నిజం చెప్పిన నాని.. ఇండస్ట్రీ ఒప్పుకుంటుందా?

ఆడియన్స్ ఓ సినిమా చూడట్లేదంటే అది ప్రేక్షకుల తప్పు కాదు. అది పూర్తిగా మేకర్స్ వైఫల్యం.

తమ సినిమా ఫెయిలైతే సమీక్షకులపై పడి ఏడ్చే పరిశ్రమ మనది. ఫలానా సీన్ బాగాలేదని రివ్యూ రాశారు, అందుకే మా సినిమా పోయిందంటూ నెపం నెట్టేసే మేకర్స్ ఇక్కడ చాలామంది. ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయలేకపోయామని ఒక్కడు కూడా ఒప్పుకోడు.

సమీక్షకులే తమ రివ్యూలతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షిపిస్తూ, తామేదో ఆణిముత్యం తీశామనే భ్రమల్లో బతికేస్తుంటారు. ఇలాంటి వాళ్లందరూ ఒక్కసారి నాని చెప్పే మాటలు వినాలి.

“ఆడియన్స్ ఓ సినిమా చూడట్లేదంటే అది ప్రేక్షకుల తప్పు కాదు. అది పూర్తిగా మేకర్స్ వైఫల్యం. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు రెడీగా ఉంటారు థియేటర్లకు రావడానికి. ప్రేక్షకులు ఈమధ్య థియేటర్లకు రావడం లేదని ఎవరైనా అంటే నాకు కోపం వస్తుంది. ఆ తప్పు వాళ్లది కాదు, మనది. సినిమా బాగుందంటే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారా?”

కాబట్టి సినిమా బాగా తీయడం మేకర్స్ బాధ్యత అంటున్నాడు నాని. ఆ పనిచేయకుండా ఎన్ని రీజన్స్ పైకి చెప్పినా ఫలితం ఉండదని అన్నాడు. టాలీవుడ్ లో అందరూ కాకపోయినా కనీసం కొంతమంది ఈ స్టేట్ మెంట్ వినాలి. నాని మాట్లాడిన వీడియోను తమ సెల్ ఫోన్లలో సేవ్ చేసుకొని అప్పడప్పుడు వింటుండాలి.

6 Replies to “నిజం చెప్పిన నాని.. ఇండస్ట్రీ ఒప్పుకుంటుందా?”

  1. రివ్యూలతో సంబంధం లేకుండా సినిమా కంటెంట్ ఉంటె ఆడుడుతుంది అని నాని చెప్పలేదు…. సినిమాల నాణ్యత విషయం పై చేసిన కామెంట్…. ఏ సందర్భంలో చేసిన వ్యాఖ్య, మీరు నచ్చినట్లు వాడేసుకుంటున్నారు…..

  2. మంచి కంటెంట్ కు నిర్వచనం ఏంటి? 

    కొన్ని సార్లు హీరో/ డైరెక్టర్ ని చూసి అందులో ఎలాంటి కంటెంట్ ఉందొ లేదో తెలుసుకోకుండానే మొదటి ఆటకే సినిమాను చంపేస్తున్నారు… వేరే ఎవరో కాదు ప్రేక్షకులే.

    మొదటి ఆటకే మూవీని ఫ్లాప్ చేస్తున్నారంటే ఎవరూ చూడలేదని, ఎలాంటి రివ్యూలు లేవనే కదా అర్ధం

  3. RRR సినిమా హిట్టా కాదా చెప్పు. ఆ తర్వాత ఈ వెబ్సైట్ లో వచ్చిన రివ్యూ చూడు. తర్వాత మాట్లాడు రివ్యూస్ అవసరం గురించి, రివ్యూ చేసే వాళ్ళ గొప్పతనం గురించి

Comments are closed.