హీరోయిన్లపై పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎలాంటి పుకార్లు వస్తాయో అందరికీ తెలిసిందే. ఇలా పెళ్లయిందో లేదో అలా గర్భం దాల్చిందంటూ పుకార్లు వస్తుంటాయి. బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే ఈ తరహా రూమర్స్, ఇప్పుడు టాలీవుడ్ లో కనిపిస్తున్నాయి. ఒకేసారి ఇద్దరు హీరోయిన్లపై ఈ తరహా గాసిప్స్ రావడం విశేషం. ఆ ఇద్దరే శోభిత ధూలిపాళ అక్కినేని, లావణ్య త్రిపాఠి కొణెదల.
2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ఇప్పుడీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని, తొలి సంతానాన్ని ఆహ్వానించబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. మెగా కాంపౌండ్ లోకి త్వరలోనే ఓ వారసుడు అడుగుపెట్టబోతున్నాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేయడం కనిపిస్తోంది.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది లావణ్య త్రిపాఠి. అయితే ఈ మధ్య ఆమె కాస్త బ్రేక్ ఇచ్చారు. గర్భం దాల్చడం వల్లనే ఆమె కెరీర్ కు బ్రేక్ ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది.
అటు శోభిత ధూలిపాళపై కూడా ఇవే తరహా పుకార్ల వినిపిస్తున్నాయి. కొన్ని నెలల కిందటే నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా ఇద్దరూ కలిసి కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశారు. అందులో ఆమె గర్భం దాల్చిన ఛాయలేవీ కనిపించలేదు. అంతలోనే ప్రెగ్నెన్సీ పుకార్లు రావడం సంచలనంగా మారింది.
ఈ పుకార్లు రావడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. తాజాగా వేవ్స్-2025 సమ్మిట్ కు భర్త నాగచైతన్యతో కలిసి హాజరైంది శోభిత. అందులో ఆమె చీరకట్టు డిఫరెంట్ గా ఉండడం బాలీవుడ్ మీడియాను ఆకర్షించింది. దీంతో సహజంగానే అక్కడ్నుంచి ఇలాంటి పుకార్లు మొదలయ్యాయి. ఇక కెరీర్ పరంగా కూడా శోభిత కాస్త జోరు తగ్గించడం ప్రెగ్నెన్సీ పుకార్లకు ఊతమిచ్చింది.
Illanti pukaarlu start chesedhe media, comments moderate chesevadivi neeku idhi okka lekhana
Oray GA, publish more articles today.. Raju kasarla looking for overtime payment today. May be he took off to work to get to be overpaid, also drinking Enos for his kadupu manta.
Oray GA, p ub lish more articl es today.. Raju kasarla looking for o vert ime paym ent today. May be he took off to wo rk to get to be overpa id, also drink ing Enos for his kadupu manta.