సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు షాక్‌

సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు షాక్ త‌గిలిగింది

సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు షాక్ త‌గిలిగింది. గ‌తంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు విశాఖ‌లో ఫిల్మ్ సిటీ కోసం భూముల్ని కేటాయించారు. అయితే భూముల కేటాయింపు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా కాకుండా, ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఆ ఉత్త‌ర్వుల్ని ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దంటూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు నోటీసు ఇచ్చింది. ఆ భూమిని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడానికి వాడుకుంటున్న‌ట్టు కూట‌మి ప్ర‌భుత్వం గుర్తించి, చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

2003లో అప్ప‌టి ప్ర‌భుత్వం విశాఖ‌లో సినీ స్టూడియో నిర్మాణం నిమిత్తం 34.44 ఎక‌రాల‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు కేటాయించింది. అయితే ఇందులో 15.17 ఎక‌రాల‌ను రెసిడెన్సియ‌ల్ ప్లాట్ల‌గా మార్చుకోడానికి వైసీపీ ప్ర‌భుత్వానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద‌ర‌ఖాస్తు చేయ‌డం, అందుకు అనుగుణంగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు ఇచ్చిన మిన‌హాయింపుపై క‌న్నెర్ర చేసింది. అయితే ఎలాగైనా భూమిని కాపాడుకోవాల‌నే ఉద్దేశంతో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ న్యాయ పోరాటానికి దిగింది.

త‌మ‌కు కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన నోటీస్‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఆశ్ర‌యించింది. ఇవాళ సుప్రీంకోర్టులో జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఒకా ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. మ‌ధ్యంత‌ర ఉప‌శ‌మ‌నం ఎందుకు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. అలా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది.

పిటిష‌న్‌పై జోక్యం చేసుకోడానికి ధ‌ర్మాస‌నం నిరాక‌రించ‌డంతో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ప్ర‌భుత్వం ఇచ్చిన నోటీసుపై కిందిస్థాయి కోర్టును ఆశ్ర‌యించాల‌ని జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఒకా సూచించారు. దీంతో పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అభ్య‌ర్థించింది. ఇందుకు న్యాయ స్థానం అంగీక‌రించింది.

14 Replies to “సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కు షాక్‌”

  1. ఒరేయ్ సన్నాసి…అసలు షాక్ ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అని ఉత్తర్వు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వానికి కదా

    1. సచ్చిన శవాలకు షాకులు తగలవు.. షాక్ ప్రూఫ్ అని డప్పులు కొట్టుకోవచ్చు..

    2. కింది court కు వెళ్ళమంది అక్కడే తేల్చుకోమంది అంతేకాని వ్యతిరేకం గా తీర్పు రాలేదు   మోడీ ఈసారి మట్టి కూడా ఇవ్వలేదు shock లో ఉన్నట్టున్నారు అర్ధం కాదులే

      1. పిచ్చి వెధవలు అంతకు మించి ఆలోచించలేరులే…అమరవాయి కి కావాల్సిన ౩౦ వేల కోట్లు ఆల్రెడీ రెడీ గ ఉందిలే…రైల్వే లైన్ ఆల్రెడీ ఇచ్చరులే. ఇన్నర్ రింగ్ రోడ్ కేంద్రం ఖర్చు భరిస్తుందిలే. అదే వేదిక మీద ఉత్తరాంధ్ర, రాయలసీమ లో రైల్వే , రోడ్ ప్రాజెక్టులు శంకుస్థాపన, జాతికి అంకితం చేసారులే…మోడీ హిందీ లో చెప్పాడు గా మన నిషాని బ్యాచ్ కి అర్ధం కాదులే

  2. అన్నియ సురేష్ బాబు ని బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాడు… వాళ్లకి plotting చేయాల్సిన అవసరం లేదు

  3. ఎరా నికార్సైన న్యూట్రల్ జర్నలిస్ట్ ఎంకి!! అంత పెద్ద ఈవెంట్, స్వయంగా దేశ ప్రధాని వచ్చారు, అంత మంది ప్రజలు వచ్చారు, న్యూస్ ఎదిరా??  కడుపుమంటకి ENO వాడు తగ్గిపొద్దిలే!!

    1. మంట ఎక్కువై బాత్రూమ్ కి వెళ్లి ఈవెంట్ మిస్ అయ్యాడు…ఇప్పుడు రాస్తే మళ్ళి అన్న బాత్రూం కి రమ్మంటే …Who is responsible?

      1. Okavela 2029 lo jagan garu cm ite అమరావతి nundi rule cheyara okavela elopu అమరావతి పర్మినెంట్ క్యాపిటల్ ite jagan garu cm avvara inka 

  4. ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ ని ప్రోత్సహించే భాగంలో అక్కడ స్టూడియో నిర్మాణానికి ల్యాండ్ కేటాయించారు. దానిని రియల్ ఎస్టేట్ బిజినెస్ కి ఉపయోగిస్తామంటే ఎలా GA?

Comments are closed.