నా అన్వేష్‌పై కేసు నమోదు!

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌నే కార‌ణంతో ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ అన్వేష్‌పై హైద‌రాబాద్ సైబర్‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌నే కార‌ణంతో ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ అన్వేష్‌పై హైద‌రాబాద్ సైబర్‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌పంచ యాత్రికుడిగా తెలుగు యూట్యూబ‌ర్ అన్వేష్‌కు సోష‌ల్ మీడియాలో గుర్తింపు వుంది. ఇటీవ‌ల కాలం ఆయ‌న బెట్టింగ్ యాప్‌లు చేస్తున్న సెల‌బ్రిటీల గురించి వీడియోలు చేస్తూ, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల్ని, పోలీస్ అధికారుల్ని కోరుతున్నారు.

బెట్టింగ్ యాప్‌లు ఎంతో మంది అమాయ‌కుల జీవితాల‌ను నాశ‌నం చేశాయి, చేస్తున్నాయి. వీటిపై ఈ మ‌ధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. డ‌బ్బుకు ఆశ‌ప‌డి బెట్టింగ్ యాప్‌లను ప్ర‌మోట్ చేసిన ప‌లువురు సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీల‌పై కేసుల న‌మోదుతో పాటు వాళ్ల‌ను విచారించారు. కొంద‌రు తెలియ‌క త‌ప్పు చేశామ‌ని, క్ష‌మించాల‌ని బ‌హిరంగంగా కోరారు.

అయితే బెట్టింగ్ యాప్‌ల‌ను హైదరాబాద్ మెట్రోరైలులో ప్రమోట్ చేస్తుండ‌డంపై తెలంగాణ హైకోర్టుకు ప‌లువురు ఫిర్యాదు చేశారు. మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఆరోపణలు చేశారు. కానీ అన్వేష్ ఆరోప‌ణ‌లన్నీ నిరాధార‌మైన‌వ‌ని, అత‌నిపై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు.

అన్వేష్ చేసిన వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతి కుమారి, ఐఏఎస్‌లు దాన కిషోర్, వికాస్ రాజ్‌‌లపై ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారనేది అన్వేష్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్వేష్ ఆరోపించాడ‌ని కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సుమోటో‌గా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇలాంటి వీడియోల కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరుతో పాటు అధికారుల విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తింటుంద‌ని ఆ ఫిర్యాదులో కానిస్టేబుల్ పేర్కొన్నారు.

8 Replies to “నా అన్వేష్‌పై కేసు నమోదు!”

  1. మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ అనుమతించినవాడిని వదిలేసి, అవి ఉన్నాయని చెప్పిన వాడి మీద కేసులా? గొప్ప ప్రభుత్వం.

  2. వీడు మాట్లాడే ఏ కదా లో నైనా.. సొల్లు ఎక్కువ విషయం తక్కువ ఉంటుంది. ఇక ఇప్పటి నుండి అతి వాగుడు.. అసందర్భపు, ఆవసరపు.. సొల్లు.. ఆపేస్తాడని ఆశిద్దాం.

  3. వీడు మాట్లాడే ఏ కథ లో నైనా.. సొల్లు ఎక్కువ విషయం తక్కువ ఉంటుంది. ఇక ఇప్పటి నుండి అతి వాగుడు.. అసందర్భపు, ఆవసరపు.. సొల్లు.. ఆపేస్తాడని ఆశిద్దాం.

  4. ఇంతకీ మెట్రో రైల్వే లో బెట్టింగ్ యాప్ లు కి ప్రచారం కి వీళ్లు అనుమతి ఇచ్చారా లేదా ? గ్రేట్ ఆంధ్ర కి దమ్ము వుంటే ఆ విషయం నిజామా అబద్ధం నా అనేది రాసి, ఈ విజయం రాస్తే అప్పుడు స్నిజంగా గ్రేట్ న్యూస్ రాసినట్లు.

Comments are closed.