రీసెంట్ గా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయారు దర్శకుడు కృష్ణవంశీ. రెండేళ్ల కిందట బ్రహ్మానందంను పెట్టి చేసిన రీమేక్ సినిమా కూడా థియేటర్లలో ఫ్లాప్ అయింది. అప్పట్నుంచి ఖాళీగానే ఉంటున్న కృష్ణవంశీ ఇప్పుడు ఓటీటీపై దృష్టిపెట్టారు.
తను ఓటీటీలోకి రావాలనుకుంటున్నానని, ప్రస్తుతం ఓటీటీ కోసం ఓ కథ రాస్తున్నానని ఆయన ప్రకటించారు. అయితే అంతకంటే ముందు ఓ సినిమా చేయబోతున్నారాయన.
తను తీయబోయే సినిమాకు సంబంధించి ఆల్రెడీ కథ పూర్తిచేశారు కృష్ణవంశీ. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఆ సినిమా వస్తుందని, కుదిరితే ఈ నెలలోనే ప్రకటన ఉంటుందని కూడా చెప్పేశారు.
న్యూ ఏజ్ అన్నారు కాబట్టి కచ్చితంగా అందులో యంగ్ హీరోహీరోయిన్లు ఉంటారు. కథ ఏదైనా, జానర్ ఏదైనా అందులో ఈయన మార్క్ ఉంటుంది కాబట్టి.. ఈ న్యూ ఏజ్ డ్రామా ఎలా ఉంటుందో చూడాలి. అయితే అంతకంటే ముందు, ఓటీటీలోకి వస్తే కృష్ణవంశీ ఎలాంటి కంటెంట్ తో వస్తారనే ఆసక్తి చాలామందిలో ఉంది.
ha ha hhaa ha