ఈమధ్య కాలంలో ఒకసారి నటించిన హీరోయిన్ తో ప్రభాస్, మళ్లీ ఇంకోసారి నటించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అనుష్క తర్వాత ఏ హీరోయిన్ కూ ఆ అదృష్టం దక్కలేదు. ఇప్పుడా స్థానాన్ని దీపిక పదుకోన్ దక్కించుకుంది.
ప్రభాస్ తో కలిసి మరోసారి నటించబోతోంది ఈ హీరోయిన్. కల్కి సినిమాలో ఈ ఇద్దరూ నటించారు. కాబట్టి ఆటోమేటిగ్గా కల్కి-2లో కూడా నటిస్తారు కదా. ఇందులో వింత ఏముందనుకుంటున్నారా?
ఇది కల్కి-2 మేటర్ కాదు, స్పిరిట్ మేటర్. అవును.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది దీపిక పదుకోన్. కల్కి, కల్కి-2, స్పిరిట్.. ఇలా ప్రభాస్ తో 3 సినిమాలు చేసిన ముద్దుగుమ్మగా రికార్డ్ సృష్టించబోతోంది.
ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త. యానిమల్ లో రష్మికను డిఫరెంట్ గా చూపించిన వంగ, ఈసారి దీపిక కోసం మరో అద్భుతమైన క్యారెక్టర్ రాశాడంటూ వరుసగా కథనాలు.
నిజానికి ఈ సినిమా ఆఫర్ అందరి కంటే ముందే దీపిక వద్దకు వెళ్లిందట. అప్పట్లో గర్భవతిగా ఉన్న దీపిక నో చెప్పిందంట. ఆ తర్వాత సినిమా అనుకోకుండా లేట్ అవ్వడంతో మరోసారి దీపికను సంప్రదించి ఆమె కాల్షీట్లు సంపాదించినట్టు బాలీవుడ్ నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి.
veedoka muduru gottamgadu