పైకి కోపంగా ముఖం పెట్టినా, ఖండన ప్రకటనలు ఎన్ని చేసినా, కొన్ని పుకార్లను కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్ లో హీరోయిన్లు ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు మనకు హీరోలు కూడా తగులుతుంటారు. ఇప్పుడు శ్రీవిష్ణు ఇందులోకి యాడ్ అయ్యాడు.
‘సామజవరగమన’ సినిమా తర్వాత శ్రీవిష్ణు అమాంతం తన రెమ్యూనరేషన్ పెంచేశాడట. ఇదీ ఇతగాడిపై వచ్చిన పుకారు. ఆ పుకారులో నిజం లేదంటూనే, దాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు శ్రీవిష్ణు.
ఆ కథనాల క్లిప్పింగ్స్ ను తనకు చాలామంది పంపించారని, కొందరు తనను నేరుగా కూడా అడిగారని అన్నాడు శ్రీవిష్ణు. అంత రెమ్యూనరేషన్ వస్తే బాగుణ్ను అనే ఫీలింగ్ తనకు కూడా వచ్చిందన్నాడు. బయటకొచ్చిన నంబర్ లో సగం మొత్తానికే సినిమా చేస్తానంటూ, తనను అడిగిన చాలామందికి జవాబిచ్చాడు శ్రీవిష్ణు.
ఈ పుకార్లపై మరింత స్పష్టంగా స్పందిస్తూ.. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నీ ‘సామజవరగమన’ కంటే ముందే కమిట్ అయ్యానని, అలాంటప్పుడు రెమ్యూనరేషన్ పెంచడం అనే చర్చకు తావులేదంటున్నాడు శ్రీవిష్ణు.
అయితే ఇలాంటి పుకార్ల వల్ల మంచి కథలు మిస్సయ్యే ప్రమాదం ఉంది కదా అనే ప్రశ్నను తేలిగ్గా తీసుకున్నాడు. రాసిపెట్టి ఉంటే కథలు వాటంతట అవే వస్తాయన్నాడు.
Andharu rumours ki bayapadithe veedu overaction
Manchi vallu rumours ki bhayapadu thuntaru yendhukante cheyanii thapuku nindhalu moyalekha