ఆ మిడ్ రేంజ్ హీరో రెమ్యూనరేషన్ ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు. మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. రెండు దాదాపు పూర్తయ్యాయి. ఒకటి పూర్తి కావాలి. అయితేనేం మూడు సినిమాలు కూడా ఓటిటి అమ్మకాలు జరుపుకోలేక పోతున్నాయి. శాటిలైట్ లు ఎలాగూ కావడం కష్టం. హిందీ అమ్మకాలు మందగించాయి. ఇంకా నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుంది?
ఒక సినిమాకు నలభై కోట్ల మేరకు ఖర్చయింది. థియేటర్ హక్కులు 15 కోట్ల మేరకు చెబుతున్నారు. కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పోనీ వస్తారు అనుకున్నా, మిగిలిన పాతిక కోట్లు నాన్ థియేటర్ మీద నుంచి రావాలి. వస్తుందా అంటే అదీ అనుమానమే. మొన్నటి వరకు ఓ ఓటిటి సంస్థతో కిందా మీదా పడ్డారు. ఇప్పుడు మరో ఓటిటి సంస్థతో బేరాలు సాగుతున్నాయి.
మరో సినిమాకు పాతిక నుంచి ముఫై కోట్ల వరకు అయింది. అయితే అదృష్టం ఏమిటంటే ఇదే నిర్మాతకు మరో పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ వుంది కనుక, దాన్ని ముడిపెట్టి దీన్ని అమ్మాలని చూస్తున్నారు. జానర్ అడ్వాంటేజ్ వుంది కనుక ఫరవాలేదు అనే ధీమా వుంది.
ఇంకో సినిమా ఎప్పటి నుంచో నత్త నడక నడుస్తోంది. నిర్మాతకు బాధలు ఎక్కువ. అయితే ఇక్కడ అదృష్టం ఉంది. మరో భారీ ప్రాజెక్ట్ చేతిలో వుంది. అందువల్ల దాన్ని ముడి పెట్టి అమ్మాలని చూస్తున్నారు.
అంటే ఇలా చేతిలో భారీ సినిమాలు ఉన్నవారు అయితేనే సినిమాలు ప్లాన్ చేయాలేమో? లేదంటే కష్టమే. కానీ హీరో రెమ్యూనరేషన్ మాత్రం తగ్గదు. ఇది ఒక్క హీరో కథ కాదు. టాలీవుడ్ హీరోలు అందరూ అలాగే వున్నారు.
పైన చెప్పిన వాళ్ళల్లో ఎవరైనా నష్టాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే (రైతు ల లాగా) ….ఈ వార్త నిజం అని నమ్మొచ్చు.
sinimaalu teesi nashtapoyamantu evvadaina poyaada