ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడం అన్నది ఆంధ్రలో కామన్ అయిపోయింది. అడిగితే చాలు యాభై రూపాయలు పెంచుకోండి.. 75 రూపాయలు పెంచుకోండి అంటూ ప్రభుత్వం చాలా ఉదారంగా ఆదేశాలు ఇచ్చేస్తోంది. కానీ జనాలు మాత్రం ఇదేం అంత బాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
చిన్న సినిమాకు పెంచి, పెద్ద సినిమాకు పెంచి, బ్రేక్ ఈవెన్ ముందే అయిన సినిమాకు పెంచి, కాని సినిమాకు పెంచడం ఏమిటి అని అంటున్నారు. ఒక్కోసారి ఈ రేట్ల పెంపు అనేది సినిమాకు నెగిటివ్ చేస్తోంది కూడా. అలా అని టికెట్ రేట్లు పెంచని సినిమాలకు జనం పొలోమంటూ పరుగెత్తుకు వచ్చేయడం లేదు. నిన్న విడుదలైన సారంగపాణి జాతకం సినిమాకు ఏ రేట్లూ పెంచలేదు. అయినా జనం రాలేదు. మంచి టాక్ వచ్చిన తరువాత కూడా రాకపోవడం విశేషం.
అంటే జనాలు రావడానికి, టికెట్ రేట్లకు సంబంధం లేదు. సినిమా చూడాలని ఆసక్తి వున్న వాళ్లు వస్తారు. అది కూడా ఏ సినిమా చూడాలనుకుంటే దానికి మాత్రమే వస్తారు. మిగిలిన వాటికి రమ్మన్నారారు.
ఇలాంటి నేపథ్యంలో ఈవారం రాబోతున్న హిట్ 3 సినిమా కు టికెట్ రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు అయితే చేసారు. ఇవ్వాళో రేపో 50 రూపాయలు 75 రూపాయల వంతున పెంపు వస్తుంది. అందులో సందేహం లేదు. కానీ జీవో వచ్చిన తరువాత అమలు చేయాలా? వద్దా? అనే మీమాంస లో వుంది హిట్ 3 యూనిట్. ఏపీ, నైజాం మరీ భారీ రేట్లకు ఏమీ అమ్మలేదు. సినిమా బజ్ తో పోల్చుకుంటే ఎపి 15 కోట్లు అన్నది కాస్త రీజనబుల్ నే అనుకోవాలి. రేట్లు లేకపోయినా ఆ ఫీట్ ను అందుకోవచ్చు. కానీ సినిమా యావరేజ్ టాక్ వస్తే కాస్త అనుమానం. అందుకే రేట్లు పెంచడం బెటర్ అనుకుంటోంది యూనిట్.
కానీ ముందు నుంచి ఇది ప్రచారంలోకి వస్తే దీన్ని యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తారని భయపడుతున్నారు. అందుకే ఈ విషయం కాస్త సైలంట్ గా వుంచాలని యూనిట్ చూస్తోంది.
OTT lo chudatame
veedoka santhalo chinthakaya crazy leni hero