సూర్య కెరీర్ లో హిట్స్ ఉన్నాయి, భయంకరమైన ఫ్లాపులు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ అతడి కథల ఎంపిక మిస్-ఫైర్ అవ్వలేదు. బాక్సాఫీస్ రిజల్ట్ కు అతీతంగా అతడి కథల ఎంపిక, దానికి తగ్గ నటన ఉండేది. సినిమా చెత్తగా ఉన్నప్పటికీ సూర్య సెలక్షన్ ను ఎవ్వరూ ఎప్పుడూ తప్పుపట్టలేదు.
కానీ సూర్యాకు ఇప్పుడేమైంది? జై భీమ్ లాంటి సినిమా చేసిన నటుడేనా ఇతడు. ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలో ఒదిగిపోయిన నటుడేనా ఇతడు. సింగం లాంటి మాస్ మసాలా సినిమా చేసినా, 24 లాంటి ప్రయోగాత్మక చిత్రం చేసినా సూర్యను ఎవ్వరూ వంక పెట్టలేదు.
కానీ గడిచిన 2 సినిమాలుగా సూర్య కథల ఎంపికపై అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సూర్యానే కథలు వింటున్నాడా.. లేక ఎవరైనా విని ఓకే చెబితే నేరుగా సెట్స్ పైకి వెళ్తున్నాడా అనే డౌట్స్ ఎక్కువవుతున్నాయి.
కంగువా సినిమా ఫెయిలైనప్పుడు కూడా సూర్యపై ఇన్ని విమర్శలు రాలేదు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఏదో కష్టపడ్డాడులే అనుకున్నారు. కానీ తాజాగా వచ్చిన రెట్రో విషయంలో మాత్రం సూర్యను క్షమించలేకపోతున్నారు ఫ్యాన్స్.
మంచి కథలు పట్టుకోవడంలో, అలాంటి కథల్ని తెరపై రక్తికట్టించడంలో తనదైన ముద్ర వేసిన ఈ నటుడేనా రెట్రో కథకు ఓకే చెప్పాడు అనిపించింది. ఈ సినిమా వరకు కేవలం దర్శకుడ్ని తిట్టడమే కాదు, సూర్యను కూడా కలిపి విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. త్వరలోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా సెట్స్ పైకి వెళ్తున్నాడు. ఈ సినిమాలకు అతడు ఎలాంటి కథలు ఎంచుకున్నాడో.
అప్పట్లో ఈ విలక్షణ నటుడిని కదా….మన జఫ్ఫాలు అన్న ఫ్రెండ్ అని లేపింది…అన్న తో అటాచ్ అయ్యాక IAS అయినా IPS అయినా ఏమవుతుందో తెలుసుగా…. మాటాషే. భారతి సిమెంట్ Advertisment కి కూడా వాడినట్లు గుర్తు
trailer horrible. asalu reviewer cinema ela choosadu ra babu.
సావాసాలు, యాడ్స్ పాడుచేసినట్లు ఉన్నాయి
Movies lo content lekunte yentha pedhaaa hero aina flop vasthai, Example : nbk palanati brahmanaidu, paaisaa vasool, daaku maharaj movies
Neeli kj lk support anta