టారిఫ్‌ల పేరుతో ప్రపంచ ప్రజలను, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను గందరగోళ పరుస్తున్న ట్రంప్‌ని తిట్టని వారు లేరు. ఇప్పటిదాకా సజావుగా సాగిపోతున్న పద్ధతిలో వేలు పెట్టడం దేనికి, ఆ బెదిరింపులేమిటి, శిక్షిస్తున్నానంటూ ఆ రంకెలేమిటి, పూటకో అంకె మార్చడమేమిటి? అని నివ్వెరపోతున్నారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యానికి అధిపతిగా వున్న వ్యక్తి యిలాటి చపలచిత్తం ప్రదర్శించవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ సబబైన ప్రశ్నలే కానీ వున్న పద్ధతిని కొనసాగించవచ్చు కదాన్న సూచన మాత్రం సబబు కాదు. ప్రస్తుత పరిస్థితి మార్చవలసిన అవసరం ఉందనీ, కానీ మార్చే తీరు, జోరు బాగా లేదని నా అభిప్రాయం.
ముందుగా పరిస్థితి బాగా లేదనడానికి గల కారణాలేమిటి? ఒకప్పుడు అమెరికా అంటే సరస్వతీ నిలయం, తద్వారా లక్ష్మీ నిలయం. రెండు ప్రపంచయుద్ధాలతో కుదేలైన యూరోప్ నుంచి, అప్పుడే ఎదగడం ప్రారంభించిన ఆసియా దేశాల నుంచి అనేక మంది ప్రజ్ఞావంతులు అమెరికాకు వలస వెళ్లారు. అమెరికా వారిని ఆహ్వానించి అక్కున చేర్చుకోవడం ఉభయతారకంగా పరిణమించి, పరిశోధనలకు పుట్టిల్లై, పారిశ్రామికంగా ఎంతో వృద్ధి చెందింది. సహజ వనరులు, దేశవిస్తీర్ణం కలిసి వచ్చాయి. అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, పరిశోధనాలయాలు, ఉత్తమ నాణ్యత కల పరిశ్రమలు అన్నీ వుండడంతో అమెరికన్ డాలర్ రిజర్వ్ కరెన్సీగా ప్రపంచం ఆమోదం పొందింది. అక్కడ పెట్టుబడులు పెట్టడం ప్రపంచ దేశాలన్నిటికీ పరిపాటిగా మారింది. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికా ప్రపంచవ్యాప్త స్వాప్నికుల గమ్యస్థానంగా మారడానికి కారణం యిదే!
అక్కడితో ఆగితే బాగుండును. ప్రపంచాధిపత్యానికై ప్రయత్నించి, యితర దేశాల వ్యవహారాలలో వేలు పెట్టి, వారి ప్రాంతాలలో పాదం పెట్టి, అనవసరపు యుద్ధాల్లోకి దిగి టాక్స్ పేయర్స్ మనీని వృథా చేసింది. ఆయధ పరిశ్రమ వృద్ధి చెందడం తప్ప సాధించింది ఏమీ లేకుండా పోయింది. తమ దేశం బాగోగుల వరకు చూసుకుంటే అమెరికాకు అడ్డు లేకుండా పోయేది. కానీ కమ్యూనిస్టు రష్యాను నిలవరించాలనే ప్రయత్నంలో భాగంగా, మరో కమ్యూనిస్టు దేశమైన చైనాను నిక్సన్ కాలంలో చేరదీశారు.
‘మీ దేశంలో మానవహక్కులు, కార్మిక హక్కులు హరించబడుతున్నాయి. అందువలన మీ సరుకులు కొనము’ అని అనేక దేశాలకు చెప్పే అమెరికాకు చైనాలో సాగే హక్కుల హననం కానరాలేదు. చైనాకు దన్నుగా నిలిచి దాన్ని ఓ పెద్ద భూతంగా చేశారు. చైనా వస్తువుల వాడకం లేనిదే అమెరికన్‌కు తెల్లవారదు అనే స్థితికి తీసుకుని వచ్చారు. ఇన్నేళ్లకు మేలుకుని ట్రంప్ దానికి పగ్గాలు వేయడానికి మళ్లీ రష్యాకు చేరువ కావాలని చూస్తున్నాడు. అంటే నిక్సన్ మంత్రానికి విరుగుడు మంత్రమన్నమాట. నిక్సన్ కాలం నుంచి చైనా బాగుపడినట్లే, యిప్పుడు ట్రంప్ హయాంలో రష్యా బాగుపడుతుందేమో! వాటి మాట సరే, అమెరికా సంగతేమిటి?
తన దేశపు మేధోసంపద, పారిశ్రామిక ప్రగతి సాయంతో ప్రపంచాన్నంతా ఏలేయడానికి 1990లలో అమెరికా సమకట్టింది. అప్పటిదాకా అనేక ఆసియన్, ఆఫ్రికన్ దేశాలు తమ చుట్టూ కంచె కట్టుకుని, దిగుమతులను నివారిస్తూ, హెచ్చుసుంకాలతో నిరోధిస్తూ. స్వదేశీ ఉత్పాదనలను కాపాడుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థ సొంత కాళ్ల మీద నిలబడేట్లు చూసుకునేవి. కానీ అమెరికా, దానికి వంత పాడే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాలు కలిసి 1990లలో గ్లోబలైజేషన్ అనే నినాదం చేపట్టాయి.
‘కంచెలు పీకేయండి, తలుపులు తెరిచేయండి, మమ్మల్ని రానీయండి, సరుకులు స్వేచ్ఛగా అమ్ముకోనీయండి’ అని గగ్గోలు పెట్టాయి. ‘మేమే కాదు, మీరూ వచ్చి మా దగ్గర అమ్ముకోవచ్చు, మేమూ తలుపులు తెరుస్తాం. ప్రపంచమంతా ఓ కుగ్రామమై పోయింది. గోడలు లేవిక. ఎవరైనా ఎక్కడికైనా వచ్చి పని చేసుకోవచ్చు, సేవలందించవచ్చు, సరుకులు అమ్ముకోవచ్చు.’ అని ఆదర్శాలు వల్లించారు. ఆశ పెట్టి ఊరించారు.
‘మీరూ రావచ్చని మేం అన్నాం కానీ మాకు తగ్గ నాణ్యమైన సేవలు, సరుకులు మీ దగ్గరెక్కడున్నాయి, మీ మొహం’ అనుకుని వాళ్లు యీ ఎత్తు ఎత్తారు. నయాన చెప్పి చూసి, మాట వినకపోతే మోచెయ్యి మెలి తిప్పి, డబ్ల్య్యుటిఓ ఒప్పందాలపై సంతకాలు పెట్టించారు. 30 ఏళ్లు గడిచాక చూస్తే ‘అనుకున్నదొక్కటి, అయినదొక్కటి’ అని తేలింది. చైనా ప్రపంచానికి ఫ్యాక్టరీ అయిపోయింది. ఇండియా వంటి దేశాలు చౌకగా సేవలందించే అవకాశాన్ని దొరక బుచ్చుకున్నాయి. ఆఫ్రికన్ దేశాల మాట ఎలా వున్నా, ఆసియా దేశాలనేకం అమెరికాతో స్నేహంగా వుంటూనే అక్కడి అవకాశాలను తన్నుకు పోసాగాయి. వీటి వలన వ్యాపారవాణిజ్యాలలో అమెరికా అంకెలు ఘనంగా కనబడుతూనే వున్నా, అమెరికన్లకు లబ్ధి చేకూరకుండా పోయింది.
అమెరికా ప్రస్తుత పరిస్థితి బాహర్ శేర్వాణీ, ఘర్ మేఁ పరేశానీ అన్నట్లు తయారైంది. అమెరికా ప్రభుత్వ అప్పు రూ.3 వేల లక్షల కోట్లు, అనగా ఆ దేశ జిడిపికి 120శాతం. దీనిలో 615 లక్షల కోట్లు 2016 జూన్ కల్లా చెల్లించాలి. ద్రవ్య లోటు జిడిపిలో 6 శాతం. (మన దేశంలో యిది 4.7శాతం, అంటే మనమే మెరుగు) విదేశీ వాణిజ్యం చూడబోతే 2023లో అమెరికా నుంచి ఎగుమతులు (గూడ్స్, సర్వీసెస్ కలిపి) 3.03 ట్రిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 3.85 ట్రిలియన్ డాలర్లు. చైనాని చూడబోతే 2023లో ఎగుమతులు 3.38 ట్రిలియన్ డాలర్లు, దిగుమతులు 0.256 ట్రిలియన్ డాలర్లు! దీని అర్థం అమెరికా అప్పు చేసి పప్పుకూడు తింటూ, మధ్యలో చైనాను తలచుకుని పళ్లు నూరుకుంటోంది తప్ప క్రియాశీలంగా ఏమీ చేయటం లేదు.
ఇప్పటికీ అమెరికాలో గొప్ప యూనివర్శిటీలున్నాయి, నూతన ఆవిష్కరణలు సాగుతున్నాయి, కొన్ని మంచి పరిశ్రమలున్నాయి. విద్యావంతులు, ధనవంతులు, ఎగువ మధ్యతరగతి అమెరికన్లకు సుఖప్రదమైన జీవితం ఉంది. ఐన కానీ సాధారణ అమెరికన్ బ్రతుకు ఏమౌతోంది? అతని భవిష్యత్తు ఏమిటి? మార్కెట్లో సరుకులు చూడబోతే చైనావి, చిన్నా చితకా ఉద్యోగాలు చూడబోతే దక్షిణమెరికా వాళ్లవి, చిన్న తరహా వైట్ కాలర్ జాబ్స్, చిన్న వ్యాపారాలు చూడబోతే ఇండియా వంటి ఆసియన్లవి. ఉన్నత విద్య చదవాలంటే ఫీజులు ఎక్కువ. ప్రభుత్వం చూడబోతే రూల్సు ఉల్లంఘించిన వారిని ఏమీ అనకుండా కూర్చుంటోంది. అక్రమంగా చొరబడిన వారిని, రాజకీయ శరణార్థులమంటూ అబద్ధపు కారణాలు చెప్పి వచ్చి తిష్ట వేసిన వారిని, వీసా గడువు ముగిసిపోయినా కదలని వారిని – వెతకదు, పట్టుకుని బయటకు పంపదు. స్టూడెంటు వీసాపై వచ్చి సూపర్ మార్కెట్లలో, పెట్రోలు బంకుల్లో, హోటళ్లలో తక్కువ జీతానికి పని చేసే విద్యార్థులను శిక్షించదు.
వీళ్లు వెళ్లి ‘మేమూ ఆ పని చేస్తాం, అయితే చట్టప్రకారం యివ్వవలసిన జీతాలివ్వండి’ అని అడిగితే ఆ షాపు యజమాన్లు ‘అక్కరలేదు, దానిలో సగం జీతానికే పని చేసేవాళ్లు మాకున్నారు’ అంటున్నారు. వాళ్లను అరికట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఇది దశాబ్దాలుగా సాగుతూ వచ్చింది. గత 10, 15 ఏళ్లగా మరీ ఎక్కువైంది. నిరుద్యోగం పెరుగుతోందని హాహాకారాలు చేయగానే కరోనా పేరు చెప్పో, మరో పేరు చెప్పో డబ్బు పంపిణీ చేసి, ద్రవ్యోల్బణాన్ని పెంచారు పాలకులు. పంపిణీ చేస్తే ఏం లాభం? వస్తూత్పత్తి జరగాలి కానీ! ఈ విషయాన్నే మొన్న ఎన్నికలలో స్వింగ్ స్టేట్స్‌గా పేరుబడిన ఏడు రాష్ట్రాలూ చాటి చెప్పి ట్రంప్‌కు అండగా నిలిచాయి. పరిస్థితి చక్కదిద్దాలంటే కాలు మీద కాలేసుకుని కూర్చున్న అమెరికన్లను కుదిపి, పనిలోకి దింపాలనుకున్నాడు. ‘‘లక్ష్మీనివాసం’’ సినిమాలో దుబారా ఖర్చు చేసి కొడుకులకు బుద్ధి చెప్పడానికి తండ్రి ఆస్తిపోయిందని నాటకం ఆడతాడు. అలాటిదేదో చేయాలనుకున్నాడేమో ట్రంప్.
ఇప్పుడు రెండో సారి వచ్చి అక్రమ వలసదారుపై కొరడా ఝుళిపించాడు. సరైన పేపర్లున్నాయో లేదో చెక్ చేయిస్తానంటున్నాడు. దాంతో దక్షిణమెరికా నుంచి అక్రమ కార్మికులకు భయం పట్టుకుంది. రావడం మానేస్తున్నారు, యింట్లో దాక్కుంటున్నారు. వారిపై ఆధారపడిన పౌల్ట్రీ రంగం, వ్యవసాయ రంగం పనివాళ్లు లేక కుదేలయ్యాయి. హోటళ్లపై నిఘా పెట్టడంతో స్టూడెంటు వీసాపై, ఒపిటిపై వున్న విద్యార్థులను పెట్టుకోవడం మానేశారు హోటల్ యజమానులు. అమెరికన్ యువతకు యీ రంగాలన్నిటి లోనూ అవకాశాలు వచ్చినట్లే కదా. వాళ్లు తీసుకుంటారా? లేదా? ‘మేం అమెరికన్లం, మేం తెల్లవాళ్లం, యీ దిక్కుమాలిన పని మేం చేయడమేమిటి?’ అనే గోరోజనం ఎంతకాలం వుంటుంది? వరదల్లో వున్నదంతా కొట్టుకుపోతే మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తారుగా! ట్రంప్ అటువంటి వరద తెప్పిస్తున్నాడు.
నేను 1982-85 మధ్య కలకత్తాలో ఉండేవాణ్ని. ఎటు చూసినా మధ్య తరగతి బెంగాలీ నిరుద్యోగులే, రోడ్ల పక్కన గోడల మీద కూర్చుని సిగరెట్లు వూదుతూ, అడ్డాలలో కారమ్స్, పేకాట ఆడుతూ, దేశ విదేశ రాజకీయాలు చర్చిస్తూ గంటలుగంటలు వేస్టు చేసేవారు. చేతిలో డిగ్రీ వున్నా వుద్యోగం లేదని ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద, సమాజం మీద కసికసిగా వుంటూ, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంటు జరిగినా, దొంగ దొరికినా వాళ్లని పట్టుకుని చావ చితక్కొట్టేసేవారు. ఎందుకీ ఫ్రస్ట్రేషన్? ఆదాయం లేక! అవకాశాలు లేవా? ప్రయివేటు సెక్టార్‌లో గుమాస్తా ఉద్యోగాల్లో దక్షిణాది వారుండేవారు. రిక్షావాళ్లుగా, చాకళ్లుగా, మంగళ్లుగా బిహారీలు వుండేవారు. వంటవాళ్లుగా ఒడియా వారుండేవారు. ఈ బెంగాలీ యవకులు ఆ ఉద్యోగాల జోలికి వెళ్లేవారు కారు. ఇది కలకత్తా పరిస్థితి. ఊళ్లలో బెంగాలీలు కూడా చేసేవారట. నగర వాసులకు కావలసినది వైట్ కాలర్ జాబ్స్. అవి రావు. అందుకని కలకత్తా వరకు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వుండి, ప్రతిపక్ష పార్టీ గెలిచేది.
ప్రస్తుత సగటు అమెరికన్ పరిస్థితి యిలాగే వున్నట్లు నాకు తోస్తోంది. ఇప్పుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నవారు భేషజం వదుల్చుకుని కార్మికులుగా, చిన్న ఉద్యోగస్తులుగా పని చేయడానికి ముందుకు రావాలి. ఆ మేరకు నిరుద్యోగం తగ్గుతుంది. ఇక కాస్త చదువుకున్న తక్కిన వర్గాల మాటేమిటి? వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. అమెరికాలో అయితే రన్నింగ్ కాస్ట్ ఎక్కువంటూ యితర దేశాలకు తరలిపోయిన పరిశ్రమలు వెనక్కి రావాలి. అవి రావాలంటే దిగుమతులను అనాకర్షణీయంగా చేసి, స్థానికంగా ఉత్పత్తి చేస్తే లాభదాయకం అని పారిశ్రామికవేత్తలు అనుకునేట్లు చేయాలి.
అమెరికాకు చెందిన కంపెనీలు కూడా వస్తువులు బయట ఉత్పత్తి చేసి, అమెరికాను కేవలం ఒక కన్స్యూమర్ మార్కెట్‌గా చూస్తున్నాయి. పరిస్థితి మార్చాలంటే దేశంలో వస్తూత్పత్తికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి, పరిశ్రమలు రావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ పనంటూ ప్రారంభమైతే కొద్దికొద్దిగా ఉద్యోగాలు మొదలవుతాయి. ఈలోగా దిగుమతి వస్తువుల లభ్యత తగ్గించాలి.
ఈ దిశగా ట్రంప్ చర్యలు చేపడితే మనం శాపనార్థాలు పెట్టవలసిన పని లేదు. దీపావళి సమయంలో చైనా ఉత్పత్తులను వాడకూడదని మనం యిక్కడ ఉద్యమాలు చేయలేదా? అలాటి ఉద్యమస్ఫూర్తి అమెరికన్ ప్రజల్లో కొరవడింది కాబట్టి, ట్రంప్ వాటి ధర పెంచి ‘అలాటివి కావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి, మీరే ఎలాగోలా తిప్పలు పడి లోకల్‌గా తయారు చేయడానికి పూనుకోండి.’ అని చెప్తున్నాడు. అలా తయారు చేసే లోపున చైనావి దొరక్కుండా చేస్తే, ఇండియావో, కొరియావో, శ్రీలంకవో, మరో దేశానివో అమ్ముడు పోతాయి. ఆ మేరకు చైనాపై ఆధారపడడం తగ్గుతుంది.
లోకల్‌గా తయారు చేయడానికి అనువైన పరిస్థితులు కల్పించకుండానే, అడావుడిగా హంగామా చేయడం, మార్కెట్లో వస్తువులు దొరక్కుండా చేయడం తప్పే కానీ మౌలిక సిద్ధాంతం వరకు కరక్టే అని నా అభిప్రాయం. ఈ సంక్షోభం నుంచే అమెరికన్ ప్రజ పరిష్కారం కనుక్కోవచ్చు. కూరల ధర పెరిగితే యింట్లో పెంచడానికి చూడవచ్చు. దుబారా మానుకోవచ్చు. హోటళ్లకు వెళ్లడం తగ్గించి (40శాతం మంది జనాభా బయటే తింటారట) యింట్లో వంట ప్రారంభించవచ్చు. డొక్క మాడితే అనేక ఐడియాలు వాటంతట అవే వస్తాయి. అమెరికా బాంబులేసి, అనేక దేశాలను నాశనం చేసినప్పుడు అక్కడి ప్రజలు ఎలా సర్వయివ్ అయ్యారో కనుక్కుని, వాళ్ల నుంచి నేర్చుకోవచ్చు.
క్రమేపీ చేయాల్సిన పనిని ఒక్కసారిగా తలకెత్తుకుని ట్రంప్ ఏ విధంగా తడబడ్డాడో, వ్యవహారాన్ని ఎలా జటిలం చేశాడో ‘లాజిక్ కనబడని టారిఫ్ వ్యవహారం’ అనే వ్యాసంలో వివరిస్తాను. నా ఉద్దేశ్యంలో యీ తేనెతుట్ట ఎప్పటికైనా కదల్చవలసినదే! కదిల్చేముందు గొంగడి అవీ రెడీ చేసుకోకపోవడమే ట్రంప్ చేసిన పొరపాటు.
ఎమ్బీయస్ ప్రసాద్ (mbsprasad@gmail.com)
Manufacturing in USA will be expensive coz of higher labor costs
prasad gari vysam chala bagundi
adbhuthamina points touch chesaru
oka high angle, oka low angle kadunda, inko dimension ni open chesaru
prasad gariki america meeda vunna grip ki idi addam paduthondi
prasad gari diplomacy, trade and multi-lateral relations, current affairs meeda command ki idi oka example.
Sir, is just brilliant. anthe
అలా అని దిగుమతులపై ఆధారపడాలా? చైనా సరకులు మన కంటె చవక, మనమూ ఫ్యాక్టరీలు మూసేసి, సర్వం చైనా నుంచి తెచ్చుకుంటే…? కార్మికులకు పని కల్పించి, జీతాలిస్తేనే కదా వాళ్లు వస్తువులు కొనగలిగేది. లేకపోతే మార్కెట్లో సరుకులు ఉంటాయి కానీ కొనగలిగేవాళ్లు ఉండరు.
US needs a long-term plan…plan cheyakunda tariffs ante esaru pettakunda annam vandatame
ఏ దేశమేగినా అతి అనర్థదాయకం
prasad gari vysam chala bagundi
adbhuthamina points touch chesaru
oka high angle, oka low angle kadunda, inko dimension ni open chesaru
prasad gariki america meeda vunna grip ki idi addam paduthondi
prasad gari diplomacy, trade and multi-lateral relations, current affairs meeda command ki idi oka example.
Sir, is just brilliant. anthe
You wrote China’s 2023 exports were $3.38 trillion and imports were $0.256 trillion. I don’t know what your sources were, but that is grossly inaccurate. Look at https://www.macrotrends.net/global-metrics/countries/chn/china/imports Their imports were 3.127 trillion in 2023, more than 12 times the number you specified.
Even without the source, that number beggars belief, which is why I checked. Your opinions are your opinions, but an inaccuracy of this magnitude is appalling, to say the least.
Prasadu Mao Zedong, 1950 and 60 lo USA gurinchi anna matala meeda okati,
Jandyala americal shooting lo vunnapudu ice cream joke kalipi okati vadulu chebutha !!!
alage anakapalli lo yuvatha, america lo vanitha meeda okati vadulu !!!!
EMBSprasadu, trumph peda manumali nanny meeda okati vadulu !!!
Photo copy right vunda, leka sruthi lo kalipesava prasadu !!!!
prasad gari vysam chala bagundi
adbhuthamina points touch chesaru
oka high angle, oka low angle kadunda, inko dimension ni open chesaru
prasad gariki america meeda vunna grip ki idi addam paduthondi
prasad gari diplomacy, trade and multi-lateral relations, current affairs meeda command ki idi oka example.
Sir, is just brilliant. anthe
60,70 s లో ఉన్న యూనియన్ జాబ్స్ తెల్లవారే చేతులారా పోగుట్టుకున్నారు అత్యాశతో. చీటీకి మాటికి స్ట్రైక్ చేస్తూ గోoతెమ్మ కోరికలు కోరుతూ 90s కి వచ్చేటప్పటికి సర్వ నాశనం చేశారు. వాళ్లు మారారు, ఈ డోస్ సరిపోదు. థిస్ విల్ బ్యాక్ఫైర్.
ee prasadu, vigraham meeda kaki retta meeda kooda rasthadu
Okkati maatram nijam, Americani, immigrationloop holes ni, donga jobs meeda jobsni manollu exploit chesinanthaga Evaroo cheyaledemo. Student visa meda campuslo matramae job cheyyoochu. Manollu Green Card ani kuda joblu chesthunnaru. Inka OPT Unte inka rechi povadamae.
ఈ ట్రంప్ గారేంటో మన సారు ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకొంటుంన్నారు
Pampini chesthe emi labham… Vasthutpathi jaragali kadha… Last 5 years lo miss ayimdhi idhe…. Pampini chesthu pothe evariku interest vastadhi work cheyadaniki.
K
Pampini chesthe emi labham. Vasthutpathi jaragali kadha.
615 lakh cores eppatiki chellinchali ???? 2016 or 2026 ?
Trump really very good businessman and good for USA as well.
Tarrif hike cheyadam valla USA stock markets tho paatu international markets kuda crash avutayi and also markets lo liquidity taggutundi.. tarvata ee uncertainty ni base chesukone investors Govt bonds invest cheseyalsinde Ela USA economy ni boost cheyadaniki trump plan chestunnadu …
మనం మరీ అతిగా ఊహించుకొంటున్నం. గుడ్డి వాళ్ళు ఏనుగును తడిమి ఏం చెప్తారో జరుగుతున్నదాని వెనుక అసలు మర్మం తెలీక మాట్లాడతాం. ఆర్టికల్ లో కొన్ని వాక్యాలు తప్పుల తడక, వాటికి సమాధానం ఇద్దాం అంటే కాపీ పేస్ట్ అవకాశం లేదు. అమెరికా నిర్ణయాలకు అన్ని దేశాలు వనుకుతున్నాయంటే అది ఎంత పెద్ద విలువైన మార్కెట్. వాడికి ఒక కన్ను పోయేలోపు రెండు కళ్ళు పోయే దేశాలు ఉన్నాయి.,.
కాపీ పేస్ట్ అవకాశం ఉంది, పైన ఈ మీడియా పేరు. Com అని ఉంది, దాని పక్క ఆప్షన్ క్లిక్ చెయ్యండి, నేను అలా చేసి కాపీ చేసింది “టారిఫ్‌ల పేరుతో ప్రపంచ ప్రజలను, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను గందరగోళ పరుస్తున్న ట్రంప్‌ని తిట్టని వారు లేరు.”
అమెరికాలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ సగటు గంట వేతనం 27 డాలర్లు. 8 గంటలు మించిపని చేయరు. అదే ఆపిల్ ఫోన్ వాడు చైనా ఇండియా లో గంటకి 2-3 డాలర్లు ఇచ్చి రోజుకి 10-12 గంటలు పీల్చి పిప్పు చేసి దోచుకెళ్తున్నారు. తిండి లేక పోతే చావు, కానీ నేను ఉద్యోగం ఇస్తే బండ చాకిరీ చెయ్యి అంటున్నాయి. పోనీ ఆపిల్ వాడు రేటు తగ్గిస్తాడా. ఆపిల్ వాడు ఒక్కో ఫోన్ కి 500 డాలర్లు పైచిలుకు లాభం.
ఎందరో శ్రమ దోపిడి మీద నెత్తి నోరు బాదుకొన్నా జరగని మార్పు ఇప్పుడు మారుద్ది
Is it justified to expect selling at expensive rates (high tariff) to US and buying at cheaper rates ( low tariff) from them? Every country wants to save tits industry & HR. No need to blame Trump. What is your opinion Mr MBS?
మాచింగ్ టారిఫ్ న్యాయం. ప్యునిటివ్ డ్యూటీస్ తప్పు. రాబోయే ఆర్టికల్‌లో దాన్ని వివరిస్తాను.
inka chalu apu swami nee sodi
పేదలకి సహాయం పేరు తో ప్రభుత్వాలు చేసే అతి ఫ్రీ పథకాలు వలన , పని చేసే అవసరం లేకుండా జనాలు తయారు అయ్యారు.
అమెరికా లో నిరుద్యోగ భృతి పేరుతో ప్రభుత్వమే ఇచే డబ్బు వస్తుంటే, కస్టపడి ఉద్యోగం చేయాలి అని ఎవడు అనుకుంటాడు?
మన ఇండియ లో నగ్వార అనే పథకం వలన రైతుల కి కూలీలు దొరకట్లేదు.
ముందు అంటువంటి పథకాలు రద్దు చేసి, పని చేస్తేనే డబ్బు , ప్రభుత్వ సదుపాయాలు అనే పద్దతి నీ ప్రోత్సహిస్తే, అటు సమాజానికి, ఇటు ప్రభుత్వాలకి మంచిది.
Unemployment benefits are limited, its only application to
సొసైటీ లో higher strata జనాభా పెరిగే కొద్ది బ్లూ కాలార్ జాబ్స్, కింది స్థాయి ఉద్యోగాలకోసం ఇతరులు మీద ఆధారపడటం సహజం. ఎక్కడో అమెరికా దాకా ఎందుకు.. మన దేశం లో బీహార్, యుపి వాళ్లు ఎంతమంది సౌత్ లో పనిచెయ్యట్లేదు హోటళ్లలో సర్వర్లుగా.. అపార్ట్‌మెంట్ లలో వాచ్‌మెన్లు గా.. చివరకు 10 గేదెల్ని పెట్టి పాల వ్యాపారం చెయ్యాలన్నా పని చెయ్యటానికి బీహారి వాడ్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి.
ఒకే దేశం లో ఉంటాం కాబట్టి వీసా గోలలు ఉండవు కనుక ఇది అంత సమస్య కాలేదు. అదే పెద్ద పెద్ద సంస్థలు అయితే పనివాళ్లు ఎక్కడ బాగా దొరుకుతారో అక్కడే పెట్టుబడులు పెట్టటమో, ఔట్‌సోర్సింగ్ కి ఇవ్వటమో జరిగింది. అమెరికన్ కంపెనీలు ఇలా చేసి లక్షల కోట్లు పోగేసాయి. ఇది మార్చటం అంత సులభం కాదు. అమెరికన్లు చిన్న ఉద్యోగాలు చెయ్యలేరు. చేసినా డాలర్ వాల్యూ పడిపోతుంది… ఎక్కువ జీతం ఇస్తే ఆ ప్రోడక్ట్స్ ని కంపెనీలు అమ్మలేరు. America will no longer be attractive to the world. అదే జరిగితే ప్రపంచం మీద అమెరికా పట్టు కోల్పోతుంది. ఏది ఏమైనా ఇది శుభపరిణామమే.
అమెరికన్లు చిన్న ఉద్యోగాలు చెయ్యలేరు – దీన్ని జరుగుబాటు రోగం అంటారు. వీళ్ల ముందుతరం వాళ్లు చేయలేదా? అవసరం పడితే వీళ్లూ చేస్తారు. మొదట వెనకబడిన ప్రాంతాల వాళ్లు వచ్చి చేస్తారు (మన దేశంలో బిహారీలు సౌత్‌కి వచ్చి చేసినట్లు) తర్వాత అందరికీ అలవాటు పడుతుంది. గ్రేట్ డిప్రెషన్ ఎదుర్కున్న జాతి అది. ప్రభుత్వమే కొన్ని పెద్ద ప్రాజెక్టులు తలపెట్టి పని కల్పించవచ్చు.
ఆ ముందు తరం వాళ్లు చేసాకే కదా ఈ పరిస్థితి వచ్చింది. అంటే వాళ్లు ఆర్ధికంగా పురోగతి సాధించి ఈ చిన్న చిన్న ఉద్యోగాలు మనం చేస్తే గిట్టుబాటు కాదనే కదా ఔట్‌సోర్సింగ్ కి ఇచ్చింది.
ట్రంప్ ఒక పక్క ప్రభుత్వ అనవసర ఖర్చులు తగ్గించాలని ఉన్న వాళ్లనే పీకేస్తుంటే ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్లు నెత్తికెత్తుకొని మరీ ఉద్యోగాలు కల్పిస్తాడని అనుకోను
Adi Great recession anukunta
correct , volunteer jobs eddam .. USA lo appuddu jai ho trump antaru
ప్రభుత్వమే కొన్ని పెద్ద ప్రాజెక్టులు తలపెట్టి పని కల్పించవచ్చు.
correct , volunteer jobs eddam .. USA lo appuddu jai ho trump antaru
అమెరికా అతిపెద్ద ఆదాయ వనరు : యుద్ధ పరికరాలు అమ్మడం. మిగతా దేశాలు వాటి మీద ఆధారపడటం తగ్గితే, ఆ దేశాలకి చాలా డాలర్ మారక ద్రవ్యం మిగులుతాడు.
“నిరుద్యోగం పెరుగుతోందని హాహాకారాలు చేయగానే కరోనా పేరు చెప్పో, మరో పేరు చెప్పో డబ్బు పంపిణీ చేసి, ద్రవ్యోల్బణాన్ని పెంచారు పాలకులు. పంపిణీ చేస్తే ఏం లాభం? వస్తూత్పత్తి జరగాలి కానీ!”
Mari Jagan gaaru kuda chesindhi idhe ga…
కాపీ పేస్ట్ చెయ్యడం ఎలానో రాస్తే తొలగించారు, చాలా ఆత్మ రక్షణ లో ఉన్నారు పాపం!