ఆంక్ష‌లు త‌ట్టుకుని కొన్న ర‌ష్య‌న్ రక్ష‌.. భేష్!

ద‌శాబ్దాలుగా భార‌త యుద్ధ ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ వ్యూహాలు సిస‌లైన స‌మ‌యంలో ఫ‌లితాన్ని ఇస్తూ ఉండ‌టం హ‌ర్ష‌దాయ‌కం

సినిమాల్లో కూడా అలాంటి స‌న్నివేశాల‌ను చూడ‌లేం, సినిమాల‌కు అలాంటి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం కూడా ఏ ద‌ర్శ‌కుడికీ సాధ్యం కాదు, ఎన్నో వార్ సినిమాల‌ను చూసి ఉన్నా.. అలాంటి స‌న్నివేశాల‌ను చూసి ఉండ‌రెవ‌రూ! పాక్ సైన్యం జ‌మ్మూ, పంజాబ్ ల‌లోని మొత్తం 15 ప్రాంతాల‌పై ప్ర‌యోగించిన మిస్సైల్ ల‌ను, డ్రోన్ ల‌ను భార‌త క్షిప‌ణీ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎదుర్కొన్న తీరు ఒళ్లు గ‌గుర్పొడిచే రీతిన ఉంది. పాక్ నుంచి దూసుకు వ‌చ్చిన డ్రోన్ల‌ను, భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన మూడు పాక్ యుద్ధ విమానాల‌ను వ‌దిలిన మిస్సైల్ ల‌ను, ఆఖ‌రికి ఆ యుద్ధ విమానాల‌ను కూడా భార‌త సుద‌ర్శ‌న చ‌క్రం తుత్తినియ‌లు చేసింది. ఇది ర‌ష్యా నుంచి కొనుగోలు చేసిన రక్ష‌ణా వ్య‌వ‌స్థ‌. దీనికి ఎస్400 అని పేరు. దీని ధ‌ర కూడా క‌ళ్లు చెదిరే స్థాయిలో ఉంటుంది.

ఒక్కో ఎస్ 400 వ్య‌వ‌స్థ‌నూ ఏకంగా ప‌ది వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది భార‌త‌దేశం. ప్రస్తుతం ప్ర‌పంచంలోనే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన‌, అధునాత‌న క్షిప‌ణీ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌గా దీనికి గుర్తింపు ఉంది. ఇది ఎంత‌టి స‌మ‌ర్థ‌వంత‌మైన‌దిగా పేరు తెచ్చుకుందంటే.. అమెరికా ప్ర‌యోగించ‌గ‌ల క్షిప‌ణుల‌ను కూడా ఇది నిర్వీర్యం చేయ‌గ‌ల‌ద‌నే పేరుంది. అందుకే అమెరికాకు ఇది అంటే మంట‌.

త‌మ వ‌ద్ద ఉన్న క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించినా.. వాటిని తుత్తినియ‌లు చేయ‌గ‌ల ఈ ర‌ష్యా ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ‌ను అమెరికా వ్య‌తిరేకించింది. దీన్ని కొన‌వ‌ద్దంటూ ప్ర‌పంచ దేశాల‌కు అమెరికా హెచ్చ‌రిక‌లు చేసింది. ఇండియాకు కూడా ఇదే హెచ్చ‌రిక చేసింది. ఈ ఎస్400 ను కొన్నారంటే మీ పై ఆంక్ష‌లే అంటూ అన్ని దేశాల‌నూ అమెరికా హెచ్చ‌రించింది. అయితే ఆ హెచ్చ‌రిక‌ల‌ను ఇండియా ఖాత‌రు చేయ‌లేదు. ఈ దుర్భేధ్య‌మైన ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ‌ల‌ను ఇండియా ర‌ష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ ఎస్ 400 కు సంబంధించి ఇండియా మొత్తం ఐదు వ్య‌వ‌స్థ‌ల‌ను కొనుగోలు చేసింది.

అంటే సుమారు యాభై వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఇండియా ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ‌ను కొనుగోలు చేసింది. భార‌త బ‌డ్జెట్ ప్ర‌కారం చూసినా ఇది భారీ మొత్త‌మే. యాభై వేల కోట్ల రూపాయ‌లు పెట్ట‌డానికి వెనుకాడ‌క కొనుగోలు చేసినందుకు స‌రైన స‌మ‌యంలో ఈ ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ త‌న స‌త్తా చూపించింది. త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంది. ఈ ర‌క్షణా వ్య‌వ‌స్థ‌ను కొనుగోలు చేయ‌డానికి ఇండియా అప్పుడు వెనుకాడ‌క‌పోవ‌డం ఇప్పుడు ప్ర‌యోజ‌నంగా మారింది. పాక్ పై ఇండియా క్షిప‌ణుల దాడి అనంత‌రం, పాక్ అలాంటి దాడులే చేసింది. ఒక‌వేళ ఆ దాడుల్లో ఇండియాకు ఏ మాత్రం న‌ష్టం జ‌రిగి ఉన్నా.. రెండూ స‌మానం అయిపోయావే. ఇండియా క్షిప‌ణులు ప్ర‌యోగిస్తే పాక్ కూడా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్టుగా మారేది. అయితే.. మొత్తం సీన్ ను ఎస్400 మార్చివేసింది.

ఒక‌టి ఇండియాపై దాడి తేలిక కాద‌ని పాక్ కు స్ప‌ష్ట‌త ఇచ్చింది. మీకంత సీన్ లేద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ప్రపంచ దేశాల‌కు కూడా ఇదే క్లారిటీ ఇచ్చింది. పాక్ కు తోడు వ‌ద్దామ‌నుకున్న చైనాకు కూడా ఇండియా క్లారిటీ ఇచ్చింది. అలాగే ట‌ర్కీకి కూడా స్ప‌ష్ట‌త వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. ఇండియాపై దాడి అంటే ఆలోచించుకోవాల‌ని ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ ఒక్క రాత్రితో ఇండియా స‌మాధానం ఇచ్చింది. ఇందులో ఎస్400కు గొప్ప క్రెడిట్ ల‌భిస్తుంది. అలాగే యుద్ద మేఘాలు క‌మ్ముకున్న వేళ ర‌ష్యా మ‌రిన్ని ఆయుధాల‌ను ఇండియాకు స‌ర‌ఫరా చేసింది. దాదాపు 400 కోట్ల రూపాయ‌ల విలువైన ఆయుధాల‌ను ఎమ‌ర్జెన్సీ గా ఇండియాకు ర‌ష్యా స‌మ‌కూర్చి పెట్టింది.

మ‌రి యుద్దం అంటే ఆయుధాల వ్యాపార‌మా అనుకోవ‌చ్చు. నిజ‌మే యుద్ధం అంటే కొన్ని దేశాల‌కు ఆయుధాల వ్యాపార‌మే. అయితే అవ‌స‌రం మ‌న‌ది. ఇలాంటి అవ‌స‌రంలో ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం కూడా కీల‌క‌మే. త‌మ‌కు అమ్మే యుద్ధ విమానాల‌ను, ఆయుధాల‌ను మ‌రో దేశానికి అమ్మ‌వ్వద్దంటూ కూడా ఇండియా ఒప్పందాలు చేసుకుంటూ ఉంది. ఎస్400 కూల్చిన పాక్ యుద్ధ విమానాలూ ఆ దేశం కొనుగోలు చేసిన‌వే. ఒక్కో దాని విలువ క‌నీసం వంద కోట్ల రూపాయ‌ల పైనే! ఒక్క రాత్రిలో పాక్ కు ఆ మూడు యుద్ద విమానాలూ కూల‌డంతో మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ న‌ష్టం వాటిల్లింది. ఇది కూడా భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ పుణ్య‌మే!

కేవ‌లం ఎస్ 400 మాత్ర‌మే కాకుండా, ఇండియా వ‌ద్ద ఇత‌ర క్షిప‌ణి, డ్రోన్ దాడి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు కూడా ఉన్నాయి. అన్నీ క‌లిపి ఇప్పుడు ర‌క్ష‌ణ‌గా నిలుస్తూ ఉన్నాయి. ఒక‌వేళ పాక్ ఇలాంటి దాడులు మ‌రిన్ని చేసినా, అణు దాడికి కూడా పూనుకున్నా.. వాటిన్నింటికీ ఈ ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ గ‌ట్టి స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌ద‌ని స్ఫ‌ష్టం అయ్యింది. ఇదే స‌మ‌యంలో అచ్చం ఇలాంటి వ్య‌వ‌స్థ‌నే చైనా నుంచి కొనుగోలు చేసింది పాకిస్తాన్. ఆ వ్య‌వ‌స్థ ఏ ర‌కంగానూ భార‌త క్షిప‌ణుల‌ను కానీ, డ్రోన్ ల‌ను కానీ ఆప‌లేక‌పోయింది.

పాక్ వ‌ద్ద ఇంకో వ్య‌వ‌స్థ మాత్ర‌మే నిల్వ ఉంద‌ట‌, అది కూడా చైనా నుంచి కొనుగొన్న‌దే. దానికీ బ్యాట‌రీలు వేసి యాక్టివేట్ చేసినా.. ఇండియా దాన్ని నిర్వీర్యం చేయ‌డానికి కూడా స‌మాయ‌త్తంగానే ఉంది. మొత్తానికి ద‌శాబ్దాలుగా భార‌త యుద్ధ ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ వ్యూహాలు సిస‌లైన స‌మ‌యంలో ఫ‌లితాన్ని ఇస్తూ ఉండ‌టం హ‌ర్ష‌దాయ‌కం. భార‌త ర‌క్ష‌ణా వ్య‌వ‌స్థ‌లు, యుద్ధ విమానాల కొనుగోలు అంశాలు అవినీతి వార్త‌ల్లో నిలిచినా, బోఫోర్స్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ఒక్క ఆయుధం భార‌త్ కు ఎంతో మేలే చేసి పెట్టాయి. ఇందులో మాత్రం ఎలాంటి వాద‌న‌లూ లేవు. అలాగే పాత నేస్తం ర‌ష్యా నుంచి అందిన ఆయుధ‌, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కూడా మ‌రోసారి హైలెట్ అవుతూ ఉంది.

20 Replies to “ఆంక్ష‌లు త‌ట్టుకుని కొన్న ర‌ష్య‌న్ రక్ష‌.. భేష్!”

  1. You deleted, but the fact is we spent a bomb  to shot down cheap turkey and china drones that came in large numbers, guided and unguided. More civilian casualties is their target and if it continued we would have lost significant amount of money. We need cheap , precision missiles to shot these cheap ones

  2. You deleted, but the fact is we spent a bomb  to shot down cheap turkey and china drones that came in large numbers, guided and unguided. More civilian casualties is their target and if it continued we will loose significant amount of money. We need cheap , precision missiles to shot these cheap ones

  3. Until some third party analyze the damage there is no credible way to tell who is telling right. Both parties mental situation is completely dominated by patriotism at this time. If you read Pakistan news they are also telling similar information but in their favor.

    1. Follow the PIB fact check twitter handle for reliable information.It has clearly exposed fake news being circulated by pakistan with proofs.

    2. ఇండియా కాస్త పై చేయిగా ఉంది అంటే కడుపు మంట తో రగిలి పోయే వాటికన్ గొర్రె బిడ్డలు, చైనా ఎర్ర బిడ్డలు, ఎడారి ఒంటె బిడ్డలు చాలా మంది వున్నారు మన దేశంలో.

  4. Jagan anna questions: 

    1. what about peda vadu ?
    2. why 50k Crores on weapons  ?
    3. what about pathakalu?

    CBN answers

    1. If the country is well protected, poor people can be looked after
    2. If you are week, others will walk over you
    3. we just dont need freebees, we need the balance between development and welfare!
  5. Two reasons we, Indians have to spend 6 lakh crores(82 billion dollars) per year of taxpayers money in army/defense sector.

    1)Communists(Maoists, Naxals, China)

    2)Islamists (Pak & Kashmiri separatists)

    Yet the liberals support both of them in the name of socialism and secularism respectively.

  6. భారత్ శాంతి కాముక దేశం. ఉద్దేశపూర్వకంగా ఎవరి జోలికి వెళ్లదు. 1971లో అయినా..కార్గిల్ వార్ సమయంలో అయినా పాకిస్తాన్ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పట్లో పరిమిత వనరులతోనే లక్షల మంది పాక్ సైన్యాన్ని బందీలుగా చేసుకున్నారు. యుద్ధం అంటూ జరిగితే .. భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం ఎలాంటిదైనా వినాశనమే. అందులో విజేతలు సాంకేతికంగా ఉంటారు కానీ.. యుద్ధం చేసిన వారంతా నష్టపోతారు. దానికి తాజా సాక్ష్యం రష్యా, ఉక్రెయిన్ మాత్రమే. లక్షల మంది సైన్యాన్ని ఈ రెండు దేశాలు కోల్పోయాయి. పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బందులు పట్టారు. ఉక్రెయిన్ దాదాపుగా నాశనం అయిపోయింది. రష్యా పెద్ద ఎత్తున సైనిక, ఆర్థిక నష్టాలను చవి చూసింది. ఇప్పటికీ అనుకున్న విజయాన్ని పొందలేకపోయింది. రేపు రష్యా విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవచ్చు కానీ.. జరిగిన నష్టాన్ని మాత్రం ఎప్పటికీ భర్తీ చేసుకోలేదు. సగటు భారతీయునిగా అలాంటి విజేతగా భారత్ ఉండాలని కోరుకోలేం.

    పాకిస్తాన్ ఖచ్చితంగా పాపిస్తాన్ . ఆ విషయంలో మరో డౌట్ లేదు. ఆ దేశంలో సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశాన్ని బలహీనం చేయాలి. అది కూడా మనకు నష్టం జరగకుండా.

  7. ముఖ్యమంత్రి తో ఎన్నో పదువులని ఇచ్చిన సోనియా నే ఎదురించిన A1సింహం.. ప్రత్యేక హోదా కోసం మోడీ మెడలు వొంచిన పులి..

    మురళీ నాయక్ ని హతమార్చిన పాకీ సైనికుల బట్టలూడదీసి, 11 అడుగుల లోతులో కప్పిట్టేంతవరకు ఆంధ్రా కి తిరిగి రాను అని శఫదం చేయబోతున్నా మా సింగిల్ సింహం.

Comments are closed.