జ‌గ‌న్ స‌న్నిహితులు ఔటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా

ఒకే కేసుకు సంబంధించిన పిటిష‌న్లు కావ‌డంతో మిథున్‌రెడ్డి బెయిల్‌తో పాటు వాళ్లిద్ద‌రివి కూడా ఒకేసారి విచారిస్తామ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత‌ల్ని లిక్క‌ర్ కేసు వెంటాడుతోంది. ఇప్ప‌టికే కేసులో ప‌లువురు అరెస్ట్ కావ‌డం, సిట్ విచార‌ణ‌లో వైఎస్ జ‌గ‌న్‌తో స‌హా ఆయ‌న‌కు నీడ‌లా ఉండే అధికారులు, అలాగే స‌మీప బంధువు పేర్ల‌ను చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు న్యాయ‌స్థానానికి సిట్ టీమ్ రిమాండ్ రిపోర్ట్‌ను కూడా స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో లిక్క‌ర్ కేసులో న్యాయ స్థానాల్లో అడ్డంకులు ఎదురుకాక‌పోతే, మున్ముందు మ‌రికొంద‌రు కీల‌క వ్య‌క్తులు అరెస్ట్ కావ‌డం ఖాయం. కేసులో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం పొందిన ఏకైక వైసీపీ కీల‌క నాయ‌కుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాత్ర‌మే. ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావ‌డంతో సుప్రీంకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించి, తాత్కాలికంగా అరెస్ట్ కాకుండా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇంకా పూర్తిస్థాయిలో ఆయ‌న‌కు బెయిల్ ద‌క్క‌లేదు.

ఇప్ప‌టికే ఆయ‌న సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ వ‌స్తాన‌ని కూడా సిట్ టీమ్‌కు మిధున్‌రెడ్డి చెప్పారు. ఇదే సంద‌ర్భంలో ముంద‌స్తు బెయిల్ కోసం జ‌గ‌న్‌కు నీడ‌లా ఉండే ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, ఊర‌ట ద‌క్క‌లేదు. దీంతో వాళ్లిద్ద‌రు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

ఒకే కేసుకు సంబంధించిన పిటిష‌న్లు కావ‌డంతో మిథున్‌రెడ్డి బెయిల్‌తో పాటు వాళ్లిద్ద‌రివి కూడా ఒకేసారి విచారిస్తామ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. దీంతో అరెస్ట్ చేస్తార‌నే ఆందోళ‌న‌తో ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, అలాగే జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువు ఔటాఫ్ క‌వ‌రేజ్ ఏరియాలోకి వెళ్లిన‌ట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో ముంద‌స్తు బెయిల్ దొరికిన త‌ర్వాతే, వాళ్లంతా బ‌య‌టికి వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక‌వేళ సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్క‌క‌పోతే, వ్యూహాత్మ‌కంగా లొంగిపోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

11 Replies to “జ‌గ‌న్ స‌న్నిహితులు ఔటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా”

  1. ఏమిటి కోర్టు దొబ్బమంటే గతిలేక లొంగిపోయేదన్ని కూడా మీ భాష లో వ్యూహాత్మకం అంటున్నారా ఈ మధ్య

    1. జగన్  టీం ఏం చేసినా వ్యూహాత్మకమే అంటున్న మేదావులు, విశ్లేషకులు 

    1. అన్నయ్య కి సెల్ ఫోన్ లేద, అసలకి ఫోన్ నెంబరే లేదు.

  2. అసలు ఈ లిక్కర్ పాలసీలు ఇంకా బ్రిటిష్ కాలంలో జనాలను దోసుకోవడానికి వేలం పాట పెట్టి జనాలని మొదట వేలం పాడిన వాడిని ప్రభుత్వం దోసుకుంటది ఇంక వాళ్ళు జనాల మీద పడి  దోసుకుంటారు . ఇప్పుడు వాళ్ళకి రాజకీయనాయకులు , అవినీతి అధికారులు తోడయ్యారు . అసలు GST వచ్చాక ఏదోఒక % నిర్ణయించి మార్కెట్ లోకి వదిలితే అంతా అదే పారదర్సకం అయిపోతుంది 

    1. మన సమాజం ఇంకా అంత విచక్షణ కు రాలేదు ఇప్పటికీ డబ్బు మందు ఇస్తే 100 మర్డర్ లు చేసే వానికి కూడా ఓట్లేస్తాయి మన గొర్రెలు అందుకే కొన్ని కంట్రోల్స్ ఉండాలి  కానీ మీరన్నట్లు దోపిడీ ప్రభుత్వమే చెయ్యడం తప్పు

Comments are closed.