ఈ పాపకు ఇంకేం పని లేదా?

10 రూపాయలిస్తే 100 రూపాయల యాక్షన్ చేస్తుంది ఊర్వశి రౌతేలా. అది కూడా తెరపై కాదు, నిజజీవితంలో ఓవరాక్షన్ చేయడం ఈమెకే చెల్లింది.

10 రూపాయలిస్తే 100 రూపాయల యాక్షన్ చేస్తుంది ఊర్వశి రౌతేలా. అది కూడా తెరపై కాదు, నిజజీవితంలో ఓవరాక్షన్ చేయడం ఈమెకే చెల్లింది. సందర్భం ఏదైనా సొంత డబ్బా కొట్టుకోవడం, కోరి వివాదాలు కొనితెచ్చుకోవడం ఈమె హాబీ.

ఇప్పుడు కూడా అదే పని చేసింది ఊర్వశి రౌతేలా. తమన్నాతో తననుతాను పోల్చుకొని, తనే గొప్ప అన్నట్టు కలరింగ్ ఇచ్చింది.

రీసెంట్ గా తమన్నా నుంచి హిందీలో ఓ ఐటెంసాంగ్ రిలీజైంది. జాట్ అనే సినిమాలో ఊర్వశి కూడా ఐటెంసాంగ్ చేసింది. ఈ రెండూ కంపేర్ చేస్తూ, తమన్నాను కించపరిచేలా పోస్టు పెట్టింది ఊర్వశి.

దీంతో ఆమెపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. నీకేం పనిలేదా అంటూ తెగ కామెంట్స్ పడ్డాయి. దీంతో ఆ పోస్టును డిలీట్ చేసింది. గేమ్ చేంజర్ రిలీజ్ టైమ్ లో కియరా అద్వానీపై కూడా ఇలానే కామెంట్స్ చేసింది ఊర్వశి.

ఈ ఏడాది తొలి వంద కోట్ల హీరోయిన్ ను తానేనంటూ గతంలో గొప్పలు చెప్పుకుంది ఊర్వశి రౌతేలా. ‘డాకు మహారాజ్’ సినిమాతో తను స్టార్ అయిపోయానని బిల్డప్పులు ఇచ్చుకుంది. కట్ చేస్తే ఆ సినిమా బాలీవుడ్ లో డబుల్ డిజాస్టర్ అయింది.

మరో సందర్బంలో సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడని, రియాక్షన్ ఏంటని జర్నలిస్ట్ అడిగితే, తన చేతికున్న డైమండ్ రింగ్, వాచీ చూపించుకొని గప్పాలు కొట్టుకుంది ఊర్వశి. ఇప్పుడిలా తమన్నాపై పోస్టు పెట్టి అడ్డంగా బుక్కయింది.

2 Replies to “ఈ పాపకు ఇంకేం పని లేదా?”

Comments are closed.