సినిమా హిట్ కావడం, ఫ్లాప్ కావడం ఎవరి చేతుల్లో వుండదు. ఆర్జీవీ చెప్పినట్లు ఎవరూ ఫ్లాపు కావాలని సినిమా తీయరు. తీసిన సినిమా జనాలకు నచ్చకపోవడం అనేదాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్రభావితం చేయలేరు. సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియా ఏదైనా సరే కాస్త తమ వైఖరి తాము చెప్పచ్చు కానీ, అంతిమంగా నిర్ణేతలు ప్రేక్షకులే. అది ముందు అంగీరించాలి అందరూ.
ఒక సినిమా సరైన ఓపెనింగ్ తీసుకోలేదు అంటే సవాలక్ష కారణాలు వుంటాయి. ఆ హీరోకి పుల్లింగ్ లేకపోవడం కావచ్చు. సరైన కాంబినేషన్ లేకపోవడం, సరైన డేట్ కాకపోవడం, సీజన్ సరిగ్గా లేకపోవడం ఇలా ఒకటి కాదు సవాలక్ష కారణాలు వుంటాయి ఓపెనింగ్ తీసుకోవడం వరకు. కానీ వన్స్ సినిమా రిలీజ్ అయిన తరువాత బాగుంటే పికప్ అందుకుని, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు అనేకం వున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులు తప్ప మరెవరు కాదు.
కానీ హీరోలు తమ సినిమాకు ఓపెనింగ్ లేదంటే భరించలేరు. ఎందుకంటే వారి ఓపెనింగ్, వారి పుల్లింగ్ మీదే రెమ్యూనిరేషన్ ఆధారపడి వుంటుంది. తరువాత సినిమా వుంటుంది. అందుకే ఓపెనింగ్ లేకపోవడానికి తమకు అనువైన కారణాలు వెదుక్కోవడానికి చూస్తారు. లేదంటే ఓపెనింగ్ అద్భుతం అంటూ ఆత్మవంచన చేసుకుంటారు. ఇదే థియరీ దర్శకులకు కూడా వర్తిస్తుంది. తమ సినిమా పరాజయం పొందింది అంటే అది తమకు నామర్దా కదా అందుకే ఏదో ఒకటి మాట్లాడతారు.
హీరోలు, దర్శకులు బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడే మాటలు గమ్మత్తుగా వుంటాయి. విడుదల ముందు భారీగా నిర్మాణ వ్యయం అంటారు. విడుదలయ్యాక అబ్బే అంత వ్యయం కాలేదు అంటారు. అలాగే కలెక్షన్లు అదిరిపోయాయి అంటారు. హీరోలు, దర్శకుల మాటను నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఖండించలేరు.
కేవలం మెహర్బానీకి తప్ప మరెందుకు పనికి రాని కబుర్లు ఇవన్నీ. కానీ ఇవాళ జనం తెలివి మీరిపోయారు. ఏ సినిమా ఎలా ఆడుతోందో అంతా ఓపెన్ సీక్రెట్.
నిజానికి హీరోలు, దర్శకులు చేయాల్సింది ఆత్మవంచన కాదు. ఆత్మ పరిశీలన. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. మళ్లీ మళ్లీ ఆ తప్పులు చేయకుండా వుండాలి. అదే అసలు జరగాల్సిన సంగతి.
విజయశాంతి కామెంట్స్ కీ కౌంటర్ నువ్వే ఎందుకు ఇస్తున్నావ్ ?? ఏంటీ పనికిమాలిన ఆర్టికల్స్??
GA Venkat,
a lot of telugu hero’s and telugu cinema producers who are benami like Bandla G and others, they produce movies just to show losses and convert block money into white. This is well known truth. If any govt just tighten these screws Telugu would nsustry will pushed to the edge.
some hero’s like Sandeep, Varun Tej, …etc are just covering block to white..Nothing short and nothing more than that
Neeku …. nee articlrs ki…. ee title apt abba
Correct news
మన తెలుగులో వందకోట్ల సినిమా తర్వాత లేదు. ఇప్పుడు కలెక్షన్లు మూడువేలకోట్లు
థియేటర్లు వద్దు.. ఓటీటీలు కావాలి