కొన్ని రోజుల కిందటి సంగతి.. హీరో జయం రవి తన భార్య నుంచి విడిపోయాడు. ఓపెన్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. అదే టైమ్ లో అతడి విడాకులపై పుకార్లు కూడా వచ్చాయి. సింగర్ కెనీషాతో అతడు ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం నడిచింది.
అయితే ఆ పుకార్లను జయం రవి అలియాస్ రవి మోహన్ ఓపెన్ గా ఖండించాడు. కెనీషా చాలా కష్టపడి పైకొచ్చిందని, ఎన్నో ప్రదర్శనలిచ్చిందని, గాయనికానే కాకుండా, సైకాలజిస్ట్ గా సేవలందించాలనుకుంటోందని, తనతో కలిసి హాస్పిటల్ స్థాపిస్తానని.. అంతకుమించి తామిద్దరి మధ్య ఏం లేదని స్పష్టం చేశాడు.
కట్ చేస్తే, తాజాగా కెనీషాతో కలిసి ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు రవి మోహన్. విడాకులిచ్చిన 7-8 నెలలకే ఇలా కెనీషాతో కలిసి పబ్లిక్ లోకి వచ్చాడు. దీంతో వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు నిజమయ్యాయి.
మరోవైపు జయం రవి తన భార్య నుంచి ఎందుకు విడిపోయాడనే అంశంపై ఇప్పటికీ కోలీవుడ్ లో చర్చ నడుస్తూనే ఉంది. జయం రవి అత్త సుజాత విజయ్ కుమార్, ఈ హీరోను పూర్తిగా కంట్రోల్ లో పెట్టిందంట. కథలు వినడం, కాంబినేషన్లు సెట్ చేయడం, రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయడం లాంటివన్నీ ఈమెనే చేస్తోందట. చివరకు భార్య కూడా తన మాట వినకపోవడంతో, విసుగెత్తిపోయిన రవి, విడాకులిచ్చాడనే ప్రచారం నడుస్తోంది.
జయం రవి, ఆర్తికి ఇంకా అధికారికంగా విడాకులు మంజూరవ్వలేదు. అంతలోనే రవి ఇలా కెనీషాతో కలిసి బయటకొచ్చాడు.
Naresh daggara advise theesukoni untadu.
ఔను వాళిద్దరూ ఇష్టపడ్డారు ..