‘నేను చేస్తున్నది తప్పు అని తేలితే.. రాజకీయాల నుంచి వైదొలగుతా..’ అనేంత పెద్ద సవాలు చేయాలంటే.. చాలా గుండెధైర్యం కావాలి. మామూలుగా ఈ మాట చెప్పాలంటే మూడు రకాల లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటేనే ఆ మాట చెప్పగలరు.
ఒకటి- ఆ మాట చెప్పగల వ్యక్తి అత్యంత నిజాయితీ పరుడు, జీవితంలో ఎన్నడూ ఎలాంటి తప్పూ చేయనివాడు అయి ఉండాలి. రెండు- ఆ వ్యక్తి అత్యంత అజ్ఞాని, ఏది తప్పు ఏది ఒప్పు అనే స్పృహలేనివాడు అయి ఉండాలి. లేదా, మూడు- తాను ఏం చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు.. అనే తరహా ప్రత్యేకమైన దృక్కోణం కలిగి ఉన్నవాడు అయిఉండాలి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహార సరళిని గమనిస్తే.. ఆయన మూడో రకానికి చెందిన నాయకుడు అనిపిస్తోంది.
తన నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వారిని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీభత్సంగా బెదిరిస్తున్నాడని, కంపెనీ నుంచి రవాణా కాంట్రాక్టులన్నీ కూడా తనకే కావాలంటూ.. తన అనుయాయులకు, బినామీలకు ఇప్పించుకోవడానికి కంపెనీ మీద ఒత్తిడి తెస్తున్నారని కొన్ని వారాలుగా విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సాగిస్తున్న అడ్డగోలు దందాల గురించి పచ్చమీడియాలోనే ప్రముఖంగా రావడం గమనార్హం.
అల్ట్రాటెక్ సిమెంటు ఫ్యాక్టరీకి ముడి సరుకు రవాణా చేయడం, ఉత్పత్తి అయిన వాటిని రవాణా చేయడానికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ తన వారికే కావాలనేది ఆదినారాయణ రెడ్డి పట్టుదల అని చెబుతున్నారు. అప్పటికీ కంపెనీ వారు ఆయన అడిగిన కాంట్రాక్టులు కొన్ని ఆయన అనుచరులకు ఇచ్చారు. కానీ.. మొత్తం తనకే కావాలని ఆయన గొడవ చేస్తున్నారు.
కంపెనీకి ముడిసరుకు తెచ్చే రవాణా వాహనాల్ని కూడా అడ్డుకుని రానివ్వకపోవడంతో.. రెండు యూనిట్లలో ప్రొడక్షన్ కూడా ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బిజెపి ఎమ్మెల్యే పరిశ్రమలను బెదిరిస్తూ దందాలు సాగిస్తూ ప్రగతి వినాశకారిగా తయారయ్యేడానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఆదినారాయణరెడ్డి కొత్తపాట ఎత్తుకున్నారు. తాను చేస్తున్నది తప్పని తేలితే.. రాజకీయాల నుంచి వైదొలుగుతానని అంటున్నారు. అయ్యా బాబూ.. తమరు చేస్తున్నది తప్పే అని తమ అనుకూలమీడియా నే కోడై కూస్తున్నది నాయనా.. తమ చెవులకు వినిపించడం లేదా? అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఆయన మాత్రం.. నేను చేస్తున్న ప్రతిపనీ కరెక్టే అని మొండికేసి మూడోరకంలాగా కూర్చుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
కానీ.. ఇక్కడ చంద్రబాబునాయుడు ఓ సంగతి గుర్తుంచుకోవాలి. పన్నులు కట్టాలన్నందుకు, నిబంధనలు పాటించాలన్నందుకు అమర్ రాజా లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతే.. జగన్ ను భరించలేక పరిశ్రమలు వెళ్లిపోయాయని అన్నారు. కానీ.. జగన్ గానీ, ఆయన పార్టీ అనుచరులు గానీ.. ఈ కంపెనీల వద్ద ఇలాంటి దందాలు చేయలేదని ఆయన గుర్తించాలి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే.. ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లు చేస్తున్న దందాలు మొత్తంగా కూటమి ప్రభుత్వం పరువు తీస్తాయని ఆయన తెలుసుకోవాలి.
“జగన్ గానీ, ఆయన పార్టీ అనుచరులు గానీ.. ఈ కంపెనీల వద్ద ఇలాంటి దందాలు చేయలేదని”…lol…remember the pollution harassment!!!
Its like saying I care about you that’s the only reason why I tried to murder you…lol..che ddi batch
ఆదినారాయణ రెడ్డి ఏమో కానీ మన అన్నియ్య మాత్రం తప్పకుండా మూడో రకానికి చెందుతాడు
That is sampada srustinche Manchi Prabhutbam.
Previous jammalamadugu MLA per bag 10 rupees collected from same company at that time where are u