థియేటర్లలో ఫ్లాప్.. కట్ చేస్తే తిరుగులేని రికార్డు

తెలుగులో మాత్రం సూర్యవంశం అన్ని ఫార్మాట్లలో హిట్టయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా, బుల్లితెరపై ఇప్పటికీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

కొన్ని సినిమాలంతే. కంటెంట్ బాగున్నప్పటికీ టైమింగ్ సెట్ అవ్వదు. అందుకే థియేటర్లలో ఫ్లాప్ అవుతుంటాయి. ఆ తర్వాత అవే క్లాసిక్స్ అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

ఆ సినిమా పేరు సూర్యవంశం. హిందీలో ఈవీవీ సత్యనారాయణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు. సౌందర్య హీరోయిన్. జయసుధ, రచన ఇతర కీలక పాత్రలు పోషించారు.

థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంది. మరీ ముఖ్యంగా టీవీల్లో ఈ సినిమాకు అంతులేని ఆదరణ లభించింది. విడుదలై పాతికేళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

టీవీలోనే కాదు, యూట్యూబ్ లో కూడా ఇది పెద్ద హిట్. గోల్డ్ మైన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను 3 యూట్యూబ్ ఛానెళ్లలో అప్ లోడ్ చేస్తే, మొత్తంగా 701 మిలియన్ వ్యూస్ సాధించింది.

అయితే తెలుగులో మాత్రం సూర్యవంశం అన్ని ఫార్మాట్లలో హిట్టయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా, బుల్లితెరపై ఇప్పటికీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్. స్మాల్ స్క్రీన్ లో మాత్రం కల్ట్ క్లాసిక్ స్టేటస్ పొందింది. ఇలాంటివే మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.

16 Replies to “థియేటర్లలో ఫ్లాప్.. కట్ చేస్తే తిరుగులేని రికార్డు”

  1. అది అతడు కాదురా, ఖలేజా. అతడు థియేటర్లలో కూడా సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమారా అయ్యా. ప్రజా సొమ్ము దోపిడీ చేసి బినామీ పేర్లతో ఛానెల్ పెట్టినంత తేలిక కాదు, వార్తలను వ్రాయడం, ప్రసారం చేయడం. దానికి ఖలేజా ఉండాలి, బుర్ర కూడా ఉండాలి. 

  2. ప్యా*లెస్ లో పు*లకేశి గాడు పం*చిన  శిలా*వతి గంజా*యి పొట్లం వేసుకుని రాసావ ఏంటి? 

    అత*డు ఫ్లాప్ నా? 

  3. అతడు ఫ్లాప్ అని.. అందరు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత మురళిమోహన్ కూడా చెప్పాడు.. 8 కోత్లలో తీస్తానని చెప్పి 22 కోట్లు ఖర్చు పెట్టించాడు గుడూజీ గాడు.

    ఒక్కడు తరువాత మహేష్ కి ఉన్న మార్కెట్ ప్రకారం, 15 కోత్ల బిజినెస్ మాత్రమే జరిగింది.. 7 కోట్లు లాభం రావల్సిన చోట 7 కోట్లు బొక్క పడింది..

    ఆ దెబ్బకి సినిమా ప్రొడక్షన్ ఆపేసి, పూర్తిగా రెయల్ ఎస్టేట్ లోకి పోయింది జయభేరి !

    థియేటర్ కలెక్షన్ కూడా 22 కొట్లే !

    ముందు అనుకున్న బడ్జెట్ 7 కోట్లలో తీసి ఉంటే, సూపర్ హిట్ అయ్యేది..

    కనీసం మహేష్ కి ఉన్న మార్కేట్ ప్రకారం 15 లో తీసినా ఎంతో కొంత లాభం ఉండేది..

    సుదర్శన్ 35 లో 175 ఆడించేస్తే హిట్ అవ్వదు.. లోపల లెక్కలు తేలియాలి .

    22 పెట్టి, 22 వస్తే హిట్టా, బ్రేక్ ఈవెనా, పైన ఇంకా పెట్టి రిలీజ్ చేసిన వాళ్ళకి ఫ్లాపా ?

    అది మాటీవీ లో మాత్రమే హిట్

    ఖలేజా అయితే అందరికీ బొక్కే పెట్టింది

  4. సూర్య వంశం హిందీ సినిమా థియేటర్ లలో ప్లాప్ అవ్వడానికి కారణం యువ హీరో గా అమితాబ్, స్నేహితుడు గా అనుపమ్ ఖేర్ నప్పక పోవడం. కాని టీవీ లో మాత్రం తెలుగు లో అతడు కన్నా ఎక్కువ సార్లు ప్రసారం అయి రికార్డు viewer షిప్ సాధించింది.

    1. ఇది పద్మాలయా వారు హిందీ లో రీమేక్ చేశారు, తెలుగు నటులే ఎక్కువ నటించారు.

Comments are closed.