తమ్మినేని రీసౌండ్!

బీసీ మహిళకు యాదవ సామాజిక వర్గానికి కూటమి అన్యాయం చేసింది అని జీవీఎంసీలో జరిగిన అవిశ్వాసం ప్రక్రియ మీద ఫైర్ అయ్యారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రీ సౌండ్ చేస్తున్నారు. వైసీపీ రాజకీయ వేదిక నుంచి టీడీపీ కూటమికి సవాల్ చేస్తున్నారు. దాంతో ఎన్నాళ్ళకు పెద్దాయన ఈ విధంగా తన మాటలకు పదును పెడుతున్నారని ఆయన అభిమానులతో పాటు వైసీపీ నేతలు కూడా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.

తమ్మినేని గత కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఆయనకు పార్టీ మీద అసంతృప్తి ఉందని ప్రచారం సాగింది. ఆయన ఆముదాలవలస సీటులో వేరే వారిని ఇన్చార్జిగా నియమించారు అన్న బాధతో ఆయన దూరం పాటించారు అని అనుకున్నారు. తమ్మినేని కూడా మీడియా ముందుకు పెద్దగా రాలేదు. దాంతో ఆయన మీద రకరకాలైన పుకార్లు వ్యాపించాయి. జనసేనలోకి వెళ్తున్నారని కూడా అంతా అనుకున్నారు.

అయితే ఇటీవల ఆయన పేరుని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ జాబితాలో చేర్చారు. సీనియర్ గా ఆయనకు ఈ గౌరవం ఇచ్చారు. దాంతో పాటు తమ్మినేని అసంతృప్తిని గమనించి తగిన భరోసా ఇచ్చారని అంటున్నారు. దాంతో పెద్దాయన రెట్టించిన ఉత్సాహంతో మీడియా ముందుకు వచ్చారు.

బీసీ మహిళకు యాదవ సామాజిక వర్గానికి కూటమి అన్యాయం చేసింది అని జీవీఎంసీలో జరిగిన అవిశ్వాసం ప్రక్రియ మీద ఫైర్ అయ్యారు. దమ్ముంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికే మేయర్ పదవిని కట్టబెట్టాలని కూడమికి చాలెంజ్ చేశారు. బీసీలకు సమ న్యాయం చేసింది వైసీపీయే అని ఆయన అన్నారు.

ఈ విధంగా తమ్మినేని మళ్ళీ సీన్ లోకి వచ్చేశారు. ఆయన రాకతో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రధాన సామాజిక వర్గం పార్టీ వెంట ఉంటుందని మళ్ళీ అక్కడ ఫ్యాన్ స్పీడ్ అందుకుంటుందని భావిస్తున్నారు. రానున్న రోజులలో మరింత మంది సీనియర్లు వైసీపీ తరఫున గొంతు విప్పుతారు అని అంటున్నారు. వైసీపీ ఈసారి సీనియర్ల సలహా సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలని నిర్ణయించిన క్రమంలో తమ్మినేని లాంటి వారి మీద పెద్ద బాధ్యతలే ఉన్నాయని అంటున్నారు.

15 Replies to “తమ్మినేని రీసౌండ్!”

  1. ఏమిటి….2004 నుండి ఒక్క 2019 తప్ప గెలవని వాడు వచ్చి మాట్లాడితే ఒక సామాజికవర్గం ర్యాలీ అవుతుందా? నిన్ను ఆపేది ఎవడు , నీ ఇష్టం కొయ్యి…కోతలు కోయ్యి 

  2. బయటపడ్డ వైసీపీ తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ — మరి ఆ మాత్రం అరవడా?

    1. తమ్మినేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు. కానీ ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. 

      ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తమ్మినేని సీతారాం ఎలా అడ్మిషన్ తీసుకున్నారని ఆయన విద్యార్హతలు ఏమిటని తెలుసుకున్నారు. తమ్మినేని నకిలీ డిగ్రీ పెట్టారని తేలింది. తమ్మినేని నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ చేశానని సర్టిఫికెట్ పెట్టారు. 

  3. “బీసీలకు సమ న్యాయం చేసింది వైసీపీయే”…sure, thats why Jagan didnot open mouth when boy was burnt alive…

    disgusting characters

  4. పెద్దాయన అంటే వయసులోనా, గుణంలోనా లేక పార్టీ లోనా? నాకు తెలిసి ఈయన దేనిలోనూ పెద్దాయన కాదు. అటు మీ పార్టీకి ఇటు ఈయనకు వేరే దిక్కు లేకపోవటం వలన ఒకరిది ఒకరు నాక్కుంటున్నారు అంతే.

  5. వయసున్న మాత్రాన పెద్దాయనైపోరు . కొంచెం బుర్ర పెట్టి ఆర్టికల్స్ వ్రాయి GA

  6. ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అని ఒక సామెత ఉంది. అటు ఆయనకు ఇటు మీకు దిక్కు దివానం  లేదు కాబట్టే ఆయన మిమ్మల్ని నాకుతున్నారు మీరు ఆయన్ని నాకుతున్నారు . ఇక పెద్దాయన అంటున్నారు కదా ఆయన ఏ విషయంలో పెద్దవాడు కాదు వయసు రిత్యా కానివ్వండి  అనుభవ రీత్యా కానివ్వండి నడవడిక రిత్యా కానివ్వండి ఆయన పెద్దమనిషి మాత్రం కాదు. ఆయన ఒక చిల్లర మనిషి కన్నా అధ్వాన్నమైన వాడు  అటువంటి ఆయన్ని పట్టుకుని నాకుతున్న వేము రా గ్యాస్ ఆంధ్ర.

Comments are closed.