతో దిగుమతో చేసుకో, లేకపోతే మానుకో!
అన్నిటి కంటె హాస్యాస్పదమైనది ‘ఇండియా మా గోధుమలు కొనవచ్చుగా’ అనడం. నీ సరుకుకి డిమాండు వుండేట్లా నువ్వు చూసుకోవాలి తప్ప యిలా అడగటమేమిటి? ప్రతీ దేశానికీ దాని ప్రాధాన్యతలు దానికుంటాయి. తమ రైతులను కాపాడుకోవడానికి ఏం చేయాలో అదే చేస్తారు. తమ ఉత్పాదన అంతర్జాతీయ విపణిలో ఎట్రాక్టివ్‌గా నిలపడానికి రాయితీలిస్తారు, లేదా పరిమితులు విధిస్తారు. కానీ సైన్యబలం చూపించి, మా సరుకు కొనమని మరొక దేశంపై జబర్దస్తీ చేయరు. ఈ నెలలోనే ట్రంప్ చేసిన విన్యాసాలతో ప్రపంచం విసిగిపోయింది. ఎప్పుడే రూలు పెట్టాడో, దానికి ఎప్పుడు ఎంతకాలం పాజ్ యిచ్చాడో, ఎప్పుడు మళ్లీ వేస్తానంటాడో అతనికి కూడా గుర్తుండదు.
భారీ టారిఫ్‌లు విధించి, కొన్ని రోజులకు 90 రోజుల విరామం అంటూనే, 10% బేస్‌లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందన్నాడు. ప్రతీ దేశంతో టైలర్ మేడ్‌గా ఒప్పందాలు చేసుకుంటామన్నాడు. చైనాపై మాత్రం 125% సుంకం అన్నాడు. తాజాగా చైనాపై సుంకాలు తగ్గుతాయనే స్టేటుమెంటు యిచ్చాడు. ఈ వ్యాసం పూర్తయేలోగా దీనికి విరుద్ధమైన ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడవద్దు. నిరంతరం మారుతున్న యిలాటి పరిస్థితుల్లో ట్రంప్ విధానాల వలన భారత్‌కు కలిగే మేలు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌పై ప్రభావం యిలాటివి చర్చించడం వేస్ట్. ఈ తుపాను వెలిశాకనే పరిస్థితి అర్థమౌతుంది.
మొదటే చెప్పినట్లు అమెరికా, చైనా రాజీపడక తప్పదు. ఈ కులాసా స్థితి కొనసాగదని, పరిస్థితిలో మార్పు తేవాలనీ ట్రంప్ తన ప్రజలను హెచ్చరించిడానికి భారీ జర్క్ యిచ్చాడని నట్లుగా అర్థం చేసుకోవాలి. చైనా యీ రోజు ప్రపంచానికే ఫ్యాక్టరీగా మారిందంటే దాని వెనుక దశాబ్దాల కృషి వుంది. చడీచప్పుడూ కాకుండా అది విస్తరిస్తూ పోయింది. సరుకులు తయారు చేయడమే కాదు, అవి సుదూరప్రాంతాలకు ఎలా చేరవేయాలో కూడా దారులు వేసుకుంది. రాత్రికి రాత్రి బెదిరింపులతో, హుంకరింపులతో దాన్ని స్థానభ్రంశం చేయడం ట్రంప్ తరం కాదు. తన దేశప్రజలను కన్స్యూమరిజం నుంచి ప్రొడక్షన్‌కు మరలించడమనేది నెమ్మదిగా చేయవలసిన పని. ఈలోగా తన వాచాలతతో, అహంకార ప్రలాపాలతో సర్వదేశాలను రెచ్చగొట్టి, అమెరికన్ మార్కెట్లో వస్తువులు దొరకని పరిస్థితి తెస్తే గోర్బచేవ్‌ను సోవియట్ ప్రజ తిరస్కరించినట్లే ట్రంప్‌ను అమెరికన్ ప్రజ తిరస్కరిస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2025)
మీరు చైనా ను కూడా మెచుకున్నారు. కాని యెందుకని ఇండియాలో వున్నా అందరూ ట్రంప్ మీద పడి ఏడుస్తారు.
దానికంటే ముందు, తక్కువ టారీఫ్స్ మంచివే అయితే, ఇండియన్ గవర్నమెంట్ ని కూడా టారీఫ్స్ తగ్గించమని ఎందుకు అడగరు?
అయినా ఇండియన్ అయ్యుండి, అమెరికా చైనా మీద విపరీతమయిన టారీఫ్స్ ఏస్తే టపాసులు కాల్చి పండగ చేసుకొని అమెరికా తో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకొని చైనా తో పోటీ పడక ఈ ట్రంప్ మీద పడి ఏడవటాలు ఎందుకండీ.
What are you talking Varnaa
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-daka
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-vicharana-chesthadu!!!!
What are you talking ?

“కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి కాపిటలిస్టు దేశాలు సంక్షేమ రాజ్యం పేరుతో నిరుద్యోగులకు డోల్స్ (భృతి) యిచ్చి, కార్మికులకు విపరీతంగా జీతాలు పెంచి చెడగొట్టారు”…not true…your comment says you really understand capitalism only comparing with cummunism…
hello Andra Love ?
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-daka
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-vicharana-chesthadu!!!!
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-daka
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-vicharana-chesthadu!!!!
ట్రంప్ చేస్తున్నది మంచిదే….మనిషి కానీ దేశం కానీ ఇతరుల మీద ఆధారపడటం బలహీనత వరకు వెళ్ళకూడదు.
మనుషులకి దేనికైనా అలవాటు పడే శక్తి వుంటుంది, అమెరికన్లు కూడా దీనికి అతీతం ఏమీ కాదు….
నా దృష్టి లో అమెరికా ని అన్ని కోణాలనుంచి బలోపేతం చేయడానికి లేదా సరిదిద్దడానికి ట్రంప్ చేస్తున్నది కరెక్ట్.
What are you talking Mr.D?
Do you know more than EMBSprasad?
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-daka
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-vicharana-chesthadu!!!!
What are you talking?

What are you talking Mr.Rational?

తమ కి వచ్చే కొద్దిపాటి పొదుపు చేస్తూ, పద్ధతిగా కేవల్దం ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండే సంప్రదాయ మధ్య తరగతి ఉద్యోగ వర్గాలకి , అన్ని రకాల పన్నులు వుంటారు.
తమ ఆర్ధిక శక్తికి మించి పిల్లలు నీ ఎలుక పిల్లలు లాగ చాలా మందిని కనేసి ,వాళ్ళ నీ తాము పోషించకుండా , దేశం మీదకి వదిలేసి, పని చేయకుండా ఉండే వాళ్ళకి ఏమో ప్రభుత్వాలే కూర్చోబెట్టి పోషణ చేస్తున్నాయి. పన్ను కట్టే పని ఉండదు వాళ్ళకి. ప్రభుత్వమే ఎదురు డబ్బు ఇస్తాడు.
ఈ అసహజ అన్యాయం ను ముందు ఆపాలి.
What are you talking Ambi?
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-vicharana-chesthadu!!!!
What are you talking Ambedkar?

మారు రాసె ఆర్టికల్స్ లొ మాత్రం లాజిక్ కనపడుతుందా? అయినా జనం చదవటంలా?
నన్నాడిపోసుకోవడానికి కాకపోతే… – నా ఆర్టికల్స్‌లో లాటిక్ ‘రాహిత్యం’వలన ఏ దేశపు ఆర్థిక పరిస్థితీ అల్లకల్లోలం కాదండీ, నాకూ ట్రంప్‌కూ పోలిక అనేది అసంబద్ధం. నన్నేదో అన్నానన్న తృప్తి కోసం రాశారు కానీ అక్కడ ప్రపంచ ప్రజలు తల్లడిల్లుతున్నారన్న సంగతి గుర్తించినట్లు లేదు.
What are you talking Mr.Rational?
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-daka
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-vicharana-chesthadu!!!!
Logic Yenduku ledu?
GreatAndhra dabbulisthondi kada EMBSprasad ki?
nuvvu, nenu clicks waste chesi, time waste chesi chaduvutunnam !!!
విద్యా వైద్యాలు ఉచితంగా ఎక్కడ ఇస్తున్నారు ? ట్యాక్స్లనో, సోషల్ సెక్యూరిటీ డిపాజిట్ అనో ఏదో ఒక రూపంలో వసూలు చేస్తారు కదా!
moving people from consumerism to production is not a right statement. americans are already rich at USD 80k per capita. china is at USD 20k percapita and we are at usd 2/3k. so avg US income is 4 times higher than chinese income, they are earning that through services.
we had a global cycle in which mfg moved chasing low cost countries starting with japan then korea taiwan and china. this is similar to having labor from north working in south or indians working in US.
capitalism is people chasing returns on invested time/capital not some loft goal of making something great again
Further, limiting foreign competition is very bad for consumers. this will turn into an internal monopoly. like we never had cars other than ambassadors or having low quality goods. sustainable competition is the foster of growth not shutting down imports.
shutting down imports will make us spend more that can go into large coproates like ambani/adani/tata not to common people. this is evident by the fact that reduced corporate tax has increased profits but not created employment
Hi Friends,
Prasadam-Anna-kristhu-poorvam-indus-vally-civilization nundi
british-empire-lo-concupines-daka +
Albert Einstein relativity theory daka
gattika mataladithe, 2150 year lo pakistan paristhithi daka
uddanda-pindam-laga-rayagaladu.
okkate pointu. election lo yevaru gelustharu ani matram adagoddu
gelichaka, yeduduku gelicharu ani matram su-deergha-visleshana-chesthadu!!!!