టాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. లీడింగ్‌లో ఉన్న పెద్ద బ్యానర్లు సైతం సినిమా నిర్మాణాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మందగించింది. రాజకీయ కార్యకలాపాలు అనిశ్చితంగా ఉన్నాయి. ఫైనాన్షియర్లు రెగ్యులర్ కస్టమర్ బ్యానర్లకూ ఆచితూచి అప్పులు ఇస్తున్నారు తప్ప, ఎలా పడితే అలా ఇచ్చేయడం లేదు. రన్నింగ్ అకౌంట్లు అన్నది లేదు. సినిమా సినిమాకు క్లియర్ కావాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో పెద్ద సంస్థలు కూడా కొత్త ప్రాజెక్ట్‌లు ఎక్కించడానికి ముందు వెనుక ఆడుతున్నాయి.
ఏదో ఒక విధమైన ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉన్న సంస్థల చేతిలో చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కానీ ఇవి కూడా వెంటనే స్టార్ట్ చేయడం లేదు. ఓటీటీ సంస్థలు ఓకే అన్న తర్వాతే సెట్స్ మీదకు పంపిస్తున్నారు. టీ సిరీస్ లాంటి సంస్థ బ్యాకింగ్ మైత్రీకి ఉంది. అలాగే మైహోమ్/ఆహా లాంటి సంస్థతో భాగస్వామ్యం సితార సంస్థకు ఉంది. అందువల్ల ఆ రెండు సంస్థలు ఎక్కువ సినిమాలు ప్లాన్ చేశాయి. కానీ ఈ రెండు సంస్థలు కూడా ఆచితూచి గాని ప్రాజెక్ట్‌లు మాత్రమే ఓటీటీ అగ్రిమెంట్‌లు కాకుండా సితార సంస్థ సెట్స్ మీదకు తీసుకెళ్లడం లేదు.
మైత్రీ సంస్థ చేతిలో భారీ సినిమాలు రెండు మూడు ఉన్నాయి. మిడ్‌రేంజ్ సినిమాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ గ్రాఫ్‌లో ఒకటి రెండు తప్ప మిడ్‌రేంజ్ సినిమాలు అన్నీ నష్టాలే మిగిల్చాయి.
దిల్ రాజు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి – విజయ్ దేవరకొండ, నితిన్ చేయాల్సిన సినిమాలు ఇవి. మిగిలిన యాక్టివ్ బ్యానర్లన్నింటిలో ఒకటి లేదా రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. సితార, మైత్రీని పక్కన పెడితే మిగిలిన సినిమాలు అన్నీ కలిపి లెక్క పెట్టినా పాతిక సినిమాలు లెక్క తేలవు.
తరువాత తరవాత ప్రాజెక్ట్‌లు వస్తాయి – రాకుండా పోవు. కానీ ఆచితూచి ప్రాజెక్ట్‌లు చేయాలి అన్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది.
ఇప్పటికే ముగ్గురు – నలుగురు చిన్న, మిడ్‌రేంజ్ హీరోలు ఖాళీగా కూర్చున్నారు. కనీసం మరో నలుగురు – అయిదుగురు హీరోలు ఖాళీగా కూర్చునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నది ఇండస్ట్రీ జనాల అంచనా.
ఇదంతా క్రిప్టో కరెన్సీ పుణ్యమే……
నల్లధనాన్ని, దొంగ కరెన్సీ ని (pak&b-desh నుండి దేశం లోకి ఇంజెక్ట్ చేయబడుతున్న దొంగ నోట్లు) తెల్లగా మార్చుకునేందుకు ఒకప్పుడు సినిమా బాగా ఉపయోగ పడేది…..ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది…..
కరెన్సీ నోట్లను రద్దు చేసిన తరువాత…..బాలీవుడ్ పరిస్థితి చెప్పుకోలేని దారుణ స్థితికి జారిపోయింది……
ఏటి సేస్తారు.. సీపు లిక్కర్ ఆగిపోనాది
Future లో heros heroins tv serials web series utube channels direct ott release లు పెట్టుకోవడమే… అదీ చేత కాకుంటే pubs bars gam…bling centers dr…ug maf…ias po…rn sites నడుపుకోవటమే
Thank God audience wont get torture from these so called actors
Edho rasaavu…rasina neeku chadivina maaku ardham kaaledhu
Sitara anni chinna movies ne kada