మెగాస్టార్ యువి కాంబో సినిమా విశ్వంభర. ఈ సినిమా గ్లింప్స్ వచ్చిన దగ్గర నుంచీ సిజి పనుల మీద జరుగుతున్న డిస్కషన్ ఇంతా అంతా కాదు. మొత్తం సిజి పనులను పెద్ద కంపెనీలకు అప్పగించారని, వాటి వర్క్ మీద క్లారిటీ వచ్చాకనే విడుదల తేదీ ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. సరే రోజులు గడుస్తున్నాయి. షూటింగ్ దాదాపు పూర్తవుతోంది. విడుదల డేట్ మాత్రం అఫీషియల్ గా రాలేదు.
ఇలాంటి నేపథ్యంలో వున్నట్లుండి ఓ వార్త గుప్పుమంది. చకచకా చలామణీలోకి వచ్చింది. విశ్వంభర గ్రాఫిక్స్ మీద 70 నుంచి 75 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ రంగంలోని ప్రఖ్యాత సంస్థలకు ఈ పనులు అప్పగించారని, గ్రాఫిక్స్ ఇక టాప్ నాచ్ లో వుంటాయన్నది ఆ వార్తలు సారాంశం. ఫ్యాన్స్ హ్యపీ అయ్యారు. హమ్మయ్య, తమ హీరో సినిమా మీద ఇక ట్రోలింగ్ లు వుండవు అని భరోసా పడ్డారు.
ఇదిలా వుంటే ఈ వార్తలు వచ్చిన తరువాత ఇన్ సైడ్ వర్గాలు మరో ముచ్చట చెప్పాయి. అసలు విశ్వంభర సినిమా గ్రాఫిక్స్ కు ఖర్చు చేస్తున్నది 25 కోట్లు మాత్రమే. అంతకు మించి పైసా ఖర్చు చేయడానికి బడ్జెట్ లేదని నిర్మాతలు తెగేసి చెప్పారు అన్నది ఆ ముచ్చట. నిజానికి పాతిక కోట్లు కూడా చిన్న మొత్తం కాదు. అలా అని నిర్మాతలు అయిన యువి సంస్థ అధినేతలు ఖర్చుకు వెనుకాడే వారు కాదు. కానీ విశ్వంభర బడ్జెట్ చాలా ఎక్కువ. 250 కోట్ల మేరకు అవుతోంది.అదే టైమ్ లో విశ్వంభర ఆరంభించినపుడు ఓటిటి లెక్కలు వేరు. ఇప్పటి లెక్కలు వేరు. ఇలాంటపుడు బడ్జెట్ ను కట్ చేయకతప్పనిసరి పరిస్థితి
అందుకే సిజి పనులకు పాతిక కోట్ల మేరకు బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పాతిక కోట్లు అంటేనే చాలా అంటే చాలా భారీ మొత్తం. ఓ సినిమాకు పాతిక కోట్లు గ్రాఫిక్స్ కు ఖర్చు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. కానీ 70 కోట్లకు పైగా అంటే మరింత హైప్ వస్తుందని అలా పుట్టించారేమో వార్తలు.
Anthega
ఒక సగటు తెలుగు సినిమా అభిమానిగా ఇదీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు వీళ్ళు తీసే కళా ఖండాలకు అన్నేసి కోట్లెందుకు. ఎంత గొప్ప సినిమా అయినా 50 కోట్లలో పూర్తి అవ్వాలి రెమ్యూనరేషన్లతో కలిపి.. ఇదంతా జనం డబ్బేగా లేదంటే అక్రమంగా సంపాదించిన దాన్ని వైట్ మనీ చేసుకోవడమేగా