ఈ వీకెండ్ బిక్కుబిక్కుమంటూ గడిపారు గూగుల్ ఉద్యోగులు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు గూగుల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ రాత్రి నిద్రపట్టకపోవచ్చు. ఎందుకంటే, రేపు ఎవరికి పింక్ స్లింప్ అందుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
అవును.. గూగుల్ మరో రౌండ్ లే-ఆఫ్స్ కు సిద్ధమౌతోంది. ఈసారి బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ ను టార్గెట్ చేసింది. ఈ రెండు లొకేషన్లలో ఉన్న అడ్వర్ టైజింగ్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోత ఎక్కువగా ఉండొచ్చంటూ అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా నిర్థారించనప్పటికీ, రేపు చాలామందికి మెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, గతంలో కూడా ఇలానే జరిగింది. ముందుగా లీకులొచ్చాయి, ఆ తర్వాత చాలామంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులు అందాయి.
వ్యాపార ప్రాధాన్యాలు మార్చుకునే క్రమంలో కొన్ని విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య కుదించడం, మరికొన్ని విభాగాల్లో ఉద్యోగాల సంఖ్య పెంచడం లాంటివి చేస్తుంటామని గూగుల్ ఇదివరకే ప్రకటించింది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్ లాంటి విభాగాల్లో వందల మంది ఉద్యోగుల్ని తొలిగించింది.
అయితే అప్పుడు ఆ ప్రభావం భారత్ పై తక్కువ. ఈసారి మాత్రం గూగుల్ తీసుకునే నిర్ణయాలు నేరుగా బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసులపై పడబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈసారి తక్కువ మంది ఉద్యోగుల్ని తొలిగించి, టెక్నికల్ ఇంజినీర్స్ పొజిషన్ లో ఉన్న కొంతమంది ఉద్యోగుల్ని, ఆదాయం వచ్చే ప్రాజెక్టుల్లోకి మార్చబోతోంది గూగుల్.
Layoffs are happening everywhere!
వైసీపీ నాయకులూ కూడా బిక్కు , బిక్కు మని బ్రతుకుతున్నారంట కదా? ఎప్పుడు ఏ నాయకుడు ఏ స్కాములో లోపలి పోవాల్సి వస్తుందో అని. దొరికిన వాడిని తురుముతున్నారు(జైలు), దొరకనివాడిని తరుముతున్నారు (పరార్).