అమెరికా-చైనా మధ్య నడుస్తున్న పన్నుల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఈ రెండు దేశాలు సుంకాలతో కొట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరుకు రవాణా కూడా దాదాపు నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది.
ఇన్నాళ్లూ వస్తు పన్నుల రూపంలో కొట్టుకున్న ఈ రెండు దేశాలు, ఇప్పుడు సేవా రంగంపై కూడా దృష్టిపెట్టాయి. ముందుగా చైనానే దీన్ని మొదలుపెట్టింది. అమెరికా నుంచి చైనాలోకి వచ్చే సినిమాల సంఖ్యను తగ్గించాలని చైనా నిర్ణయించింది.
ఆల్రెడీ చైనాలో రేషన్ పద్ధతి అమల్లో ఉంది. అమెరికా చిత్రాల విషయంలో ఈ రేషన్ పద్ధతిని మరింత కఠినతరం చేసింది. దీంతో అమెరికా చిత్రాలకు చైనాలో గడ్డు పరిస్థితి నెలకొంది. దీనికి ప్రతిగా ట్రంప్ కూడా కొరటా ఝులిపించారు.
అమెరికా వెలుపుల నిర్మించే చిత్రాలపై 100 శాతం పన్ను విధించబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ కొరడా దెబ్బ చైనాతో పాటు భారత్ కు కూడా గట్టిగానే తగలనుంది. అమెరికాలో ప్రదర్శించే భారతీయ సినిమాలకు వంద శాతం పన్ను కట్టే పరిస్థితి వస్తే ఇక బయ్యర్ కు, నిర్మాతకు మిగిలేదేం ఉండదు.
ఎప్పట్నుంచో ఓవర్సీస్ మార్కెట్ నే నమ్ముకుంది టాలీవుడ్. బడ్జెట్ ఎంత పెరిగినా ఓవర్సీస్ లో కవర్ అయిపోతుందని నమ్మకంగా ఉంది. కానీ ఇప్పుడీ పన్ను విధానంతో టాలీవుడ్ బడ్జెట్లు, రెవెన్యూ లెక్కలన్నీ మారబోతున్నాయి. వంద శాతం పన్ను కట్టగా ఇక ఏం మిగులుతుందనేది ప్రశ్నార్థకం.
మరోవైపు ఎప్పట్లానే ట్రంప్, ఈ నిర్ణయంతో కూడా తన చేతులు తానే కాల్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎందుకంటే, కరోనా దెబ్బ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు అమెరికా సినీ కంపెనీలు. తాజా సుంకాల వల్ల వార్నర్ బ్రదర్స్, పారామౌంట్, వాల్ట్ డిస్నీ లాంటి కంపెనీలు మరింత నష్టాలు చూసే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అమెరికాలో పెరిగిన ఖర్చులతో ఇవన్నీ తమ సినిమాల్ని ఎక్కువగా విదేశాల్లో నిర్మిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయ ప్రభావం, ఈ కంపెనీలపై కూడా పడుతుంది మరి.
అమెరికాలో చిత్ర పరిశ్రమ చావుకు అత్యంత సమీపంలో ఉందని వ్యాఖ్యానించిన ట్రంప్.. అమెరికన్ స్టుడియోలను అగ్రరాజ్యం నుంచి దూరం చేయడానికి ఇతర దేశాలు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, దీనివల్ల హాలీవుడ్ నాశనం అవుతోందని… పైగా ఇది జాతీయ భద్రతకే ముప్పు అని ప్రకటించారు. అమెరికాలోనే సినిమాల నిర్మాణం జరగాలని, అందుకే ఇతర దేశాల్లో నిర్మించే సినిమాలపై వంద శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించారు.
idhi kadha good news ante, Cinema chusevallu entha selective ga unte antha ollu daggara pettukoni thestharu
T for Trump
T for Tuglak
కలియుగ తుగ్లక్… ఈ ట్రంప్ భాయ్
Tax kattadam lo thapu ledhu movie producer, hero’s, directors crores remuneration thesukuntunaru