యుద్ధాన్ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు

“యుద్ధానికి మీ వంతు సహకారం అందించండి, దేశభక్తిని చాటుకోండి” అంటూ ఎమోషన్లను రెచ్చగొట్టి లింకులు ఓపెన్ చేయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఆన్ లైన్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ట్రెండింగ్ లో ఏది ఉంటే దాన్ని ఆసరగా చేసుకొని ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడడం అలవాటు అయిపోయింది కేటుగాళ్లకి. ఇండియా-పాకిస్థాన్ యుద్ధాన్ని, ఆ ఎమోషన్ ను కూడా తమ మోసాలకు వాడేస్తున్నారు.

సరిహద్దుల్లో ఆర్మీ శత్రువులతో వీరోచితంగా పోరాడుతుంటే, దేశం లోపల మాత్రం సైబర్ మోసగాళ్లు, ఆర్మీ పేరిట మోసాలకు తెరదీశారు. ఆర్మీ ఆఫీసర్లమంటూ మెసేజీలు పంపిస్తూ దొరికినకాడికి దోచుకుంటున్నారు.

“యుద్ధానికి మీ వంతు సహకారం అందించండి, దేశభక్తిని చాటుకోండి” అంటూ ఎమోషన్లను రెచ్చగొట్టి లింకులు ఓపెన్ చేయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఒక్కసారి లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు.

నిజంగా భారత దళాలకు సాయం చేయాలనుకుంటే, దానికి కొన్ని ఆధీకృత వెబ్ సైట్స్ ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా వాటికి డబ్బులు పంపించొచ్చు. ముందుగా ఒరిజినల్ సైట్స్ పై అవగాహన పెంచుకుంటే, ఇలాంటి నకిలీ మెసేజీలు, సైబర్ మోసాల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆన్ లైన్లోనే కాదు, సైనికుల కోసం చందాలంటూ ప్రత్యక్షంగా ఎవరైనా వచ్చినా డబ్బులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు.

4 Replies to “యుద్ధాన్ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు”

  1. అరేయ్ గొర్రె ఆంధ్రా ప్రజల అమాయకత్వాన్ని వాళ్ల అవసరాలను అడ్డుపెట్టుకొని అలివిగాని మోసపు హమీలిచ్చి అధికారం దోచుకొనే రాజకీయ నేరగాళ్ల ముందు వాళ్లెంత

    1. వాడి పేరు.. బొల్లి గాడు.. అని నిర్భయంగా నువ్వు చెప్ప వె? ఇక వాడేం చెప్తాడు?

Comments are closed.