ఇప్పుడు కాదు, దాదాపు రెండేళ్లుగా రీ-రిలీజ్ కల్చర్ నడుస్తోంది. మొన్నటివరకు హిట్ సినిమాల్ని మాత్రమే మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఫ్లాప్ అయిన స్టార్ హీరోల సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. అసలిదంతా ఎందుకు జరుగుతోంది?
కరోనా టైమ్ లో సినిమాల్లేక రీ-రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ట్రెండ్ ను అలానే కొనసాగించారు. టాలీవుడ్ పెద్దలు కూడా ఈ కల్చర్ ను ఎగదోయడానికి ప్రధాన కారణం థియేటర్లలో ఆక్యుపెన్సీ.
కనీసం స్టార్ హీరోల రీ-రిలీజులకైనా ఆడియన్స్ వస్తే, మరోసారి ప్రేక్షకులకు పాత రోజులు గుర్తుకొస్తాయని, ఆడియన్స్ క్రమంగా థియేటర్లకు అలవాటు పడతారని భావించారు. అలా తమ సినిమాలకు ఆక్యుపెన్సీ పెరుగుతుందని ఆశపడ్డారు.
కానీ టాలీవుడ్ పెద్దలు ఒకటి తలస్తే, ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. రీ-రిలీజ్ ట్రెండ్ అనేది కేవలం హీరో అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది. సాధారణ ప్రేక్షకులు థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు.
ఫలితంగా రెగ్యులర్ మూవీస్ కు ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. మంచి సినిమా రిలీజైతే వీకెండ్ లో ఓ మోస్తరుగా జనం కనిపిస్తున్నారు. అలా రిలీజైన సినిమా ఫ్లాప్ అయితే సోమవారం నుంచి మళ్లీ ఖాళీ. బజ్ లేని సినిమా వచ్చిందంటే, వీకెండ్స్ కూడా థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
ఏతావతా టాలీవుడ్ థియేట్రికల్ సిస్టమ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలతో పాటు, ఛోటామోటా నటుల సినిమాలు కూడా అంతోఇంతో ఆడేవి. మళ్లీ ఆ రోజులు రావాలి. సినిమా ఏదైనా ప్రేక్షకులు సరదాగా థియేటర్లకు వచ్చే పరిస్థితులుండాలి. అది జరగాలంటే మంచి కంటెంట్ పడాలి, పనిలోపనిగా టికెట్ రేట్లు తగ్గాలి.
Re release ki kuda public theaters ki raavadam ledha








Aithe fake collections rasukondi meeku alavateee kadha
Heavy ticket rates