ఫలించిన నాగవంశీ ప్లాన్

యూజవల్ గా వన్ డే లో ఐ బొమ్మ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల్లో పైరసీ ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సండే అయినా కూడా రాలేదు.

సినిమా ఇలా థియేటర్ లో విడుదలైతే అలా పైరేటెడ్ కాపీ వచ్చేస్తోంది ఆన్ లైన్ లో. ఎక్కడ నుంచి లీక్ అవుతోందో తెలియడం లేదు. మంచి హెచ్ డి ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయిపోతోంది. డిజిటల్ యుగం కావడంతో ఎవరు ఎన్ని తాళాలు వేసినా ఫలితం లేకపోతోంది. ఇలాంటి టైమ్ నిర్మాత నాగవంశీకి అనుమానం వచ్చింది. అందుకే ఓ చిన్న ప్లాన్ వేద్దాం. కరెక్ట్ అయితే అవుతుంది లేదంటే ఓ పది పాతిక లక్షలు నష్టం వస్తుంది అని అనుకున్నారు.

తన ఫ్రెండ్ ఆస్ట్రేలియా వెంకట్ నే ఓవర్ సీస్ రైట్స్ తీసుకున్నారు చిన్న సినిమా అయిన సింగిల్ కు. ఈ సినిమాతో ఓ ప్రయోగం చేయాలని నిర్మాత అల్లు అరవింద్ ను ఒప్పించారు. సినిమాను కేవలం యుఎస్, యుకె, ఆస్ట్రేలియాల్లో విడుదల చేసారు. గల్ఫ్, సింగపూర్, ఇలా మిగిలిన సెంటర్లను కావాలని వదిలేసారు. దాని వల్ల పది నుంచి ఇరవై లక్షలు నష్టం వుంటుంది. ఇక్కడ నాగవంశీ అనుమానం ఏమిటంటే ఓవర్ సీస్ లోనే ఎక్కడో ఒక దగ్గర నుంచి కాపీ లీక్ అవుతోంది అని.

ఇప్పుడు అదే రుజువైంది. యూజవల్ గా వన్ డే లో ఐ బొమ్మ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల్లో పైరసీ ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సండే అయినా కూడా రాలేదు. దాంతో పైరసీ ప్రింట్ ల వెనుక మర్మం తెలిసింది.

కానీ ఒకటే సమస్య. చిన్న సినిమా కనుక, పది నుంచి ఇరవైలక్షలు రిస్క్ చేసి యుఎస్, యుకె, ఆస్ట్రేలియా.. మిగిలిన ఏరియాలు వదిలేసారు. కానీ పెద్ద సినిమాలు అలా వదిలేస్తే చాలా పెద్ద నష్టం వస్తుంది. దీనికి మార్గం కనిపెట్టాల్సి వుంది.

ప్రస్తుతానికి అయితే గిల్డ్ పెద్దలు, సింగిల్ సినిమా నిర్మాతల నుంచి నాగవంశీ కి, ఆస్ట్రేలియా వెంకట్ కు అభినందనలు దక్కాయి.

6 Replies to “ఫలించిన నాగవంశీ ప్లాన్”

  1. హిట్ ఐతే సాటి వాళ్లే పైరసీ చేసేస్తున్నారు ల ఉంది

  2. ఎక్కడో తేడా కొడుతోంది. ఇతను తీసే నాసిరకం సినిమాలు పైరసీ చేసినా చూడరని ఎవరూ పైరసీ చేయలేదేమో. దానికి వ్యూహం ఫలించిందని కవరింగ్.

    ఈ సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు…

  3. Anduke neeli kj lk site anedi. Ee post kanisam proof reading kuda cheyara

    First para ki last para ki emi anna relation vunda 

    Neeli kj lk la site

Comments are closed.