క‌సిరెడ్డితో టీడీపీ ఎంపీకి అనుబంధం..!

మ‌ద్యం కేసును కేశినేని నాని లేఖ కొత్త మ‌లుపు తిప్పిన‌ట్టైంది. కేశినేని చిన్నిపై కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కే మాజీ ఎంపీ ప‌రిమితం కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని అవినీతి బాగోతాన్ని బ‌య‌ట పెడుతూనే వుంటాన‌నే మాట‌కు ఆయ‌న అన్న‌, మాజీ ఎంపీ కేశినేని క‌ట్టుబ‌డి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ ఎంపీ చిన్నిపై నాని రాజ‌కీయ బాంబు పేల్చారు. మ‌ద్యం స్కామ్‌లో ప్ర‌ధాన నిందితుడు రాజ్ క‌సిరెడ్డితో చిన్నికి అనుబంధం వుంద‌ని కేవ‌లం ఆరోపించ‌డ‌మే కాదు, అందుకు త‌గిన వివ‌రాల్ని కూడా ఆయ‌న పొందుప‌ర‌చ‌డం విశేషం. అంతేకాదు, చంద్ర‌బాబునాయుడికి లేఖ రాసి, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేయ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

ఇంత వ‌ర‌కూ మ‌ద్యం కేసులో వైసీపీ నేత‌ల పేర్లే ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. కొంద‌రు అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా కేశినేని చిన్నికి లింక్ వుంద‌న్న నాని ఆరోప‌ణ‌ల‌పై సిట్ ద‌ర్యాప్తు సంస్థ ఏం చేస్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేపింది. సీఎం బాబుకు నాని రాసిన లేఖ‌లో ఏముందో తెలుసుకుందాం.

“విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టయిన వ్యక్తులకు, ముఖ్యంగా కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాకు సంబంధించిన తీవ్రమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను.

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీలో భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీ ప్లాట్ నంబర్ 9, సర్వే నంబర్ 403, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – 500033 లో రిజిస్టర్ చేశారు. రాజ్, అతని అనుచరుడు దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే చిరునామాతో ఉండ‌డం గ‌మ‌నార్హం. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి, ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండూ ఒకే అధికారిక ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తాయి: accounts@eshanviinfraprojects.com – రెండు సంస్థల మధ్య గాఢ‌మైన అనుబంధాన్ని ఇది స్పష్టంగా సూచిస్తోంది.

ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో, సిట్టింగ్ ఎంపీతో ప్రత్యక్ష సంబంధం రాజకీయ రక్షణ, ఆర్థిక కుమ్మక్కుపై తీవ్ర ఆందోళనలను క‌లిగిస్తోంది. అంతేగాక, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అక్ర‌మ సంపాద‌న‌ను హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇత‌ర కంపెనీల్లో భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే కేశినేని చిన్నికి సంబంధించిన విదేశీ కంపెనీల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ, ఉన్న‌త‌స్థాయి ద‌ర్యాప్తు చేయించాలి” అని నాని డిమాండ్ చేశారు.

అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తుల‌తో చిన్ని సాన్నిహిత్యాన్ని అనుమానించ‌కుండా ఉండ‌లేమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. చిన్ని అక్ర‌మ వ్యాపారాలపై ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిలుపుకునేలా నిష్పాక్షిక విచార‌ణ చేప‌ట్టాల‌ని మాజీ ఎంపీ డిమాండ్ చేయ‌డం విశేషం.

మ‌ద్యం కేసును కేశినేని నాని లేఖ కొత్త మ‌లుపు తిప్పిన‌ట్టైంది. కేశినేని చిన్నిపై కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కే మాజీ ఎంపీ ప‌రిమితం కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చిన్ని కంపెనీలు, అవి ఏం చేస్తున్నాయో కూడా ఆయ‌న స‌మాజం ముందు ఉంచారు. ఇది ఏ మ‌లుపు తీసుకుంటుందో చూడాలి.

9 Replies to “క‌సిరెడ్డితో టీడీపీ ఎంపీకి అనుబంధం..!”

  1. కేసం( కేశిరెడ్డి) కేసం (కేశినేని) కొట్టుకుంటే బాగుపడేది low కేసమా?

  2. జగన్ నియమించిన కసిరెడ్డి తొ ఎవరికైనా సంబందం ఉంటె పాపమె అంటావ్!

    GA ద్రుష్టిలొ పాపం ఎ సంబందం లెనిది ఒక్క జగన్ కె!

  3. అయితే విజయవాడ MP స్థానానికి బై ఎలెక్షన్ వచ్చేసి, నాని వైసీపీ నుండి 5 లక్షల మెజారిటీ తో విజయ దుందుభి మోగిస్తాడు.:):)

  4. కసిరెడ్డి నేరస్థుడు అని రుజువు అయితే తెలుగు దేశానికీ మహా అయితే ఒక ఎంపీ నష్టం…. కానీ వైకాపా కి పార్టీ అధినాయకుడు ఇరుక్కుంటాడు, జైలుకి పోతాడు అరవింద్ కేజ్రీవాల్ గారిలా లిక్కర్ స్కాం లో…. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు….టీడీపీ ఎంపీకి అనుబంధం ఉందొ లేదో వెతుకుతున్నారు అంటేనే కసి రెడ్డి ఎదో కసిగా క్రైమ్ ఎదో చేసాడని నమ్ముతున్నట్లేగా…. కసి రెడ్డి 5 ఏళ్ళు కసి కసిగా జగన్ తో పూసుకుని తిరిగాడు….మరిచిపోతే ఎలా అండి…. లిక్కర్ స్కాం లో చిన్ని పేరు బయటకి రాలేదు…. చిన్నితో వ్యాపార సంబంధాలు ఉంటె ఉండొచ్చు గాక, ఆయన టీడీపీ లోకి వచ్చి 2024 ఎన్నికలకి ముందు….

    1. అబ్బా ఆసా దోస అప్పడం….స్కాం జరిగింది..కసిరెడ్డి, చిన్ని చేశారు…మా అన్న సుద్దపూస

  5. అందుకే నా లిక్కర్ స్కాం లో మా జగనన్న పాత్ర లేదు అంటున్న  మేదావులు విశ్లేషకులు 

Comments are closed.