పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్లానింగ్ ఎలా వుండబోతోంది. ఇది ఎవరికీ అంత సులువుగా అంతు పట్టదు. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ సినిమానే అని అంతా అనుకుంటూ వుంటూ అట్లీ సినిమాను తెరమీదకు తెచ్చారు. అంతకు ముందు చాలా దర్శకుల పేర్లు వినిపించాయి. నిజానికి ఆ దర్శకులు అందరికీ బన్నీతో చేయాలనే వుంది. కానీ బన్నీ కొన్ని నార్మ్స్ పెట్టుకుని అట్లీని ఎంచుకున్నారు. ఈ ఎంచుకోవడంలో త్రివిక్రమ్ సినిమా వెనక్కు వెళ్లిపోయింది.
ఇక్కడ బయటకు వినిపిస్తున్నది ఒకటే. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ దాదాపు రెండేళ్లు పడుతుంది. ఇప్పటికే పుష్ప సిరీస్ మీద చాలా ఏళ్లు వుండిపోయారు కనుక, అర్జంట్ ఓ సినిమా చేసి వదిలాలి. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా అన్న మాట వినిపిస్తోంది. ఇది నిజమేనా అన్నది అనుమానం. ఎందుకు అంటే.. అట్లీ సినిమా ఏమీ చిన్న సినిమా కాదు. భారీ సిజి వర్క్ వున్న సినిమా. అది కూడా కనీసం ఏడాదికి పైగానే పడుతుంది థియేటర్ లోకి రావడానికి. అందువల్ల త్రివిక్రమ్ సినిమాను కేవలం నిర్మాణానికి టైమ్ పడుతుందనే కారణంతో వెనక్కు పెట్టి వుంటారు అని అనుకోవడానికి లేదు.
పైగా సమాంతరంగా రెండు సినిమాలు చేస్తారు అన్నది మరో మాట. ఇది సాధ్యమేనా అన్నది అనుమానం. త్రివిక్రమ్ సినిమా మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ. అట్లీ సినిమా వేరు. పైగా సినిమా సినిమాకు బన్నీ గెటప్ లు వేరు. ఇలా సమాంతరంగా రెండు సినిమాలు చేయడం అన్నది అంత సులువుగా సాధ్యం అయ్యేది కాదు.
పోనీ అట్లీ సినిమా తరువాత కచ్చితంగా త్రివిక్రమ్ సినిమా వుంటుంది అని నమ్మడానికి వుందా? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. బన్నీ కి మాత్రమే సమాధానం తెలుసు.
అట్లీ సినిమా బ్లాక్ బస్టర్ అయితే బన్నీ మరో లెవెల్ లో వుంటారు. అప్పటికి మోస్ట్ హ్యాపెనింగ్ పాన్ ఇండియా మాస్ డైరక్టర్లు గా ఎవరు ఎమర్జ్ అవుతారో తెలియదు. ఎవరు మంచి కథ రెడీ చేస్తారో తెలియదు. అప్పుడు బన్నీ కచ్చితంగా అటు మొగ్గే అవకాశం వుంటుంది.
లేదూ, అట్లీతో చేసిన సినిమా బై బ్యాడ్ లక్ ఓ మాదిరిగానే ఆడింది అనుకుందాం. అప్పుడు బన్నీ వచ్చి త్రివిక్రమ్ తో మైధలాజికల్ టచ్ ప్రయోగం చేయరు. టైలర్ మేడ్ గా వున్న క్రేజీ ఫ్రాంచైజీ పుష్ప 3 వుండనే వుంటుంది కదా. దానికి వెళ్లడం చాలా అంటే చాలా సేఫ్ గేమ్ అవుతుంది.
అందువల్ల త్రివిక్రమ్-బన్నీ సినిమా అన్నది కేవలం బన్నీ ఆలోచన మీద ఆధారపడి వుంటుంది తప్ప వేరు కాదు. అందుకే త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తోనో, శివకార్తికేయన్ తోనో, లేదూ అంటే ఇద్దరితోనో సినిమాలు ప్లానింగ్ లో వున్నారనుకోవాలి.
ఎందుకంటే ఇక మన టాప్ హీరోలు త్రివిక్రమ్ కు దొరకడం అంత సులువు కాదు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్ వీళ్లకు ఎవరి లైనప్ వారికి వుంది. పైగా వీళ్లందరి దృష్టిలో త్రివిక్రమ్ మంచి దర్శకుడు. తెలుగులో టాప్ డైరక్టర్లలో ఒకరు. అందులో సందేహం లేదు.
కానీ దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకురాగలిగిన ప్రాజెక్ట్ కు యాడ్ చేయగలిగిన పేరు కాదు. యువ సంచలన దర్శకుల పేర్లు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. త్రివిక్రమ్ ఏదో ఒక సరైన ప్రాజెక్ట్ చేస్తే తప్ప అలా మారు మోగదు. బన్నీతో ప్రాజెక్ట్ కనుక మొదలు అయితే త్రివిక్రమ్ పేరు దేశం అంతా వినిపించేది. కానీ ఇప్పుడు మళ్లీ వెంకటేష్ దగ్గరకు వెళ్లడం అంటే వేరు.
ఏదైనా బన్నీ మదిలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు.
Ee article valla deshaniki emanna upayogama balaraju
Today 1 hour pandula pempakam program akshi lo??? At what time vachindhi ??
సేమ్ .. జగన్ ప్లానింగ్ లానే ఉంటుంది ..
Pakkodi muddi kadigi …
Vaasana chusukovadam ante ide