నిన్న వచ్చారు.. ఈ రోజుతో ముగిస్తారు

ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి పవన్ వచ్చారు. అయితే కీలకమైన బ్లాక్ షూటింగ్ 7 రోజుల నుంచి 2 రోజులకు కుదించారు.

“హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కీలకమైన బ్లాక్ షూటింగ్ ఒకటి పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఆ బ్లాక్ కు సంబంధించి ప్రీ-విజువలైజేషన్ వర్క్ నడుస్తోంది. వారం రోజులు వర్క్ చేస్తే ఆ సినిమా పూర్తవుతుంది.”

కొన్ని నెలల కిందట స్వయంగా పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అప్పట్నుంచి ఆ బ్లాక్ ఎప్పుడు పూర్తవుతుందా అని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అంటూ పవన్ షూటింగ్ ను దాటవేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి పవన్ వచ్చారు. అయితే కీలకమైన బ్లాక్ షూటింగ్ 7 రోజుల నుంచి 2 రోజులకు కుదించారు. ఇంకా చెప్పాలంటే, పవన్ నిన్న షూటింగ్ కు వచ్చారు, ఈరోజు ప్యాకప్ చెప్పబోతున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు.

ఈ సినిమా షూటింగ్ చాలా అంటే చాలా పెండింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే మరో 3 నెలలు షూట్ చేసినా పూర్తవుతుందనే గ్యారెంటీ లేదు. అందుకే సినిమాను 2 భాగాలుగా చేస్తున్నట్టు ప్రకటించి, అప్పటివరకు పూర్తయిన షూటింగ్ పార్ట్ తో మొదటి భాగాన్ని ముగించాలనుకున్నారు. అయినప్పటికీ పవన్ పూర్తిచేయాల్సిన భాగం ఇంకా మిగిలే ఉంది. అది ఈ రోజుతో పూర్తి కాబోతోంది.

ఈరోజు లేదా రేపు సినిమాకు సంబంధించి మరో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. పనిలోపనిగా ట్రయిలర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారు.

3 Replies to “నిన్న వచ్చారు.. ఈ రోజుతో ముగిస్తారు”

Comments are closed.