వేసవి శెలవులు తీసుకుంటున్న స్టార్ హీరోలు

సమ్మర్ వచ్చిందంటే ఆ వేడిలో షూటింగ్స్ చేయడం కంటే, కాస్త రిలాక్స్ అవ్వడానికే ఆసక్తి చూపిస్తారు మన హీరోలు.

సమ్మర్ వచ్చిందంటే ఆ వేడిలో షూటింగ్స్ చేయడం కంటే, కాస్త రిలాక్స్ అవ్వడానికే ఆసక్తి చూపిస్తారు మన హీరోలు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు అయితే వేసవిలో విదేశీ పర్యటనలకే ఎక్కువ మొగ్గు చూపుతాడు.

ఈసారి అతడికి రాజమౌళి అంత అవకాశం ఇవ్వకపోవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ మహేష్ కు గ్యాప్ దొరికింది. భారీ ఎండల కారణంగా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు రాజమౌళి. దీంతో మహేష్ బాబు మరోసారి విదేశాలకు వెళ్లే ప్లానింగ్ లో ఉన్నాడు.

ఇటు రామ్ చరణ్ కూడా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు. ఎండలు పెరగడం, పైగా ఔట్-డోర్ షూటింగ్ కావడంతో కొన్నాళ్లు విరామం ప్రకటించాడు. బన్నీ ఎప్పట్నుంచో రెస్ట్ మోడ్ లోనే ఉన్నాడు. అట్లీతో సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వేసవి తర్వాతే సెట్స్ పైకి వస్తాడు.

ఇక ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. చేతిలో ఉన్న అన్ని సినిమాల్ని పక్కనపెట్టి ఇటలీ వెళ్లిపోయాడు. ఇక్కడ వాతావరణం కాస్త చల్లబడిన తర్వాతే తిరిగి సినిమాలు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు.

ఇలా పెద్ద హీరోలంతా సమ్మర్ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ మాత్రమే ఎండల్లో కష్టపడుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బాగా ఆలస్యమవ్వడంతో, తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆ సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నాడు.

One Reply to “వేసవి శెలవులు తీసుకుంటున్న స్టార్ హీరోలు”

Comments are closed.