రెమ్యూనిరేషన్లు భారీ.. సినిమా.. సారీ!

హిట్ ఇచ్చిన, ఇస్తున్న హీరోల వెంటపడుతున్నారు అంటే అర్థం వుంది. ఏళ్ల తరబడి డిజాస్టర్లే ఇస్తూ పోతున్న వారి వెంట పడుతున్నారు అంటే అర్థం ఏమిటి?

మిడ్ రేంజ్ సినిమాలకు, మిడ్ రేంజ్ హీరోలకు కష్టకాలం ముందు ముందు వుందని గతంలోనే గ్రేట్ ఆంధ్ర అనేక సార్లు విశ్లేషించింది. విజయాలు లేకపోయినా హీరోల రెమ్యూనిరేషన్లు తగ్గకపోవడం అనే కీలక కారణాన్ని నిర్మాతల గిల్డ్ పరిష్కరించలేకపోవడమే మిడ్ రేంజ్ సినిమాల కష్టాలకు ప్రధాన కారణం. ఇది ఎవరి వల్ల కావడం లేదు. రెమ్యూనిరేషన్ తగ్గించుకోని హీరోలను నిర్మాతలు పక్కన పెట్టడం లేదు. హ్యాపీగా సినిమాలు చేస్తూనే వున్నారు. పదుల కోట్లు అర్పిస్తూనే వున్నారు. సినిమాలు బోల్తా కొడుతుంటే తప్పు తమది కాదు సమీక్షలది అంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.

నిర్మాతల గిల్డ్ గతంలో సినిమా నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేసింది. నిర్మాణ ఖర్చుల్లో కీలకం హీరోల పారితోషికాలు. కానీ ఇక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు. డిమాండ్ సప్లయ్ ప్రకారమే రెమ్యూనిరేషన్లు వుంటాయని కొందరు వాదించారు. మొత్తం మీద ఆ ప్రయత్నం అలా వీగిపోయింది.

అప్పట్లో గిల్డ్ రెమ్యూనిరేషన్లు తగ్గించే ప్రయత్నం చేసినప్పటి నుంచి ఇప్పటికి రెమ్యూనిరేషన్లు చాలా పెరిగాయి. డిమాండ్ వున్న హీరోల రెమ్యూనిరేషన్లు ఎలాగూ పెరిగాయి. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పది కోట్ల రేంజ్‌లో ఉండే బాలయ్య రెమ్యూనిరేషన్ 30 కోట్లు దాటింది. మెగాస్టార్ రెమ్యూనిరేషన్ 75 కోట్లు. ధనుష్ 50 కోట్లు. శివకార్తికేయన్ 30 కోట్లు. నాని రెమ్యూనిరేషన్ 30 కోట్లు. రవితేజ 25 కోట్లు. సిద్దు జొన్నలగడ్డ 15 కోట్లు. విష్వక్ సేన్ 6 కోట్లు, శ్రీవిష్ణు 5 కోట్లు. శర్వానంద్ 10 కోట్లు. కళ్యాణ్ రామ్ ఇటీవల సినిమాకు తీసుకున్నది 8 కోట్లు అని టాక్ వుంది. సందీప్ కిషన్ 3 కోట్లు. ఇలా మినిమమ్ రెమ్యూనిరేషన్ రెండు మూడు కోట్లు వుంటోంది.

దర్శకులు కూడా అదే రేంజ్ లో వున్నారు. టాప్ లైన్ డైరక్టర్ల సంగతి పక్కన పెడితే యంగ్ డైరక్టర్లు అంతా 15 నుంచి 25 కోట్లు డ్రా చేస్తున్నారు. బాబీ, గోపీచంద్ మలినేని 15 కోట్లకు చేరారు. అనిల్ రావిపూడి 25 కోట్లకు చేరుకున్నారు. చందు మొండేటి 10 కోట్లు తీసుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ కొడితే 3 కోట్లు. రెండు సినిమాలు వరుసగా హిట్ కొడితే 5 కోట్లు. మూడు వరుస హిట్ లు వుంటే 10 కోట్లు. ఇక అక్కడి నుంచి పెరుగుతూనే వుంటుంది లెక్క.

ఇక్కడ సమస్య ఏమిటంటే హిట్ హీరో, పుల్లింగ్ వున్న హీరో, కాంబినేషన్ కు పనికి వచ్చే దర్శకుడు తీసుకున్నా ఫరవాలేదు. కనీసం ఓపెనింగ్ వుంటుంది. యావరేజ్ అయితే ఎంతో కొంత డబ్బులు వెనక్కు వస్తాయి. కానీ అసలు హిట్ అంటే ఏమిటి అని అనుకునే హీరోలు దశాబ్దాల కాలంగా హిట్ లేని హీరోలు కూడా పది కోట్లు తీసుకోవడం ఏమిటి?

ఒక హీరోకి హిట్ వచ్చే పదేళ్లు దాటేసిందేమో? ఓ ప్రాజెక్ట్ తనకు కాకుండా వేరే వాళ్లకు చేస్తున్నారని తెలిసి, ఓ నిర్మాత వెళ్లి అడిగినంతా ఇచ్చి, తనే చెేస్తా అని ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో వుంది. విడుదలయ్యాక పరిస్థితి ఏమిటో తెలియదు.

ఓ యంగ్ హీరో మార్కెట్ ను చాలా ప్లాన్డ్ గా పెంచేసారు. కానీ ఆ హీరోతో సినిమా తీసిన ప్రతి నిర్మాత నష్టపోయారు తప్ప లాభపడలేదు. ఇప్పుడు మూడు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఏ ఒక్కటీ అమ్ముడుపోవడం లేదు. ఎవరు తీయమన్నారు? చెల్లే సరుకో కాదో చూసుకోవాలి కదా?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దిల్ రుబా సినిమాకు అయన ఖర్చు 16 కోట్లు.

విష్వక్ సేన్ లైలా సినిమాకు అయిన ఖర్చు 25 కోట్లు.

సందీప్ కిషన్ మజాకాకు అయిన ఖర్చు 25 కోట్లు.

సిద్దు జొన్నలగడ్డ జాక్ అయిన ఖర్చు 40 కోట్లు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి 40 కోట్లు.. ఓదెల 2 ఖర్చు 25 కోట్లు.

నిర్మాణ వ్యయం ఇలా వుంది. పెరుగుతూ పోతోంది. ఇందులో అత్యధిక భాగం హీరోలకు. ఆపై కొంత వరకు దర్శకులకు. భారీ రెమ్యూనిరేషన్ తీసుకునే దర్శకులు అక్కడితో ఆగడం లేదు. పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్లను డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల పనితనం వీళ్ల పనితనంగా చెలామణీ అయిపోతుందని ప్లాన్. అలాగే మిగిలిన పనులకు కూడా టాప్ టెక్నీషియన్లను అడుగుతున్నారు.

ఇలా చాలా మంది నిర్మాతలు ఖాళీగా వుండలేక, ఏదో ఒక ప్రాజెక్ట్ ఎక్కించాల్సిందే అనుకుని ఏళ్ల తరబడి వరుసగా ఫ్లాపులే ఇస్తున్న హీరోలతో సినిమాలు తీస్తూ వారిని బతికిస్తున్నారు. సినిమాలు ఫ్లాపులు అవుతుంటే సమీక్షలను సాకులుగా ఎంచుకుంటున్నారు.

హిట్ ఇచ్చిన, ఇస్తున్న హీరోల వెంటపడుతున్నారు అంటే అర్థం వుంది. ఏళ్ల తరబడి డిజాస్టర్లే ఇస్తూ పోతున్న వారి వెంట పడుతున్నారు అంటే అర్థం ఏమిటి?

తప్పు ఎక్కడ వుంది.. నిర్మాతల్లోనా.. సమీక్షల్లోనా?

9 Replies to “రెమ్యూనిరేషన్లు భారీ.. సినిమా.. సారీ!”

  1. ఇక్కడ మాట్లాడుకోవలసినది రెమ్యునరేషన్ లు కాదు…. ఒక సినిమా ద్వారా ఎవరెవరి నల్లధనం ఎంతెంత తెల్ల ధనం గా మారింది అని……

    గడచిన 10 ఏళ్ళలో నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత ల పేర్లు చెప్పండి చూద్దాం.

    1. white ga conversion ki ee industry enduku chala ways vunnai 

      waste fellows kosam manam yenduku yedavalu avvali , valakemo cars buildings vip treatment ticket kone manaki yemo chippa . ademiti ante seva antaru  . mari 100 cr remuneration enduku aa money crafts ki esthe chala manchi films vastai 

      ticket rates reduce cheyachu 

  2. Yes.  చాలా దారుణం. రవి తేజ. అనే వాడు హిట్ లేదు.  నితిన్ కు.లేదు ఆ మాట కి వస్తె యంగ్ హీరో లు ఎవరికి హిట్స్ లేదు అయిన చాలా సాధారణంగా సినిమాలు మాత్రం వస్తున్నాయి. నాకిదే అర్థమా కావడం లేదు సినిమా అంటే మోజు తో. వచ్చినోళ్ళే ఎక్కువ నా పేరు కూడా ఒక మంచి నిర్మాతగా ఉండాలి అనే ఆశ ఈ హీరో లు ఫ్లాప్ అయితే ఎవడు ముఖం కోడ్ చోడోడు.  వేట్ హీరో లు

  3. ఛీ.. ఛీ.. కడుపుకు అన్నం తింటున్నారా.. రాజకీయం తింటున్నారా .. దేశం మొత్తం, మీడియా మొత్తం ఉగ్రదాడుల మీద రగిలిపోతుంటే, మీ దగ్గర నుండి ఒక్క ఆర్టికల్ రాకపోవడం అతి దారుణం

Comments are closed.