పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!

ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది భారత్‌కు నీటి విషయంలో పూర్తి నియంత్రణను కలిగిస్తూ, వ్యూహాత్మకంగా పాక్‌కి ఒక గట్టి సందేశం పంపినట్లవుతుంది.

భారత్‌తో యుద్ధం కారణంగా పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింంది. స్వదేశంలోనే ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ఛీత్కారం ఎదురవుతోంది. పార్లమెంటులో మాట్లాడిన ఇద్దరు ఎంపీల్లో ఒకాయన పాక్‌ను అల్లాయే కాపాడాలని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. మరో ఎంపీ ప్రధానిని, ఆర్మీ చీఫ్ను పిరికిపందలని, పారిపోయి బంకర్లలలో దాక్కున్నారని తిట్టాడు. పాక్ ప్రధాని భారత ప్రధాని మోదీ పేరెత్తేందుకు కూడా భయపడుతున్నాడని దుర్భాషలాడాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా పాకిస్తాన్‌కు షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు సింధు నదీ జలాలను ఆపేసిన సంగతి తెలిసిందే కదా. రెండు దేశాల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. యుద్ధానికి ముందు పాక్ పట్ల భారత్ తీసుకున్న మొదటి కఠినమైన చర్య ఇదే. ఆ తరువాత వరుస నిర్ణయాలతో పాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ తీవ్రంగా ఆగ్రహించింది. సింధు జలాలను ఆపితే రక్తం పారుతుందని పాక్‌లోని ఒక నాయకుడు తీవ్రంగా హెచ్చరించాడు కూడా.

అయినా భారత్ చలించలేదు. ఈ ఒప్పందం రద్దు చెల్లుబాటు కాదని, అంతర్జాతీయంగా న్యాయపోరాటం చేస్తామని, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామంటూ పాకిస్థాన్ పాలకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా దీనిపై స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో తమ సంస్థ జోక్యం ఉండదని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం రద్దుపై తాము జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఈ వివాదంలో ప్రపంచ బ్యాంకు కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే పరిమితమై ఉంటుందన్నారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో అజయ్ బంగా భారత్‌ పర్యటనలో ఉన్నారు. ఇండస్ జల ఒప్పందం రద్దు చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ ఒప్పందం భారత్–పాకిస్తాన్ మధ్య ఉన్న జలవనరుల పంపకాలపై ఎంతో కాలంగా కొనసాగుతోంది. ఇండస్ జల ఒప్పందం 1960లో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది. ఇది అంతర్జాతీయ ఒప్పందం. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేసిన ప్రపంచ బ్యాంకు సహాయంతో కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం, సింధు నదీ వ్యవస్థలోని మొత్తం 6 నదుల మధ్య జలాల వినియోగాన్ని పంచుకోవడంపై స్పష్టమైన నియమాలు నిర్దేశించారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు — బియాస్, రవి, సట్లెజ్ భారత్‌కు కేటాయించారు. ప‌డమర నదులు — ఇండస్ (సింధు), జీలం, చీనాబ్ పాకిస్తాన్‌కు కేటాయించారు. భారతదేశం పాకిస్తాన్‌కు కేటాయించిన నదులను పరిమితంగానే వినియోగించుకోవాలి. ఉదాహరణకు సాగు నీటిని నిల్వ చేయడం, చిన్న స్థాయి విద్యుత్ ఉత్పత్తి మొదలైనవి. భారతదేశం పాక్‌తో సంబంధాలు ప్రతికూలంగా ఉన్న సమయంలోనూ, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగిన సమయంలోనూ ఇండియా ఈ ఒప్పందాన్ని గౌరవించింది.

అయితే, ఇటీవల పాకిస్తాన్ తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున, భారత్‌కు వ్యతిరేకంగా రాజకీయంగా వ్యవహరిస్తున్నందున ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని భారత ప్రభుత్వం భావించింది. దీంతో మోదీ సర్కార్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇది చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇది ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఉన్న ఒప్పందం. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది భారత్‌కు నీటి విషయంలో పూర్తి నియంత్రణను కలిగిస్తూ, వ్యూహాత్మకంగా పాక్‌కి ఒక గట్టి సందేశం పంపినట్లవుతుంది. అయితే దీని ప్రభావాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం.

9 Replies to “పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!”

  1. Water flows in rivers and it is not possible to stop those waters from flowing. Though build ton of dams, water flows. It is not possible to stop water flow to Pakistan or any country in the basin.

    1. If it’s not possible to stop water, why galeez tur@kh@ pakis are crying? Anyway tur@kh@s won’t take bath.But atleast tur@khas need water to drink.

    2. Here the issue is not how the water flows. We can stop the flow and divert, even though that is expensive. If pakis are not sensitive on human life, why the heck we care.

  2. భారత ప్రయోజనాల తరవాతే ఏదయినా….అసలు ఐ.ఎస్.ఐ ప్రధాన నాయకుల్ని భారత్ కి అప్పగించామని అడగాలి.. ఇక ముందు పి.ఓ.కే కాదు…పాక్ ని తన్ని తరిమెసి ఆ ప్రాంతాన్ని కాశ్మీర్ లో కి తీసుకు రావాలి… అలా చేస్తేనే పహాల్గం బాధిత ఆడపడచులకు ఇచ్చే నిజమైన ఊరట…..

Comments are closed.