ఈ ఏడాది ప్రారంభంలోనే స్పిరిట్ సెట్స్ పైకి వస్తుందన్నారు. కట్ చేస్తే, ప్రభాస్ ఫౌజీతో బిజీ అయ్యాడు. దీంతో సమ్మర్ లో రెగ్యులర్ షూటింగ్ అన్నారు. కానీ ఈ వేసవిలో కూడా స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వచ్చేలా లేదు. హీరో ప్రభాస్ ఇటలీ వెళ్లాడు. మరో నెల రోజులు అక్కడే ఉండబోతున్నాడు.
సో.. సమ్మర్ తర్వాతే స్పిరిట్ మొదలవుతుంది. అలా అని జూన్ లేదా జులైలో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. ఆ 2 నెలలు ఫౌజీ మూవీకి కాల్షీట్లు కేటాయించాడట ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వస్తుంది. ఎక్కువ భాగం షూటింగ్ మెక్సికోలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ నుంచి బల్క్ కాల్షీట్లు కోరాడంటూ గతంలోనే వెల్లడించాం. మేకోవర్ చెడిపోకుండా, కంటిన్యుటీ దెబ్బతినకుండా ఉండేందుకు వంగ ఈ కోరిక కోరాడు. అందుకు తగ్గట్టే సెప్టెంబర్ నుంచి ఏకథాటిగా స్పిరిట్ పైనే వర్క్ చేస్తాడట ప్రభాస్. దాదాపు 3 నెలల పాటు ఈ సినిమాపై వర్క్ చేసి టాకీ పార్ట్ పూర్తిచేయాలనుకుంటున్నాడు ప్రభాస్.
చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడట ప్రభాస్. తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్న ఈ నటుడు, సందీప్ వంగ సూచనల మేరకు తన ఫిజిక్ ను మార్చుకోబోతున్నాడు. మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది.
సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత నటీనటుల వివరాల్ని వెల్లడిస్తారు. టీ-సిరీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.