అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏదీ?

ఏపీ పాల‌కుడు అడ‌గ‌క‌పోతే, ప్ర‌ధాని త‌న‌కు తానుగా ఎందుకు ప్ర‌క‌టిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నుల‌కు ప్ర‌ధాని మోదీ వ‌స్తున్నార‌నే స‌మాచారంతో, భూములిచ్చిన రైతులు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. మోదీ వ‌చ్చారు, వెళ్లారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మోదీ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న కూట‌మి శ్రేణులు, అమ‌రావ‌తి రైతుల‌కు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు స‌ర్కార్ అమ‌రావ‌తికి సంబంధించి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ వ‌చ్చింది.

అమ‌రావ‌తిలో స‌భా వేదిక‌పై రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేలా పార్ల‌మెంట్‌లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిమాండ్ చేస్తార‌ని అంతా అనుకున్నారు. దీంతో రాజ‌ధాని అనేది భ‌విష్య‌త్‌లో స‌మ‌స్య కాకుండా కూట‌మి స‌ర్కార్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని జ‌నం న‌మ్మారు. కానీ మోదీ ఎదుట చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై ఏ ఒక్క‌రూ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మోదీ ప‌ర్య‌ట‌న‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త అనే అంశ‌మే తెర‌పైకి రాలేదు. కేవ‌లం అమ‌రావ‌తి రైతుల్ని, ఆ ప్రాంతంలోనే రాజ‌ధాని వుండాల‌ని ఆకాంక్షించే వాళ్ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికే త‌మ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. నిజంగా చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చిత్త‌శుద్ధి వుంటే, అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై ప్ర‌ధానితో హామీ ఇప్పించి, ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకునేలా చేసి వుంటే అభినంద‌న‌లు అందుకునేవాళ్లు.

కానీ ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌నిస్పృహ‌లు మిగిల్చిన‌ట్టైంది. అడ‌గంది అమ్మైనా అన్నం పెట్ట‌ద‌ని అంటార‌ని, అలాంటిది రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని ఏపీ పాల‌కుడు అడ‌గ‌క‌పోతే, ప్ర‌ధాని త‌న‌కు తానుగా ఎందుకు ప్ర‌క‌టిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

8 Replies to “అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏదీ?”

  1. దేశం లో ఎక్కడా కూడా. రాజధాని కి చట్టబద్ధత అనేది ఉండదు ఎక్కడ పుస్తకం లో రాయరు అది ఒక ఆనవాయితీ మాత్రమే .  ఎవరు దాన్ని మార్చే పని చెయ్యరు అలాంటి పని చేసింది జగన్ మాత్రమే.  అందుకే ఈ ఆర్టికల్ రాశారు .  జగన్ లాగా ఎవరు లని చెయ్యరు

  2. నిజమే GA….మన అన్నయ్య ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అని తెలిసినా కూడా వాళ్ళు జాగ్రత్త పడక పోవడం మాత్రం దారుణం ….🙏🙏

  3. Basics kuda teliyani writers…

    Enduku ilanti articles???

    Last govt filed case in high court and supreme court and failed to convince for 3 capitals..

    Nirmala anounced it in parliament that amaravathi is capital…of AP

    Central govt said amaravathi is capital in suprement court ..

    Why need all this bullshit???

    Nuvvu sampadinchukoni tintav kani…

    Nee next generations.????

  4. Amaravathi ki chataaa badhatha ledhu survey reports correct kadhu 80% prajalu vyathrekisthunaru caste politics ki bhayapadi evaruu matladam ledhu

Comments are closed.