ఇరకాటంలో కింగ్ డమ్

హరి హర వస్తే… కింగ్ డమ్ కు బ్రేక్ పడిపోతుంది. అలా అని వెనక్కు వెళ్లడానికి కూడా అవకాశం లేదు.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా బోలెడు హోప్స్ పెట్టుకున్న సినిమా కింగ్ డమ్. ఈ సమ్మర్ సీజన్ కు మిగిలిన ఏకైక పెద్ద సినిమా. హిట్ 3 సినిమా థియేటర్లను ఓ నాలుగు రోజుల వరకు బలంగా ఆదుకుంది. ఆ తరువాత ఎక్కువ థియేటర్లను ఆ సినిమా ఆదుకోలేదు. మండే థియేటర్లు ఎలాగూ తగ్గిస్తారు.

రెండో వారం రెండు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు వున్నాయి. వీటిని ఎక్కువ స్క్రీన్ లలో విడుదల చేయలేరు. మళ్లీ కింగ్ డమ్ వచ్చే వరకు సరైన సినిమా లేదు.

కానీ పరిస్థితి చూస్తుంటే కింగ్ డమ్ వస్తుందా అనే అనుమానం కలుగుతోంది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మే 30 రావాలని ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కూడా తన బ్యాలన్స్ మూడు నాలుగు రోజుల వర్క్ చేసేస్తున్నారు. కచ్చితంగా మే 30న వస్తామని నిర్మాత ఎ ఎమ్ రత్నం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కింగ్ డమ్ తో నిర్మాణ బంధాలున్న దర్శకుడు త్రివిక్రమ్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

హరి హర వస్తే… కింగ్ డమ్ కు బ్రేక్ పడిపోతుంది. అలా అని వెనక్కు వెళ్లడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ తరువాత వారం కమల్ హాసన్ థగ్ లైఫ్ వుంది. ఇప్పటికి చాలా సార్లు జరిగినట్లు మరోసారి హరి హర వీరమల్లు వెనక్కు వెళ్తే సమస్య లేదు. లేదంటే కింగ్ డమ్ కు చాలా పెద్ద సమస్య ఎదురవుతుంది. జూన్ రెండో వారం లేదా మొదటి వారం ఎంచుకోక తప్పదు.

3 Replies to “ఇరకాటంలో కింగ్ డమ్”

  1. పావలా “VFX” 

    వచ్చే గిల్లుడు సినిమాకి కింగ్డమ్ కి పోలిక ?

    1. నీలాంటి లోఫర్ నా కొడుకులకు ఏం తెలుస్తుంది లేరా ఆయన విలువ

Comments are closed.