హీరో విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజైంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుంచి ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూడ్డానికి చాలా ఆసక్తికరంగా ఉంది.
కండలు తిరిగిన దేహంతో, భారీ జుట్టుతో ధ్యానంలో ఉన్న పోజులో విజయ్ ను వెనక నుంచి చూపించారు. అతడి వీపుపై కత్తి గాయాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఇది రాబోతోంది.
19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్న టైమ్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. డిఫరెంట్ స్టోరీలైన్స్ సెలక్ట్ చేసుకునే దర్శకుడు రాహుల్, ఈసారి కూడా అదే పంథాలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం చాలామంది కొత్తవాళ్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక హీరోయిన్ గా రష్మికను తీసుకోబోతున్నారు. రీసెంట్ గా ఇదే విషయాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించింది కూడా.
ప్రస్తుతం కింగ్డమ్ సినిమా పనుల్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే రాహుల్ సంకృత్యాన్ సినిమా విశేషాలు బయటకొస్తాయి.
orey GA lanja kodaka….dammu vunte…comments ni block cheyyatam maaneyye…..verri munda kodaka…
A.I. tho chesaru
Nice pic