నా ప‌క్క‌న ఆయ‌న‌.. కొంద‌రికి నిద్ర‌లేని రాత్రులు!

త‌న‌తో పాటు థ‌రూర్ పాల్గొన‌డం కొంద‌రికి న‌చ్చ‌ద‌ని ప్ర‌ధాని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

కేర‌ళ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ కీల‌క కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్‌, సోనియాగాంధీ త‌దిత‌రుల‌కు నిద్ర‌లేని రాత్రులు మిగులుతాయ‌ని ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ‌లో రూ.8,867 కోట్ల ఖ‌ర్చుతో చేప‌ట్టిన విజింజం అంత‌ర్జాతీయ ఓడ‌రేవును శుక్ర‌వారం ఆయ‌న ప్రారంభించారు. ఈ సీ పోర్ట్ అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ (లి) ఆధ్వ‌ర్యంలో ప‌బ్లిక్‌-ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో అభివృద్ధి చేశారు.

తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌యంలో విమానాశ్ర‌యంలో స్థానిక కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స్వ‌యంగా ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్ర‌ధానితో పాటు శ‌శిథ‌రూర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ త‌న‌తో పాటు శ‌శిథ‌రూర్ వేదిక‌పై కూచున్నార‌న్నారు. త‌న‌తో పాటు థ‌రూర్ పాల్గొన‌డం కొంద‌రికి న‌చ్చ‌ద‌ని ప్ర‌ధాని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రికి ఇది నిద్ర‌లేని రాత్రుల్ని మిగిలిస్తుంద‌ని ప్ర‌ధాని ప‌రోక్షంగా రాహుల్‌, సోనియాను దెప్పి పొడిచారు.

తిరువ‌నంత‌పురం నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు కాంగ్రెస్ త‌ర‌పున శ‌శిథ‌రూర్ ఎంపీగా గెలుపొందారు. కొంత కాలంగా ఆయ‌న అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. కేంద్ర మంత్రితో ఆయ‌న భేటీ అయిన నేప‌థ్యంలో బీజేపీలో చేరుతార‌న్న ప్ర‌చారానికి ఊతం ఇచ్చింది. తాజాగా ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌ల‌క‌డం, ఆయ‌న‌తో పాటు స‌భ‌లో పాల్గొన‌డంతో కాంగ్రెస్‌కు దాదాపు శ‌శి దూరం అయ్యార‌నే ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది.

అలాగే శ‌శిథ‌రూర్‌ని పొగ‌డ‌డం, తన‌తో అతను పాల్గొన్న కార‌ణంగా కొంద‌రికి నిద్ర‌లేని రాత్రులు మిగిల్చుతుంద‌ని కామెంట్స్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ముందే బీజేపీతో శ‌శిథ‌రూర్ అవ‌గాహ‌న‌కు రావ‌డం వ‌ల్లే ప్ర‌ధాని ఆ ర‌కంగా మాట్లాడార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కేర‌ళ‌లో బీజేపీ పాగా వేయాల‌ని అనుకుంటోంది. అందుకే శ‌శిథ‌రూర్‌ని పార్టీలో చేర్చుకుని, ముందుకెళ్లాల‌ని బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం ఉత్సాహం చూపుతోంది.

5 Replies to “నా ప‌క్క‌న ఆయ‌న‌.. కొంద‌రికి నిద్ర‌లేని రాత్రులు!”

    1. Ys రాజశేఖర్ రెడ్డి ది హత్య అని గొడవ చేశాడు జగన్ రెడ్డి.

      సరే, సీబీఐ విచారణ చేద్దాం అంటే, చప్పున వద్దు వద్దు అని అమిత షా నీ బతిమిలాడి, ఆ సీబీఐ విచారణ ఆపేసుకున్నాడు. 

      ఒకవేళ సీబీఐ విచారణ చేస్తే, నిజం బయట పడితే , చేసిన వాడి కాదా భయం పడాలి. జగన్ రెడ్డి కి భయం ఎందుకు? అంటే.. అది.. నిజం నే నా…

Comments are closed.