వేసవిలో వాన చినుకు ‘హిట్ 3’

టాలీవుడ్ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్న వేళ వచ్చింది హిట్ 3. తొలి రోజు మంచి టాక్ తో, మంచి ఓపెనింగ్ నమోదు చేసింది.

టాలీవుడ్ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్న వేళ వచ్చింది హిట్ 3. తొలి రోజు మంచి టాక్ తో, మంచి ఓపెనింగ్ నమోదు చేసింది. టాలీవుడ్ సమస్యల పాలిట సంజీవిని లా కనిపించింది. తొలిరోజు, మలి రోజు ఊపు తో తొలి వీకెండ్ కే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోతుందని భావించారు సినిమా జనాలు. పైగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కదా. అయితే సినిమా హోల్డ్ అయింది కానీ అనుకున్నంత జోరు అయితే చూపించలేదు. అలా అని తక్కువ అని అనడానికి లేదు. థియేటర్లు గడ్డు పరిస్థితుల్లో వున్న రోజుల్లో తొలి నాలుగు రోజుల్లో దాదాపు 70 నుంచి 80 శాతం రికవరీ అంటే చిన్న విషయం కాదు. అలాగే నైజాం, వైజాగ్ ల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్లడమూ చెప్పుకోతగ్గ సంగతే.

హిట్ సినిమాను ఆంధ్ర 15 కోట్ల మేరకు, సీడెడ్ 5.40 కోట్ల మేరకు, నైజాం 12 కోట్ల మేరకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ మీద ఇచ్చారు. ఇప్పటికి చేసిన వసూళ్లు ఇలా వున్నాయి. ఈ వసూళ్లు హయ్యర్లు, జిఎస్టీతో కలిపి ఈ ఫలితాలు ఇప్పటికి వచ్చాయి. బ్రాకెట్ లో వున్నవి కొనుగోలు నెంబర్లు.

తొలివారంలో జిఎస్టీతో కలిసి దాదాపు అందరూ బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటారు. మలి వారం కూడా మరీ పెద్ద సినిమాల హడావుడి లేదు కనుక, ఇంతో అంతో షేర్ వసూలు చేస్తుంది కనుక ఖర్చులు కూడా కిట్టుబాటు అవుతాయి. కమిషన్ల సంగతి మాత్రం చూడాలి.

నైజాం.. 13 cr (12 cr)

ఉత్తరాంధ్ర… 3.70 (3.50)

ఈస్ట్…. 1.94 (2.40)

వెస్ట్ … 1.43 (1.80)

కృష్ణ .. 1.91 (2.10)

గుంటూరు..2.11 (2.40)

నెల్లూరు.. 88.5 (1.20)

సీడెడ్… 4.10 (5.40)

3 Replies to “వేసవిలో వాన చినుకు ‘హిట్ 3’”

Comments are closed.