వెలికితీత మొదలుపెట్టిన నాగచైతన్య

ఈ సినిమాకు వృష కర్మ అనే వెరైటీ టైటిల్ పెట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

మొన్ననే ఓ ఇంటర్వ్యూలో తన కొత్త సినిమా విశేషాలు చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఫ్లోలో మాట్లాడుతూ సినిమా పేరు కూడా చెప్పేశాడు. అయితే వీడియోలో దాన్ని మ్యూట్ చేశారు.

కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ హీరోగా వస్తున్న సినిమాకు సంబంధించి ఈరోజు వీడియో రిలీజ్ చేశారు. వెలికితీత/త్రవ్వకం మొదలైంది అనే క్యాప్షన్ తో సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని వెల్లడించారు.

90 సెకెన్ల నిడివి గల వీడియో ఆసక్తికరంగా ఉంది. మంచి సెట్స్ వేశారని, హై-ఎండ్ గ్రాఫిక్స్ కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయనే విషయాన్ని వీడియోలో చూపించారు. అజనీష్ లోకనాధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పట్లానే చాలా బాగుంది.

అంతేకాదు, ఈ సినిమాలో నాగచైతన్య కాస్త ట్రెండీగా హిపాప్ స్టయిల్ లో కనిపించబోతున్నాడనే విషయాన్ని కూడా చూచాయగా వెల్లడించారు. ఈ సినిమా తన కెరీర్ లోనే పెద్ద సినిమా అన్నాడు.

“ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్. చాలా విజువల్ ఎఫెక్టులుంటాయి. సినిమాపై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాను. నా 15 ఏళ్ల కెరీర్ లో ఇంత స్పాన్ ఉన్న సినిమా చేయలేదు. అడ్వెంచర్, ట్రెజర్ హంట్ జోన్ లో సినిమా ఉంటుంది.”

ఈ సినిమాకు వృష కర్మ అనే వెరైటీ టైటిల్ పెట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇంటర్వ్యూలో చైతూ ఇదే పేరు లీక్ చేశాడంటున్నారు చాలామంది.

Naga