మేం కూడా మందు కొడతాం – నాని

బాలీవుడ్ లో ఉన్నంత పార్టీ కల్చర్ టాలీవుడ్ లో లేదు. అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటాం

బాలీవుడ్ లో హీరోలంతా భలేగా కలుస్తారు. వీకెండ్ వస్తే చాలు పార్టీలు చేసుకుంటారు. తామంతా ఎంజాయ్ చేశామంటూ మీడియాకు ఫొటోలు కూడా ఇస్తారు. మరి ఇంత ఊపు టాలీవుడ్ లో ఎందుకు కనిపించదు?

టాలీవుడ్ లో కూడా పార్టీలుంటాయి. కాకపోతే ఆ ఊపు బయటకు కనిపించదంటున్నాడు నాని. బాలీవుడ్ తరహాలో వీకెండ్ వస్తే పార్టీలుండవని, ఏదైనా మంచి సందర్భంలో అంతా కలుసుకొని మందు కొడతామని అన్నాడు.

“బాలీవుడ్ లో ఉన్నంత పార్టీ కల్చర్ టాలీవుడ్ లో లేదు. అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటాం. బాలీవుడ్ లో పైకి కనిపించే రేంజ్ లో పార్టీలు చేసుకుంటారు. మా పార్టీలు అలా పైకి కనిపించవు. మేం చేసుకునే పార్టీల్ని బయటకు చూపించాలనుకోం. మ్యాగ్జిమమ్ ఇళ్లల్లోనే మా పార్టీలుంటాయి. డ్రింక్ చేస్తాం, డిన్నర్ చేస్తాం.”

ఇలా టాలీవుడ్ లో కూడా పార్టీ కల్చర్ ఉందన్నాడు నాని. ఏదైనా సినిమా హిట్టయినప్పుడు, ఎవరైనా ఏదైనా ఘనత సాధించినప్పుడు తప్పకుండా పార్టీలుంటాయని అంటున్నాడు. అప్పుడు హీరోలందరం కలుస్తామని అంటున్నాడు.

టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయికి చేరిందని, కాబట్టి భవిష్యత్తులో టాలీవుడ్ లో జరిగే పార్టీలు కూడా బాలీవుడ్ రేంజ్ కు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ జోక్ చేశాడు నాని.

2 Replies to “మేం కూడా మందు కొడతాం – నాని”

Comments are closed.