భారతీయ వైవాహిక వ్యవస్థను గమనిస్తే.. ఒకప్పుడు చాలా స్వతంత్రం ఉండేది, మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి, పితృస్వామ్య వ్యవస్థ పరమావధి అయ్యింది. పురుషుడు వీలైనన్ని వివాహాలు చేసుకునే సంప్రదాయం ఐదారు దశాబ్దాల కిందటి వరకూ కొనసాగింది. మగవాడికి లైంగిక స్వేచ్ఛ ఉండేది. అక్రమ సంబంధాలు కలిగినా మగాడు కాబట్టి.. అనే ఆమోదం ఉండేది. అయితే రోజులు మారాయి.. ఇప్పుడు ఇద్దరి భార్యలతో కాపురం చేయగల మగాడు పుట్టి చాలా కాలం అయ్యింది! ముప్పై యేళ్ల కిందటే ఇలాంటి పెళ్లిళ్లకు చాలా వరకూ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు వేరే రకాల సంబంధాలు ఏమో కానీ, ఇద్దరి భార్యలతో కాపురం అనే ఊసు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఇంకో విషయం ఏమిటంటే.. వైవాహిక సంప్రదాయాలకూ, విలువలకు అతిగా విలువను ఇస్తున్నది కూడా మధ్యతరగతే ఇండియాలో చాలా కాలంగా! లో క్లాస్ లో పెళ్లి, శృంగారం, లైంగిక సంబంధాల విషయంలో అతిగా పట్టింపులు ఎప్పుడూ ఉండవు! స్త్రీలకూ, పురుషులకూ కూడా అక్కడ స్వతంత్రం ఉంటుంది. పరిశీలించి చూడాలంతే! హై క్లాస్ సంగతి సరేసరి! వారికీ పెద్ద పట్టింపులు ఉండవు. అందుకే మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న డబ్బున్న వాళ్లు కూడా ఆరాధ్యనీయులు అవుతున్నారు! వారు మరో భగత్ సింగ్ గా, మరో మార్గదర్శిగా, ఆదర్శవంతంగా కనిపిస్తూ ఉన్నారు!
అదే మధ్యతరగతిలో ఎవడినైనా పెళ్లి తర్వాత పక్క చూపులు చూస్తున్నాడనే సంగతి ఇంట్లో వాళ్లకు తెలిసినా.. వాడి జీవితం దుర్భరంగా మారుతుంది. పెళ్లానికి తెలిసినా, ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా నిలదీస్తారు! ఇదేం పనిరా అని! మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మగాడికి కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ప్రతి దశలోనూ ఉంటాయి. కుర్రాడిగా ఉన్నప్పుడు ప్రేమించడానికి కూడా భయమే! చదువుకోకుండా ఇవేం పనుల్రా అని తల్లిదండ్రులే చితక్కొడతారు! సినిమాల్లో.. చూపించి చూపించి.. ఇలాంటి నియమాలు అమ్మాయిలకే అనుకుంటారు కానీ, ఇంటర్ లోనో, డిగ్రీలోనో ప్రేమలో పడ్డానంటూ మిడిల్ క్లాస్ కుటుంబంలో అబ్బాయి చెప్పగానే అతడికి ముందుగా జరిగేది బడితపూజే! ఈ విషయాన్ని ఎందుకో తెలుగు సినిమాల్లో అస్సలు చూపించరు! మిడిల్ క్లాస్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్.
ప్రేమ పెళ్లిళ్లు ఈ రోజుల్లో కొంత వరకూ ఆమోదిస్తూ ఉన్నారు కానీ, పదేళ్ల కిందట కూడా ఇంత సీన్ లేదు. ఇప్పుడు ఏం మరేం చేయలేక కొంత మేర ఒప్పుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే.. మధ్యతరగతిలో పెరిగిన అబ్బాయిలు, అమ్మాయిలు కూడా.. ఆ తల్లిదండ్రుల మనసెరిగే వ్యవహరిస్తారు! ఎవరో నూటికి ఒకరిద్దరిని మినహాయిస్తే.. వీరు ప్రతిదాన్నీ తమ తల్లిదండ్రుల మనసెరిగే వ్యవహరిస్తారు. చాలా మంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ.. నూటికి రెండు శాతాన్ని మినహాయిస్తే.. మిగిలిన 98 శాతం మంది మధ్యతరగతి పిల్లలూ.. పెళ్లి, ప్రేమ విషయాల్లో కుటుంబ అభిప్రాయాలనే పుణికి పుచ్చుకుంటారు!
ప్రేమించిన సొంత క్యాస్ట్ అబ్బాయినే ప్రేమించాలి, అమ్మాయిపై మనసు పారేసుకునే ముందు ఆమె కులం ఏమిటో తెలుసుకుని ముందుకు వెళ్లాలి.. గోత్రం కూడా కనుక్కొని ఆ తర్వాత ముందుకు వెళ్లాలనే ఆలోచనలు పదేళ్ల కిందటి వరకూ , ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా మిడిల్ క్లాస్ లో గట్టిగా ఉన్నాయి! పెళ్లికి ముందే కాదు, పెళ్లికి బాగా విలువను ఇచ్చేది కూడా మిడిల్ క్లాసే. లోగుట్టుగా ఏం చేస్తారు అనేది ఎలా ఉన్నా, పైకి మాత్రం వైవాహిక జీవితంలో అంతా బాగున్నట్టుగా చూపించుకోవడానికి నిరంతరం తాపత్రయపడేది కూడా మిడిల్ క్లాస్ జనాలే!
మిడిల్ క్లాస్ లో విడాకులే లేవా అంటే.. మరీ ఒకటీ అర శాతం ఉంటే ఉండొచ్చు వందకు! అయితే లోయర్ క్లాస్ జనాల్లా వీరు తమకు నచ్చినట్టుగా వ్యవహరించనూ లేరు, హై క్లాస్ జనాల్లా విడాకులు అనేసి ఎంచక్కా కొత్త లవ్ స్టోరీని వెంటనే మొదలుపెట్టేసి, దాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లి, ఆతర్వాత అది కూడా సెట్ కాలేదంటూ ఇంకో చూపు చూడగలగడం అనేది మధ్యతరగతి కలలో కూడా చేయగల పని కాదు! ఒకవేళ అలాంటి కలలే ఉన్నా.. అవి కలలు మాత్రమే! ఆచరణలో అంత సీన్ ఉండదు!
ఏతావాతా గత కొన్ని దశాబ్దాల్లో భారతీయ వైవాహిక వ్యవస్థ ఏదైతే ఉందో.. దానికి విలువను ఇస్తూ, దాని విలువను కాపాడానికి తమ జీవితాంతం కృషి చేస్తున్నది నిస్సందేహంగా ఇండియన్ మిడిల్ క్లాస్! వీరికి పెళ్లి అంటే పరమపవిత్రం అయినా, కాకపోయినా.. కుటుంబానికి, సమాజానికి భయపడో, సామాజిక విలువలను దృష్టిలో ఉంచుకునో.. చచ్చినట్టుగా సవ్యంగా కాపురం చేసుకోవడం భారతీయ మిడిల్ క్లాస్ లక్షణం. ఇండియాలో ఎలాగూ ఉన్నది ఎక్కువ శాతం మధ్యతరగతే కాబట్టి.. ఇంకా పెళ్లి, దాటి చుట్టూ ఉన్న కట్టుబాట్లకు ఒక విలువ కనిపిస్తూ ఉంది! ఇండియన్ మిడిల్ క్లాస్ ఆర్థిక శక్తి పెరిగిన కొద్దీ.. ఈ కట్టుబాట్లలో కూడా ముందు ముందు మార్పులు రావొచ్చు కూడా!
inthaki venkat reddy ye class? low/middle/high?
Chala high.. chatgpt says 1090 crores inr
Dirty class.
Super!:-)
inthakee untey manchida ,lekapotey manchida ani kuda cheppu.Appudu oka clarity vastundi janaalaki.
Trying to inject the message to people.. hose days gone GA
95% kapuralu pillala valle kulakunda untunnayi…
veellu (madhyatharagathi) anni saampradaaya prakaaram chesukuni peruku wife and husband naatakam aaduthaaru jeevitha kaalam. but ranku vayvahaaram veellu chesinantha evaroo cheyaru.
Kannu minnu kaanakunda chese panulu -> Low and High Class! Sarigga chusthe, dabbuki, aarogyaniki ibbandi lekunda unnappudu, Middle Class vallakunde emotions, hundatanam, sardukupoyetatvam, gouravam, premalu etc…Way better than anything in the world!