జగదాంబా రీల్స్

జగదాంబా జంక్షన్ లో కొత్తగా అమర్చిన క్లాక్ టవర్ ఈ ప్రాంతానికి సరికొత్త అందంగా మారింది.

విశాఖను సినిమా రాజధానిగా ప్రభుత్వాలు చేస్తాయో లేదో తెలియదు కానీ ఔత్సాహిక సినీ ప్రేమికులు సినిమా కోసం పరితపిస్తూ తమ శక్తి కొద్దీ ఈ రంగంలోకి రావాలని చూసే వారికి మాత్రం విశాఖ ఊపిరిపోస్తోంది అనే చెప్పాలి.

విశాఖలో కీలకమైన ప్రదేశాలు యూట్యూబర్స్ కి రీల్స్ చేసేవారికి ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. తమకు అందుబాటు ధరలలో ఉన్న ఒక కెమెరాను తీసుకుని రీల్స్ చేసే వారికి విశాఖలో కొదవలేదు ఇక వారికి విశాఖ అందాలు కూడా ఎంతో ఊతమిస్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖ జగదాంబా జంక్షన్ లో రీల్స్ చేసే వారి సందడి బాగా పెరిగింది. పొద్దుపొద్దున్నే వారంతా కెమెరాలు చేతబట్టుకుని రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అంతే కాదు చిన్నపాటి షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ జగదాంబా ప్రాంతాన్ని షూటింగ్ స్పాట్ గా మార్చేస్తున్నారు.

పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ చేసేవారి సంఖ్య ఇక్కడ కనిపిస్తోంది. జగదాంబా జంక్షన్ లో కొత్తగా అమర్చిన క్లాక్ టవర్ ఈ ప్రాంతానికి సరికొత్త అందంగా మారింది. దాంతో దానిని తమ ఫ్రేం లో బంధిస్తూ ఆ పరిసరాలలో షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేస్తున్నారు.

ఇలా సందడి సందడిగా ఈ ప్రాంతం నిత్యం కనిపిస్తోంది. విశాఖ బీచ్ నే ఇంతకాలం సినీ కెమెరాలు ఆసక్తిగా చూసేవి. ఇపుడు జగదాంబా జంక్షన్ కూడా దానిని మించి ఆకర్షిస్తోంది. యువత తమ టాలెంట్ ని పదును పెట్టడానికి ఈ లోకేషన్ ని చాలా చక్కగా వాడుకుంటున్నారు.

ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు అంటారు. అలాగే ఏ షార్ట్ ఫిల్మ్ తో ఎవరి టాలెంట్ బయటపడి విశ్వవ్యాప్తం అవుతుందో కూడా తెలియదు. ఈ రోజు షార్ట్ ఫిల్మ్ మేకరే రేపటి మెగా ఫోన్ పట్టే మేకర్ కావచ్చు. అందుకు సరిపడా ప్రోత్సాహాన్ని మాత్రం జగదాంబా జంక్షన్ ఇస్తోంది. విశాఖ సినిమా రంగానికి కేరాఫ్ అని ఎవరు అన్నా అనకపోయినా ఔత్సాహికులు మాత్రం షార్ట్ ఫిలిమ్స్ సాక్షిగా ఒట్టేసి చెబుతున్నారు.

2 Replies to “జగదాంబా రీల్స్”

  1. ఇండియన్స్ కి దేముడు టైం అండ్ స్మార్ట్ ఫోన్ ఇచ్చి తప్పుచేసాడు. కొందరు రీల్స్ చేస్తే కొందరు తప్పుల తడ”కుల” రాతలు రాస్తూ జీవితం కరిగించేస్తారు. I have no time to see replies you see. Just move on.

Comments are closed.