దేశం అంతా యుద్దం మూడ్ అలుముకుంది. యుద్దం రావచ్చు.. రాకపోవచ్చు. కానీ జనాల దృష్టి అటు వెళ్లిపోయింది. యుద్దం వార్తలను ఆసక్తిగా చదువుతున్నారు. షేర్ చేసుకుంటున్నారు. అసలే నెల రోజులుగా క్రికెట్ ప్రభావం సినిమాల మీద పడింది. ఇప్పుడు యుద్ద ప్రభావం కనిపిస్తోంది. దీనికి తోడు జనాల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు అంటే కాస్త విముఖత వచ్చేసింది. మరీ బాగుంది అంటే తప్ప జనం థియేటర్ కు రావడం లేదు. ఇలాంటి పరిస్థితి, క్రికెట్, యుద్దం లాంటివి తోడైతే ఇంక చెప్పేది ఏముంటుంది.
ఈసారి సమ్మర్ చాలా వృధా అయిపోయింది. ఏ సరైన సినిమా కూడా ఇప్పటి వరకు పడలేదు. సమ్మర్ ను పూర్తిగా క్యాష్ చేసుకోలేదు. ఇలాంటి టైమ్ లో నాని హిట్ 3 సినిమా వచ్చింది. సమ్మర్ ను ఊపేస్తుంది అనుకున్నారు. ఓపెనింగ్ అయితే అలాగే కనిపించింది. కానీ నాలుగు రోజుల తరువాత జారిపోయింది. హిట్ 3 కి మళ్లీ భారీ సినిమా రావడానికి మధ్య నాలుగు వారాల గ్యాప్ వుండిపోయింది. ఈ గ్యాప్ లో రెండు మూడు సినిమాలు వున్నాయి కానీ వేసవి ని క్యాష్ చేసుకునేంత కాదు.
ఇలాంటి టైమ్ లో నెలాఖరులో రెండు పెద్ద సినిమాలు వస్తాయని వినిపించింది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్, పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలు రెండూ కానీ ఏదో ఒకటి కానీ వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు జనాల్లో అలుముకున్న యుద్దం మూడ్ చూసి, రెండు సినిమాలు వెనక్కు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా వర్క్ టైట్ గా వుంది. ఇంకా రీ రికార్డింగ్ కాలేదు. ఇరవై రోజులే టైమ్ వుంది. చాలా హడావుడి పడాలి అందుకే ఎలాగూ అవకాశం వచ్చింది కనుక వెనక్కు వెళ్లే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
అలాగే హరి హర వీరమల్లు సినిమా కూడా జూన్ లోకి వెళ్లే అవకాశం వున్నట్లు కనిపిస్తోంది. దేశం ఈ పరిస్థితుల్లో వుండగా, తన సినిమా విడుదల అంటే పవన్ కళ్యాణ్ కు అంతగా నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే వాయిదా వేసే అవకాశం వుందని టాక్.
ఇలాంటి నేపథ్యంలో ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తున్న బెల్లంకొండ భైరవం సినిమాను 30న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ కు మిగిలిన సినిమా అదొక్కటే.
జూలై నెలలో కమల్ థగ్ లైప్ వస్తుంది. వేరే సినిమాలు రావచ్చు. కానీ అప్పటికి స్కూళ్లు అవీ స్టార్ట్ అయిపోతాయి. సినిమా మూడ్ కూడా పోతుంది.