మరో క్రేజీ కపుల్ విడిపోయింది

దాదాపు ఐదేళ్లు ఇద్దరూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు అది కాస్తా బ్రేకప్ అయింది. గిల్ కు సారా దూరంగా జరిగింది.

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ నటి కాదు, ఆమె క్రికెటర్ కూడా కాదు. కానీ తన అందంతో దేశాన్ని ఆకర్షించింది. సచిన్ కూతురు అనే ఇమేజ్ దానికి తోడైంది. ఫలితంగా ఆమె స్టార్ అయింది.

ఇవన్నీ ఒకెత్తయితే.. క్రికెటర్ శుభమన్ గిల్ తో డేటింగ్ లో ఉందనే పుకార్లు ఆమెను నిత్యం లైమ్ లైట్లో ఉండేలా చేశాయి. అయితే తామిద్దరం ప్రేమలో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఎప్పుడూ వీళ్లు బయటకు చెప్పలేదు, అలా అని ఖండించలేదు.

దాదాపు ఐదేళ్లు ఇద్దరూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు అది కాస్తా బ్రేకప్ అయింది. గిల్ కు సారా దూరంగా జరిగింది. దీనికి బలమైన సాక్ష్యం, అతడి ఇనస్టాగ్రామ్ ను ఆమె అన్-ఫాలో కొట్టడమే.

అవును.. మొన్నటివరకు సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకర్నొకరు ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు సారా అతడికి దూరంగా జరిగింది. దీనికి కారణం అవ్నీత్ కౌర్. 23 ఏళ్ల అవ్నీత్, గిల్ కు దగ్గరైంది. తన ఎకౌంట్ లో ఫొటోలు కూడా షేర్ చేసింది. అంతేకాదు, గిల్ కోసం ఆమె ప్రత్యేకంగా దుబాయ్ వచ్చి కొన్ని రోజులు అతడితో ఉందనే పుకార్లు కూడా ఉన్నాయి.

6 Replies to “మరో క్రేజీ కపుల్ విడిపోయింది”

Comments are closed.