చైతూ పెళ్లయింది.. ఇప్పుడు సమంత వంతు

ఇప్పుడీ బంధాన్ని వాళ్లు నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

నాగచైతన్య-సమంత విడాకులు తీసుకొని చాన్నాళ్లయింది. విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే నాగచైతన్య, శోభితకు కనెక్ట్ అయ్యాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు సమంత వంతు.

సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం నడుస్తోంది. దీనికి కారణం ఆమె మరోసారి ఆలయాల సందర్శన చేపట్టడమే. మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తికి వెళ్లడం ఆమె పెళ్లిపై పుకార్లకు కారణమైంది.

దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉందంటూ కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని ఓ క్రీడా కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అలా తమ మధ్య బంధాన్ని వాళ్లు పరోక్షంగా వెల్లడించినట్టయింది.

ఇప్పుడీ బంధాన్ని వాళ్లు నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైందంటున్నారు చాలామంది.

సమంత టీమ్ మాత్రం ఆమె తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీసిందని, రిలీజ్ కు రెడీ అయిన ఆ సినిమా సక్సెస్ అవ్వాలంటూ ఆమె ఆలయాలు సందర్శిస్తోందని చెబుతున్నారు.

సమంత ఫ్యాన్స్ మాత్రం, ఆమె మరోసారి ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైతే చూడాలని కోరుకుంటున్నారు. నాగచైతన్య మరో పెళ్లి చేసుకున్నప్పుడు, సమంత కూడా చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

8 Replies to “చైతూ పెళ్లయింది.. ఇప్పుడు సమంత వంతు”

  1. aame pelli chesukunte evaru vaddu anukuntaaru.. kaakapothe aa raj nidumoru already married (mari divorce theesukunnaado ledho mari) 

Comments are closed.