డెమీ గాడ్ నుంచి డైలీ గాడ్ వరకు

ఓపెనింగ్ అన్నది తెగడ లేదు దాని వల్ల కంటెంట్ ఓకె అనుకుంటే సినిమా ఆడుతోంది.

సినిమా హీరోలు అంటే డెమీ గాడ్ లు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లను చూడాలంటే చెన్నయ్ వెళ్లే వారు. టూరిస్ట్ బస్ ల టూర్ అట్రాక్షన్ లలో ఎన్టీఆర్ ఇల్లు, ఎఎన్నార్ ఇల్లు, సావిత్రి, జమున ఇళ్లు వుండేవి. సినిమా వాళ్లు జనాల్లో కనిపించడం అంటే చాలా అంటే చాలా రేర్. ఎక్కడన్నా సినిమా షూట్ అనే మాట వినిపిస్తే జనం జాతర మాదిరిగా తరలి వెళ్లేవారు. ఎన్టీఆర్, చిరు, పవన్ రాజకీయాల్లోకి వస్తే జనం పోటెత్తిన కారణం వారిని డెమీ గాడ్స్ లా భావించడమే.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమా జనాలు మాగ్జిమమ్ జనాల్లోనే వుంటున్నారు. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లేదా సోషల్ మీడియా లో నిత్యం కనిపిస్తూనే వున్నారు. ఇది చాలక సినిమా పబ్లిసిటీలో భాగంగా మాల్స్, కాలేజీలు, ఇలా ఎక్కడకు పడితే అక్కడ కనిపిస్తూ వున్నారు. సినిమాలో చేయాల్సిన డ్యాన్స్ లు, డైలాగులు, స్కిట్ లు అన్నీ ఇక్కడే. అంటే సినిమా తప్ప మిగిలిన వ్యవహారాలు అన్నీ జనం కళ్ల ముందుకు ఫ్రీగా వచ్చేస్తున్నాయి. సెలబ్రిటీల డైలీ లైఫ్ అంతా సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంది.

పెద్ద హీరోల సంగతి పక్కన పెడితే మిడ్ రేంజ్, చిన్న హీరోల సినిమాలకు ఇంక ఎందుకోసం రావాలి? హీరోల కోసం కాదు. సినిమాలో కంటెంట్ కోసం. హీరోలకు క్రేజ్ వుంటే కంటెంట్ యావరేజ్ అయినా కాస్త లాక్కు వెళతారు. అదే కనుక హీరోలకు క్రేజ్ లేకపోతే లాక్కు వెళ్లలేరు. కానీ క్రేజ్ అనేది క్రెడిట్ బ్యాలన్స్ లాంటిది. జాగ్రత్తగా దాచుకోవాలి. అంతే తప్ప వాడేసుకుంటే కాదు.

ఇలా ఓపెన్ అవుట్ డోర ప్రచారాలు ఎక్కువ చేయడం ద్వారా సినిమాకు బజ్ వస్తుంది అనుకుంటున్నారేమో కానీ, దాని వల్ల హీరోలు జనాలకు డెమీ గాడ్ ల మాదిరిగా కాకుండా మామూలు మనుషుల్లా అయిపోతున్నారు.

ఓపెనింగ్ అన్నది తెగడ లేదు దాని వల్ల కంటెంట్ ఓకె అనుకుంటే సినిమా ఆడుతోంది. లేదంటే లేదు. ఎంతయినా గుప్పిటలో వున్నపుడు వుండే క్రేజ్ గుప్పిట తీసిన తరువాత వుండదు కదా?

6 Replies to “డెమీ గాడ్ నుంచి డైలీ గాడ్ వరకు”

Comments are closed.